ఇలా పిక్స్ వదిలే ప్లాన్ కరణ్ దా?

పూరి జగన్నాధ్ దర్శకత్వ స్పీడు అందుకోవడం ఏ దర్శకుడికి సాధ్యం కాదేమో. విజయ్ దేవరకొండ తో జనవరి లో మొదలు పెట్టిన పాన్ ఇండియా సినిమాని అప్పుడే [more]

Update: 2020-03-10 05:44 GMT

పూరి జగన్నాధ్ దర్శకత్వ స్పీడు అందుకోవడం ఏ దర్శకుడికి సాధ్యం కాదేమో. విజయ్ దేవరకొండ తో జనవరి లో మొదలు పెట్టిన పాన్ ఇండియా సినిమాని అప్పుడే 40 శాతం షూటింగ్ కంప్లీట్ చేసాడు అంటే పూరి స్పీడు మాటల్లో వర్ణించడం కష్టం. పూరి జగన్నాధ్ స్పీడు విజయ్ దేవరకొండ స్టయిల్, ఎనేర్జి అన్ని కలిపి సినిమా షూటింగ్ ఓ లెవల్లో జరుగుతుంది. ఇక సినిమా షూటింగ్ ఎంత స్పీడు గా జరుగుతుందో అంతే స్పీడుగా పూరి – విజయ్ సినిమా ఫొటోస్ మీడియాలో వచ్చేస్తున్నాయి. ఒక రోజు పూరి జగన్నాధ్ సిగార్ కాలుస్తూ సీరియస్ గా ఆలోచిస్తున్న ఫొటోస్ ని షేర్ చేసిన ఛార్మి నెక్స్ట్ డే పూరీ స్క్రిప్ట్ చెబుతుంటే విజయ్ దేవరకొండ సీరియస్ గా డైలాగ్స్ చదువుకుంటున్న ఫొటోస్ వచ్చాయి. తాజాగా కరణ్ తో కలిసి విజయ్ దేవరకొండ, అనన్య పాండే, పూరి, ఛార్మి కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇక సినిమా వర్కింగ్ సీల్స్ తో పాటుగా అపుడప్పుడు ఇలాంటి ఫొటోస్ బయటికి వదులుతుంటే.. సినిమా మీది భారీ క్రేజ్, హైప్ వస్తుంది అని పూరి అండ్ ఛార్మి కాకుండా కరణ జోహార్ ఇలాంటి ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. మాములుగా విజయ్ దేవరకొండ పై సౌత్ లో భారీ క్రేజ్ ఉంది. ఇక ఆయన స్టయిల్ కి బాలీవుడ్ కూడా ఫిదా.. అయినప్పటికీ.. సినిమాకి ఆ క్రేజ్ చాలదు. అందుకే తరచూ సెట్స్ నుండి, అలాగే అందరు కలిసినప్పుడు ఉన్న ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటే.. విజయ్ లుక్స్, అనన్య గ్లామర్ తోనే సినిమాకి క్రేజ్ వస్తుంది అని కరణ్ జోహార్, ఛార్మి అండ్ పూరి కి సలహా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇలాంటి ఫొటోస్ ని బట్టే సినిమాపై క్రేజ్ పెరిగి భారీ బిజినెస్ జరుగుతుంది అని ఛార్మి కి కూడా తెలుసు. ఇక 40 శాతం షూటింగ్ పూర్తయిన ఈ సినిమా టైటిల్ ఇంకా రివిల్ కాలేదు.

Tags:    

Similar News