లాంగ్ వీకెండ్ డియర్ కామ్రేడ్ కి కలిసొస్తుంది
అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా సినిమాల్తో విజయ్ దేవరకొండ స్టార్ రేంజ్ కి ఎదిగిపోయాడు. ఎంత రేంజ్ పెరిగినా విజయ్ దేవరకొండ తన కష్టాన్ని మర్చిపోవడం [more]
అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా సినిమాల్తో విజయ్ దేవరకొండ స్టార్ రేంజ్ కి ఎదిగిపోయాడు. ఎంత రేంజ్ పెరిగినా విజయ్ దేవరకొండ తన కష్టాన్ని మర్చిపోవడం [more]
అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా సినిమాల్తో విజయ్ దేవరకొండ స్టార్ రేంజ్ కి ఎదిగిపోయాడు. ఎంత రేంజ్ పెరిగినా విజయ్ దేవరకొండ తన కష్టాన్ని మర్చిపోవడం లేదు. అర్జున్ రెడ్డి కాంట్రవర్సీలతో బిగ్గెస్ట్ హిట్ అయితే… గీత గోవిందం కంటెంట్ అదరగొట్టడంతో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక తాజాగా విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ రేపు శుక్రవారమే విడుదల కాబోతుంది. భారీ ప్రమోషన్స్ తో డియర్ కామ్రేడ్ తో కూడా హిట్ కొట్టాలనే కసితో ఉన్న విజయ్ దేవరకొండ. తన లక్కీ హీరోయిన్ రష్మిక మందన్న తో కలిసి భీభత్సమైన ప్రమోషన్స్ చేస్తూ యూత్ ని తెగ ఎట్రాక్ట్ చేస్తున్నాడు. ఇక విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ ని నాలుగు భాషల్లో విడుదల చేస్తున్నాడు. అందుకే కొచ్చి, బెంగుళూర్, చెన్నై , హైదరాబాద్ లలో డియర్ కామ్రేడ్ ప్రమోషన్స్ తో పిచ్చెక్కిస్తున్నాడు. బాలీవుడ్ సినిమాలకు ఆయా మూవీ టీమ్స్ ప్రమోషన్స్ చేసే విధంగా విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ ప్రమోషన్స్ తో సినిమా మీద భారీ హైప్ పెంచేసాడు.
ఇక విజయ్ చేస్తున్న ప్రమోషన్స్ తో సినిమా మీద మంచి ఆశక్తి యూత్ లోను, సినిమా లవర్స్ లోను పిచ్చ క్రేజ్ ఏర్పడింది. ఇక విజయ్ దేవరకొండ ఇప్పుడు లాంగ్ వీకెండ్ మరో వరం కానుంది. శుక్రవారం విడుదల కాబోతున్న డియర్ కామ్రేడ్ కి శని అది వారాలే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా సోమవారం కూడా సెలవు డియర్ కామ్రేడ్ కి కలిసొస్తుంది. సోమవారం తెలంగాణాలో బోనాల హాలిడే ఉంటుంది. అందుకే డియర్ కామ్రేడ్ కి ఈ లాంగ్ వీకెండ్ కలిసొచ్చేలా ఉంది. సినిమాకి పాజిటివ్ టాక్ పడిందా.. ఇక సినిమాని బ్లాక్ బస్టర్ చేసేస్తారు ప్రేక్షకులు. అంతలా ఉంది విజయ్ పిచ్చి ప్రేక్షకుల్లో. మరి స్టార్ హీరోలు కూడా చెయ్యని ప్రమోషన్స్ విజయ్ ఈ సినిమా కోసం చేస్తూ కష్టపడుతున్నాడు. మరి విజయ్ కష్టం మాత్రం తెలంగాణాలో వస్తున్న లాంగ్ వీకెండ్ గట్టెక్కించేలా కనబడుతుంది.