దేవరకొండ ఎందుకు ఇలా చేస్తున్నాడు?

కేవలం రెండు సినిమాలతో తెలుగు రాష్ట్రాల్లో మంచి పాపులారిటీ దక్కించుకున్న విజయ్ దేవరకొండ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అలానే మనోడికి [more]

Update: 2019-06-08 07:40 GMT

కేవలం రెండు సినిమాలతో తెలుగు రాష్ట్రాల్లో మంచి పాపులారిటీ దక్కించుకున్న విజయ్ దేవరకొండ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అలానే మనోడికి సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. తరచూ విజయ్ సోషల్ మీడియా ఫాలోయర్స్ తో యాక్టీవ్ గా ఉంటాడు.

అలాంటి విజయ్ ను సోషల్ మీడియాలో కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. అందుకు కారణం తన తమ్ముడి సినిమా ‘దొరసాని’. ఈసినిమాతో విజయ్ సొంత తమ్ముడు తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. ఈసినిమా యొక్క టీజర్ లేటెస్ట్ గా రిలీజ్ అయింది. ఈ టీజర్ పై విజయ్ ఎంతమాత్రం స్పందించలేదు.

అయితే ఆ తరువాత ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ సినిమా నుంచి ట్రైలర్ వచ్చింది. ఈ ట్రైలర్ పై విజయ్ దేవరకొండ వెంటనే స్పందించాడు .. షేర్ చేశాడు. దాంతో విజయ్ ఫ్యాన్స్ సీరియస్ అయ్యారు. తన తమ్ముడు సినిమా టీజర్ విషయంలో సైలెంట్ గా వుండిపోయి, వేరే వారి సినిమాను మోసే పనులేంటని ఫ్యాన్స్ ఆయనకి క్లాస్ తీసుకుంటున్నారు. మరి విజయ్ ఎందుకు ఇలా చేస్తున్నాడో ఎవరికి అర్ధం కావడంలేదు. మరి దీనిపై విజయ్ ఎలా స్పందిస్తాడో చూడాలి

Tags:    

Similar News