విజయ్ కి ఇష్టమైన హీరోయిన్స్?

విజయ్ దేవరకొండ స్టయిల్ కి ముగ్దులవని హీరోయిన్స్ లేరు. విజయ్ దేవరకొండ తో ఎప్పుడెప్పుడు సినిమాలు చేద్దామా అని హీరోయిన్స్ అందరూ ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్ [more]

Update: 2020-03-23 05:18 GMT

విజయ్ దేవరకొండ స్టయిల్ కి ముగ్దులవని హీరోయిన్స్ లేరు. విజయ్ దేవరకొండ తో ఎప్పుడెప్పుడు సినిమాలు చేద్దామా అని హీరోయిన్స్ అందరూ ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్ లో రౌడీ స్టార్ గా విజయ్ దేవరకొండ క్రేజ్ బాలీవుడ్ లో భీభత్సంగా వుంది. విజయ్ దేవరకొండ స్టయిల్ కి బాలీవుడ్ హీరోయిన్స్ ఎప్పుడో ఫిదా అయ్యారు. అలియా భట్ దగ్గరనుండి జాన్వీ కపూర్ వరకు విజయ్ దేవరకొండ స్టయిల్ ని పొగడడమే కాదు.. ఆయనతో అవకాశం రావాలె గాని అంటూ తెగ హొయలు పోతున్నారు. అయితే పూరి జగన్నాధ్ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతున్న విజయ్ దేవరకొండ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ అనుకుంటే.. చివరికి అనన్య పాండే హీరోయిన్ గా పూరి సినిమాలో విజయ్ సరసన నటిస్తుంది. అనన్య పాండే అవకాశం చూసి చాలామందే కుల్లుకున్నారు.

అయితే విజయ్ దేవరకొండ కి ఇష్టమైన హీరోయిన్స్ ఎవరు.. ఏ హీరోయిన్స్ తో కలిసి నటించాలని ఉంది అని విజయ్ దేవరకొండ ని అడగగా…తనకి ప్రత్యేకంగా ఏ హీరోయిన్స్ తోనూ పనిచేయాలని లేదు కానీ… ఎవరితో అయినా నటించాలి చూస్ చేసుకొమంటే మాత్రం… కియారా అద్వానీ, జాన్వీ కపూర్ లను ప్రిఫర్ చేస్తా అంటున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ మోస్ట్ హీరోయిన్ అయినా కియారా తో విజయ్ ఇప్పటికే ఓ యాడ్ లో నటించగా… జాన్వీ కపూర్ మాత్రం కరణ విత్ కాఫీ షోలో విజయ్ దేవరకొండ నటన, స్టైలిష్ లుక్స్ అంటే ఇష్టమని.. విజయ్ తో ఆఫర్ వస్తే వదలనని చెప్పింది. మరి పూరి సినిమాలో విజయ్ సరసన నటించేందుకు వీరు పేర్లు వినబడినా వారి డేట్స్ ఖాళీ లేక విజయ్ తో ఆఫర్ వదులుకున్నారు. కానీ విజయ్ వీరిద్దరే తన బెస్ట్ ఛాయస్ అంటున్నాడు.

Tags:    

Similar News