పూరి ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

విజయ్ దేవరకొండ – పూరి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుందని తెలిసిన విషయమే. ఈ సినిమా కోసం హీరోయిన్ లను సెర్చ్ చేసే పనిలో ఉన్నారు [more]

Update: 2019-10-25 10:22 GMT

విజయ్ దేవరకొండ – పూరి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుందని తెలిసిన విషయమే. ఈ సినిమా కోసం హీరోయిన్ లను సెర్చ్ చేసే పనిలో ఉన్నారు పూరి అండ్ ఛార్మి. గతంలో బాలీవుడ్ నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ తనకు విజయ్ తో నటించాలని ఉందని చెప్పడంతో ఆ మాటని పట్టుకుని పూరి తన సినిమాలో ఎలాగైనా నటించేలా చేయాలనీ చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. తనకు తెలిసిన బాలీవుడ్ సర్కిల్స్ నుంచి బోనీ కపూర్‌ని ఒప్పించాలని చూస్తున్నాడు.

జాన్వీ ఓకే అంటే….

మరోపక్క ఛార్మి కూడా జాన్వీ డేట్స్‌ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. కాకపోతే జాన్వీ కి హిందీ లో చాలా కమిట్‌మెంట్స్‌ వున్నాయి. పూరి కి సినిమా కోసం ఆమె బల్క్ డేట్స్ కావాలి. ఒకవేళ జాన్వీ అంగీకరిస్తే ఈ చిత్రం పూర్తి కావడానికి టైమ్‌ పడుతుంది. లేట్ అయినా పర్లేదు జాన్వీ ని ఎట్టిపరిస్థితుల్లో టాలీవుడ్ కి తీసుకుని రావాలని చూస్తున్నాడు పూరి. పూరి సినిమాల్లో హీరోయిన్స్ ఎలా ఉంటారో వేరే చెప్పనవసరంలేదు. ఒకవేళ ఆమె పూరి చేతిలో పడితే టాలీవుడ్ లో తిరిగి చూసుకోవాల్సిన అవసరంలేదు.

 

Tags:    

Similar News