సోమవారం డ్రాపయిన కామ్రేడ్!

విజయ్ దేవరకొండ – రష్మిక జంటగా నటించిన చిత్రం డియర్ కామ్రేడ్ తొలి వీకెండ్ ముగించుకుంది. తొలి వీకెండ్ ముగిసేసరికి ఈ సినిమా వరల్డ్ వైడ్ గా [more]

Update: 2019-07-30 08:29 GMT

విజయ్ దేవరకొండ – రష్మిక జంటగా నటించిన చిత్రం డియర్ కామ్రేడ్ తొలి వీకెండ్ ముగించుకుంది. తొలి వీకెండ్ ముగిసేసరికి ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 19కోట్ల వసూళ్లతో పర్లేదు అనిపించుకుంది. ఇక వీక్ డే అయినా సోమవారం మాత్రం కలెక్షన్స్ కొంచం స్లో గా ఉన్నాయి అని టాక్ వచ్చింది. ఈమూవీ కి వచ్చిన హైప్ కి కలెక్షన్స్ కి సంబంధం లేకుండా పోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

అక్కడ కూడా….

అలానే యుఎస్ లో కూడా ఈసినిమా కలెక్షన్స్ అంత ఆశాజనకంగా ఏమీలేవు. అక్కడ సోమవారం ముగిసేసరికి $700,000 డాలర్లకు చేరే అవకాశం ఉందని ట్రేడ్ అంచనా వేస్తుంది. అక్కడ రాత్రి 10 గంటల వరకూ అందిన సమాచారం ప్రకారం $9,223 సాధించింది. అంటే ఇప్పటివరకు ‘డియర్ కామ్రేడ్’ $695,666 వసూళ్లు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమా సేఫ్ జోన్ కి వెళ్లడం కొంచం కష్టమే కానీ సినిమాలు ఏమి లేకపోతే ఈజీగా వెళ్లిపోవచ్చు. చూద్దాం ఈ శుక్రవారం రిలీజ్ అయ్యే సినిమాల మీద ఆధారపడి ఉంది.

Tags:    

Similar News