విరాళం ఇవ్వలేదు కానీ.. పబ్లిసిటీ బాగా చేసుకుంటున్నాడు!!

హీరోలంతా తమకి తోచిన  భారీ విరాళాలు రెండు తెలుగు రాష్ట్రాలకు ఇచ్చారు. చిరు ఆధ్వర్యంలో కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి అందరూ సిద్ధమయ్యారు. కానీ పాన్ ఇండియా లెవల్ [more]

Update: 2020-04-18 03:06 GMT

హీరోలంతా తమకి తోచిన భారీ విరాళాలు రెండు తెలుగు రాష్ట్రాలకు ఇచ్చారు. చిరు ఆధ్వర్యంలో కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి అందరూ సిద్ధమయ్యారు. కానీ పాన్ ఇండియా లెవల్ కి వెళుతున్న విజయ్ దేవరకొండ మాత్రం ఒక్క రూపాయి విరాళం ఇవ్వలేదు..దాంతో సోషల్ మీడియాలో విపరీతమైన … ట్రోల్స్ ఎదుర్కున్నాడు విజయ్ దేవరకొండ. అయితే విరాళం ఇవ్వకపోయినా.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పోలీస్ లను ఎంకరేజ్ చెయ్యడమే కాదు.. వారికీ కాస్త దూరంగా ఉండి జ్యూస్ లు అందజేస్తున్నాడు.

మరి పబ్లిక్ గా పోలీస్ ల వద్దకు వచ్చి వారికీ జ్యూస్ లు అందిస్తూ న్యూస్ లో నిలుస్తున్న విజయ్ దేవరకొండ ని చూసి చాలామంది పబ్లసిటీ కోసం పబ్లిక్ లోకి వస్తావా అంటుంటే…. కొందరు విజయ్ దేవరకొండ పోలిస్ శాఖను ఎంకరేజ్ చేస్తున్నాడు అంటున్నారు. కరోనా తో అందరూ లాక్ డౌన్ పాటిస్తూ ఇళ్లకే పరిమితమైతే పోలీస్ వారు మాత్రం విధి నిర్వహణలో రాత్రి పగలు రోడ్డు మీద ఉంటే… ఒక్కరోజు నేను పోలీస్ లు వద్దకు వెళుతుంటే మా అమ్మ నాన్న నన్ను తిట్టారు. కానీ ప్రతి రోజు విధి నిర్వహణలో బయటే ఉంటున్న పోలీస్ వారికీ ఇలా దూరం గా నిలుచుని జ్యూస్ ఇవ్వడం బాధాకర విషయం అంటున్నాడు విజయ్ దేవరకొండ. ఇక విజయ్ దేవరకొండ పోలీస్ లకు జ్యూస్ ఇచ్చేటప్పుడు మొహానికి మాస్క్ లేకుండా ఇవ్వడంపై కొందరు విమర్శలు చేస్తున్నారు. మాస్క్ ధరించి జ్యూస్ ఇస్తే.. విజయ్ చెప్పేది చాలామంది వింటారని చెబుతున్నారు.

Tags:    

Similar News