హ్యాట్సాఫ్ విజయ్ దేవరకొండ
సినిమా తీయడం ఒక టాస్క్ అయితే దీనికి మించిన మరో పెద్ద టాస్క్ దాన్ని ప్రజల్లో కి తీసుకుని వెళ్లడం. ప్రమోషన్స్ ఎంత బాగుంటే అంత గా [more]
సినిమా తీయడం ఒక టాస్క్ అయితే దీనికి మించిన మరో పెద్ద టాస్క్ దాన్ని ప్రజల్లో కి తీసుకుని వెళ్లడం. ప్రమోషన్స్ ఎంత బాగుంటే అంత గా [more]
సినిమా తీయడం ఒక టాస్క్ అయితే దీనికి మించిన మరో పెద్ద టాస్క్ దాన్ని ప్రజల్లో కి తీసుకుని వెళ్లడం. ప్రమోషన్స్ ఎంత బాగుంటే అంత గా ఆ సినిమావైపు ఇంట్రెస్ట్ చూపుతున్నారు ప్రేక్షకులు. మొదటి మూడు రోజులు ఓపెనింగ్స్ రావాలంటే ప్రమోషన్స్ చాలా కీలకంగా మారాయి ఈ రోజుల్లో. ఏదో టీవీ చానెల్స్ కి నాలుగైదు ఇంటర్వూస్ ఇచ్చి ప్రమోషన్స్ అయ్యిపోయాయి అంటే పొరపాటే. ఈమధ్య మన స్టార్ హీరోస్ అంత ఇలానే చేస్తున్నారు. ఇలాగా సినిమాను ప్రేక్షకుల్లో కి తీస్కుని వెళ్తే కష్టం అని భావించి విజయ్ దేవరకొండ తన సినిమాలన్నీ చాలా డిఫరెంట్ గా ప్రమోట్ చేస్తున్నాడు.
మొదటి సినిమా నుండి విజయ్ తన సినిమాల ప్రమోషన్స్ విషయంలో మంచి స్ట్రాటజీ ని ప్లే చేస్తున్నాడు. ఇక విజయ్ లేటెస్ట్ మూవీ 'డియర్ కామ్రేడ్' విషయంలో కూడా కొత్త ఫార్ములా ని యూజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్స్, సాంగ్స్ తో మంచి బుజ్ క్రియేట్ చేసుకున్న ఈసినిమా ఓపెనింగ్స్ అదిరిపోవడం ఖాయం అన్నట్టు కనిపిస్తుంది. ఈసినిమాను మరింతగా జనంలోకి తీసుకెళ్లిపోతున్నాడు. ఈనేపధ్యంలో సంగీతోత్సవం పేరుతో విజయ్.. ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు.
ఈమూవీ సౌత్ ఇండియా లో నాలుగు భాషల్లో రిలీజ్ అవుతుంది. తెలుగుతో పాటు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతుంది. అయితే మొదట మూడు చోట్లా.. సంగీతోత్సవం పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించి, పాటలకు స్టేజీపై ఆడి పాడాడు. విజయ్ తో పాటు రష్మిక అండ్ విజయ్ ఫ్రెండ్స్ కూడా ఆడిపాడారు. ఇక నిన్న హైదరాబాద్ లో ఈ మ్యూజికల్ ఫెస్టివల్ జరిగింది.ఇందులో రష్మితో కలసి డాన్స్ చేశాడు విజయ్. పాటలు పాడి అలరించాడు. ఇలా తన సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నాడు విజయ్. దింతో మన ప్రొడ్యూసర్స్ కి , స్టార్స్ హీరోస్ కి తెలిసి రావాలని కోరుకుందాం.