Vijayakant: విజయకాంత్ సినీ ప్రయాణం
విజయకాంత్ 1979లో ఇనిక్కుం ఇళమై సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమలోకి
విజయకాంత్ 1979లో ఇనిక్కుం ఇళమై సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 1980లో దూరతు ఇడి ముజక్కం, 1981లో సత్తమ్ ఒరు ఇరుత్తరై చిత్రాలతో విజయం సాధించారు. ఆయన కెరీర్ స్టార్టింగ్ లో వరుస ఫ్లాప్‌లతో ఒడిదుడుకులకు లోనయ్యాడు. విజయకాంత్ యాక్షన్ సీన్స్ తో తనదైన డైలాగ్ డెలివరీతో తమిళ చిత్ర పరిశ్రమలో ఒక స్టార్ గా ఎదిగారు. 1986లో అమ్మన్ కోవిల్ కిజకలే అనే చిత్రంలో నటనకు గానూ ఉత్తమ నటుడిగా-తమిళంలో ఫిల్మ్‌ఫేర్ అవార్డ్‌ను గెలుచుకున్నారు.
1991లో తన 100వ చిత్రం, 'కెప్టెన్ ప్రభాకరన్' విజయంతో ‘కెప్టెన్’ అనే నామకరణాన్ని పొందాడు. 1992లో వచ్చిన చిన్న గౌండర్ చిత్రంలో తన మరపురాని పాత్రను పోషించాడు. ఈ సినిమా తెలుగులో చిన్న రాయుడు సినిమాతో రీమేక్ చేశారు విక్టరీ వెంకటేష్. ఈ చిత్రం విజయకాంత్‌కు గ్రామీణ ప్రజలలో మంచి ఫాలోయింగ్ అందుకున్నారు. 2001లో తమిళనాడు ప్రభుత్వం నుండి కలైమామణి అవార్డును గెలుచుకున్నారు. 2002లో అవినీతికి వ్యతిరేకంగా తీసిన సినిమా 'రమణ' భారీ హిట్ అయింది. ఈ సినిమాకు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డును అందుకున్నారు. ఈ సినిమాను చిరంజీవి తెలుగులో 'ఠాగూర్' పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. విజయకాంత్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన చిన్న కుమారుడు షణ్ముగ పాండియన్ కూడా నటుడే. 2008లో ఆయన అరసంగం అనే సినిమాతో కెరీర్ లో 150వ సినిమా మార్కును అందుకున్నారు. ఇక 2010లో ఆయన ఫుల్ లెంత్ హీరోగా విరుధగిరి సినిమాలో హీరోగా నటించారు. ఈ సినిమాకు ఆయనే దర్శకుడిగా వ్యవహరించారు. 2015లో సగాప్తం అనే సినిమాలో కేమియో చేశారు. ఆ తర్వాత ఆయన సినిమాలు చేయడం బాగా తగ్గించేశారు. ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉండడం.. ఆ తర్వాత తీవ్ర అనారోగ్య సమస్యలు వెంటాడడంతో ఆయనకు సినిమాల్లో ఎక్కువగా నటించేందుకు అవకాశం దక్కలేదు.