విజయ్ కు ఆ… జిల్లా అమ్మాయి కావాలంట!

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరో గా మారిపోయాడు విజయ్ దేవరకొండ. వరస సినిమాలు హిట్ అవ్వడంతో మనోడితో సినిమాలు చేయడానికి చాలామంది లైన్ కడుతున్నారు. యూత్ [more]

Update: 2018-12-29 06:13 GMT

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరో గా మారిపోయాడు విజయ్ దేవరకొండ. వరస సినిమాలు హిట్ అవ్వడంతో మనోడితో సినిమాలు చేయడానికి చాలామంది లైన్ కడుతున్నారు. యూత్ పాటు అమ్మాయిల్లో మంచి క్రేజ్ ఉన్న ఈ నైజాం కుర్రోడికి ఏపీ లో కూడా అమ్మాయిల ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం 'డియర్ కామ్రేడ్' షూటింగ్ ఏపీ లోని కాకినాడలో నిన్ననే ఫినిష్ చేసారు.

ఇక్కడ అమ్మాయినే….

కాకినాడలో రకరకాల లొకేషన్లలో సినిమాని చిత్రీకరించారు. అక్కడ కొంతమంది లోకల్ విద్యార్థులు ఈ షూటింగులో పాల్గొన్నారు. నిన్న కాకినాడ షెడ్యూల్ పూర్తయిన సందర్భంగా దేవరకొండ పెళ్లి గురించి మాట్లాడుతూ… నాకు తూర్పు గోదావరి జిల్లా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉంది. ఎవరన్నా ఉంటే చెప్పండి. బ్యాక్ గ్రౌండ్ తో అస్సలు ఏ సంబంధం లేకుండా తనను ఇష్టపడే అమ్మాయి దొరికితే పెళ్లాడేస్తానని అన్నాడు.

గీత గోవిందంలోనూ….

కాకినాడకు విజయ్ కి ఓ ప్రత్యేక అనుబంధం ఉంది. ‘గీత గోవిందం’ సినిమాలో విజయ్ కాకినాడ కుర్రాడిగానే నటించాడు. ఈ ఏడాది ఒక బ్లాక్ బస్టర్ తో..ఒక సూపర్ హిట్ చిత్రాలతో చెలరేగిపోయాడు. 'గీతగోవిందం' తో 100కోట్ల క్లబ్ లో చేరాడు విజయ్. మరి ఆ లక్కీ గర్ల్ ఎవరో చూడాలి. అంతేకాదు విజయ్ కు ఏపీ నుంచి చాలా ప్రపోజల్స్ వచ్చాయి అని చెప్పాడు.

Tags:    

Similar News