ఇక్కడ ఓకె…. కానీ ఓవర్సీసులో ఘోరంగా వుంది

గత శుక్రవారం విడుదలైన వినయ విధేయరామ కి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. వరల్డ్ వైడ్ గా కాస్త నెగెటివ్ టాకే వచ్చింది. రామ్ చరణ్ – కైరా [more]

Update: 2019-01-13 07:40 GMT

గత శుక్రవారం విడుదలైన వినయ విధేయరామ కి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. వరల్డ్ వైడ్ గా కాస్త నెగెటివ్ టాకే వచ్చింది. రామ్ చరణ్ – కైరా అద్వానీ జంటగా బోయపాటి మార్క్ యాక్షన్ తో తెరకెక్కిన ఈసినిమాలో హింస మరీ ఎక్కువడంతో.. ప్రేక్షకులు ఈ సినిమాకి నెగెటివ్ టాకే ఇచ్చారు. కేవలం మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ తెరకెక్కించిన వినయ విధేయరామ, టైటిల్ కి సినిమాకి ఎలాంటి సంబంధం లేదని… సినిమా మొత్తం యాక్షన్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం.. హీరోయిజాన్ని బాగా ఎలివేట్ చెయ్యడంతో… రామ్ చరణ్ లుక్ అండ్ కొన్ని యాక్షన్ సన్నివేశాలు మత్రమే ఆకట్టుకుంటున్నాయంటున్నారు.

అయితే టాక్ తో సంబంధం లేకుండా తెలుగు రాష్ట్రాల్లో వినయ విధేయరామ కలెక్షన్స్ వున్నాయి. మొదటిరోజున తెలుగు రాష్ట్రాల్లో 25 కోట్ల షేర్ తెచ్చింది. అయితే వినయ విధేయరామకి ఓవర్సీస్ లో మాత్రం బాగా దెబ్బ పడింది. సినిమా మాస్ ప్రేక్షకులకు మాత్రమే అన్నట్టుగా ఉండడం…. ఫ్యామిలీ ఆడియన్స్ కి అస్సలు ఎక్కకపోవడం, బోయపాటి సినిమాలకు ఓవర్సీస్ లో పెద్దగా క్రేజ్ ఉండదు. ఎదుకంటే బోయపాటి మార్క్ యాక్షన్ ని ఓవర్సీస్ ప్రేక్షకులు అంతగా ఆదరించారు. ఇక రామ్ చరణ్ కి గత సినిమాలకు రంగస్థలం సినిమాకి ఓవర్సీస్ లో చాలా తేడా వచ్చింది.రంగస్థలం సినిమాతో రామ్ చరణ్ ఓవర్సీస్ లో అందరి హీరోలతో సమానంగా కలెక్షన్స్ కొల్లగొట్టాడు. మర సినిమా ప్రేక్షకులు, ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చేదిలా ఉండడంతో రంగస్థలం సినిమా అదిరిపోయే కలెక్షన్స్ ఓవర్సీస్ లోను కలెక్ట్ చేసింది.


కానీ వినయ విదేయ రామ మొదటి రోజు ఓవర్సీస్ లో కేవలం 1.81 లక్షల డాలర్లతో సరిపెట్టుకుంది. ఇక వినయ విధేయరామకి మాత్రం రంగస్థలం కలెక్షన్స్ రీచ్ కావడం అటుంచి.. సినిమాని కొన్న బయ్యర్లకు నష్టాలూ రాకపోతేసరి అన్నట్టుగా వుంది వ్యవహారం. అందులోని ఈ సంక్రాంతికి పేట, ఎన్టీఆర్ కథానాయకుడు, ఇక నిన్న విడుదలైన ఎఫ్ టు సినిమాలు ఉన్నాయి. ఇక ఎఫ్ టు కామెడీ ఎంటర్టైనర్ గా ఉండడంతో.. ఇక వినయ విధేయరామ ఓవర్సీస్ లో కోలుకునే పరిస్థితి లేదంటున్నారు

Tags:    

Similar News