ఆ హీరోయిన్‌తో పెళ్లి వార్త‌ల‌పై స్పందించిన విశాల్‌

ప్రముఖ నటుడు విశాల్ పెళ్లి వార్త‌ల‌పై స్పందించాడు. ఈ ఉదయం విశాల్ ట్వీట్‌లో

Update: 2023-08-11 06:59 GMT

ప్రముఖ నటుడు విశాల్ పెళ్లి వార్త‌ల‌పై స్పందించాడు. ఈ ఉదయం విశాల్ ట్వీట్‌లో “సాధారణంగా నేను నాపై ఎలాంటి ఫేక్ న్యూస్ లేదా రూమర్‌లకు స్పందించను, అవి పనికిరానివ‌ని నేను భావిస్తున్నాను. కానీ ఇప్పుడు లక్ష్మీ మీనన్‌తో నా వివాహం గురించి పుకారు చుట్టుముట్టినందున.. నేను దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. మీరు ఒక అమ్మాయి వ్యక్తిగత జీవితాన్ని ఆక్రమించి పాడు చేస్తున్నారు. ఆమె ఇమేజ్‌ను కించపరిచారు. సంవత్సరం, తేదీ, సమయం.. భవిష్యత్తులో నేను ఎవరిని వివాహం చేసుకోబోతున్నానో డీకోడ్ చేయడానికి ఇది బెర్ముడా ట్రయాంగిల్ కాదు. సమయం వచ్చినప్పుడు నా పెళ్లిని అధికారికంగా ప్రకటిస్తానంటూ రూమ‌ర్ల‌పై స్పందించాడు.

విశాల్ నటి లక్ష్మీ మీనన్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ పుకార్లలో ఒక అమ్మాయి ప్రమేయం ఉన్నందున మాత్రమే తాను స్పందించాలనుకున్నట్లు విశాల్‌ పేర్కొన్నాడు. గత వారం విశాల్, లక్ష్మిల పెళ్లిపై పుకార్లు మొదలయ్యాయి. వారిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని, వారి స్నేహమే వారిని దగ్గర చేసిందని ప‌లు నివేదికలు పేర్కొన్నాయి.




Tags:    

Similar News