ఛాలెంజింగ్ పాత్ర కోసం వెయిటింగ్ అంట!!
అనసూయ యాంకర్ గా బుల్లితెర మీద దుమ్మురేపడమే కాదు…. వెండితెర మీద కూడా ఓ వెలుగు వెలుగుతుంది. అనసూయ వెండితెర మీద కూడా తనదైన పాత్రలతో చెలరేగిపోతుంది. [more]
అనసూయ యాంకర్ గా బుల్లితెర మీద దుమ్మురేపడమే కాదు…. వెండితెర మీద కూడా ఓ వెలుగు వెలుగుతుంది. అనసూయ వెండితెర మీద కూడా తనదైన పాత్రలతో చెలరేగిపోతుంది. [more]
అనసూయ యాంకర్ గా బుల్లితెర మీద దుమ్మురేపడమే కాదు…. వెండితెర మీద కూడా ఓ వెలుగు వెలుగుతుంది. అనసూయ వెండితెర మీద కూడా తనదైన పాత్రలతో చెలరేగిపోతుంది. పెళ్లి తర్వాత కూడా హీరోయిన్స్ కున్న అందంతో అనసూయ ఇప్పటికీ మెరిసిపోతూనే ఉంది. కరోనా లాక్ డౌన్ తర్వాత మరింత అందంతో మెరుస్తున్న అనసూయ ఇప్పటికి ఛాలెంజింగ్ పాత్ర కోసం వెయిట్ చేస్తున్నా అంటుంది. సోషల్ మీడియాలో హీరోయిన్ గా వెలిగిపోదాం అనుకుని.. హాట్ హాట్ ఫోటో షూట్స్ చేసిన అనసూయ కి ఎవరూ హీరోయిన్ అవకాశం ఇవ్వలేదు. కేరెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకే పరిమితం చేసారు. క్షణం లాంటి సినిమాలు తప్ప అనసూయ కు బాగా ఫుల్ లెన్త్ పాత్రలేమి పడలేదు. అయితే తాజాగా మీకు కెరీర్ లో ఛాలెంజింగ్ పాత్ర ఏదైనా ఉందా అని అడిగితె.. అందరూ అనసూయ రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర అని చెబుతుంది అనుకున్నారు.
కానీ అనసూయ మాత్రం తనకి ఇప్పటివరకు ఛాలెంజింగ్ పాత్ర అంటూ ఏది రాలేదని అంటుంది. ఇప్పటి వరకు తనకు తెలుగులో ఛాలెంజింగ్ రోల్ ఇచ్చిన వాళ్లే లేరంటూ సమాధానమిచ్చింది. తనకి ఎవరైనా ఛాలెంజింగ్ పాత్ర ఇస్తారేమో అని ఎదురు చూస్తున్నట్టుగా చెప్పింది. ఇక తనకి రీమేక్ సినిమాలంటే ఇష్టం ఉండదని.. అందుకే రీమేక్ లకు దూరం అంటుంది. ఇక తాజాగా అనసూయ తమిళ్ ఇండస్ట్రీలో కూడా అడుగుపెడుతున్నట్టుగా కన్ఫర్మ్ చేసింది. అయితే అనసూయ రంగమ్మత్త రోల్ గురించి ఏం చెప్పకపోయేసరికి… మెగా ఫాన్స్ అమ్మా సుకుమార్ నీకు రంగమ్మత్త లాంటి మంచి రోల్ ఇస్తే.. అది ఛాలెంజింగ్ రోల్ కాదంటావా అంటూ మంది పడుతున్నారు.