ఏమిటండి ఈ కాన్ఫిడెన్స్!!
హాట్ హీరోయిన్, టాప్ హీరోయిన్, టాలెంటెడ్ హీరోయిన్.. ఇలా ఎన్ని చెప్పినా ఆమె ముందు దిగడుపే. హీరోయిన్ గా టాప్ పోసిషన్ ఎంజాయ్ చేసి.. పెళ్లి చేసుకున్నాక [more]
హాట్ హీరోయిన్, టాప్ హీరోయిన్, టాలెంటెడ్ హీరోయిన్.. ఇలా ఎన్ని చెప్పినా ఆమె ముందు దిగడుపే. హీరోయిన్ గా టాప్ పోసిషన్ ఎంజాయ్ చేసి.. పెళ్లి చేసుకున్నాక [more]
హాట్ హీరోయిన్, టాప్ హీరోయిన్, టాలెంటెడ్ హీరోయిన్.. ఇలా ఎన్ని చెప్పినా ఆమె ముందు దిగడుపే. హీరోయిన్ గా టాప్ పోసిషన్ ఎంజాయ్ చేసి.. పెళ్లి చేసుకున్నాక కూడా కెరీర్ లో దూసుకుపోతున్న సమంత యాంకర్ అవతారమెత్తిన. అందులోనూ అదరగొట్టేసింది. హీరోయిన్ గా బట్టి పట్టి డైలాగ్స్ చెప్పే సమంత మొదటిసారి బిగ్ బాస్ కి హోస్ట్ గా వ్యవహరించింది. మరి ఫస్ట్ టైం.. ఇలా ఓ ఎపిసోడ్ కి యాంకర్ గా అంటే సమంత ఎంత భయపడాలి. ఎంత టెంక్షన్ ఫిలవ్వాలి. అయితే అంతా భయపడిందట. అంతా టెంక్షన్ పడిందట. మరి ఎంత టెంక్షన్ పడి, ఎంత భయపడినా.. సమంత మాత్రం బిగ్ బాస్ స్టేజ్ మీద అదరగొట్టేసింది. దీనికి కారణం మామ నాగార్జునే అంటుంది సమంత. తనకి ఇలాంటి అవకాశం కలిపించిన మామ నాగ్ కి బిగ్ బాస్ కి కృతఙ్ఞతలు చెప్పేస్తుంది.
అయితే ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏమిటీ అంటే.. సమంత కి తెలుగు రాదు.. అయినా చక్కగా మాట్లాడింది. అలాగే సమంత ఇంతవరకు ఒక్క బిగ్ బాస్ ఎపిసోడ్ కూడా చూడలేదట. అదే ట్విస్ట్ అంటే. బిగ్ బాస్ ఒక్క ఎపిసోడ్ కూడా చూడకుండా సమంత బిగ్ బాస్ కంటెస్టెంట్స్ విషయంలో అంత క్లారిటీగా ఎలా మాట్లాడిందో ఇప్పుడు అందరి ముందు ఉన్న అతి పెద్ద ప్రశ్న. మామ నాగ్ చెప్పాడని.. అక్కడక్కడా చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకుని బిగ్ బాస్ హోస్ట్ గా స్టేజ్ మీద అంత చక్కగా ఒక్కో కంటెస్టెంట్ గురించి సమాంత మాట్లాడింది అంటే నిజంగా షాకవ్వాల్సిందే. అనుభవం లేదు.. అనర్గళంగా తెలుగు మాట్లాడలేదు.. అయినా హోస్ట్ గా సమంత ప్రదర్శన అద్భుతం అని చెప్పకపోయినా.. చాలా చక్కగా హోస్టింగ్ చేసింది అని చెప్పొచ్చు. మరి బిగ్ బాస్ చూడకుండా బిగ్ ఓస్ హోస్ట్ గా చేసింది అంటే సమంత కాన్ఫిడెన్స్ ని మెచ్చుకోవాల్సిందే.