ఆర్ఆర్ఆర్ టీమ్ కు షారుఖ్ రిక్వెస్ట్.. ఒక్కసారి తాకనివ్వండి ప్లీజ్

తాజాగా వచ్చిన ఆస్కార్ నామినేషన్స్ షార్ట్ లిస్ట్ లో RRR సినిమా కూడా ఉండటంతో.. తెలుగోడు గర్వపడుతున్నాడు. కీరవాణి సంగీతం..

Update: 2023-01-10 11:43 GMT

shahrukh khan tweet

RRR.. తెలుగు చలనచిత్ర సంస్థ గర్వించదగిన పొజిషన్ లో ఉందీ సినిమా. బాహుబలి తో సాధ్యం కాని పనిని.. RRRతో చేసేందుకు జక్కన్న సాయశక్తులా కృషి చేస్తున్నాడు. ఒక్క జక్కన్నేంటి సినిమా టీమ్ మొత్తం చాలా కష్టపడింది. తాజాగా వచ్చిన ఆస్కార్ నామినేషన్స్ షార్ట్ లిస్ట్ లో RRR సినిమా కూడా ఉండటంతో.. తెలుగోడు గర్వపడుతున్నాడు. కీరవాణి సంగీతం అందించిన.. నాటు నాటు సాంగ్.. ఇండియన్ ఫిల్మ్ షార్ట్ లిస్ట్ లో బెస్ట్ ఒరిజినర్ స్కోర్ విభాగంలో నామినేట్ అయింది. షార్ట్ లిస్ట్ అయిన సినిమాలకు జనవరి 12 నుంచి 17 వరకు ఓటింగ్ ఉంటుంది. ఈ ఓటింగ్ లో ఎక్కువ ఓట్లు వచ్చిన సినిమాలు ఆస్కార్ నామినేషన్స్ లో నిలవనున్నాయి.

కాగా.. RRR సినిమా ఆస్కార్ షార్ట్ లిస్ట్ లోకి వెళ్లడంపై బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ స్పందించాడు. "భారత సినిమాను ఆస్కార్ వరకూ తీసుకెళ్లిన ఆర్ఆర్ఆర్ టీమ్ కు, రామ్ చరణ్ కు ధన్యవాదాలు. మీ RRR టీమ్ ఆస్కార్ ను గెలిచి ఇంటికి తీసుకొచ్చినపుడు ఒక్కసారి నన్ను కూడా దానిని టచ్ చేయనివ్వండి ప్లీజ్" అంటూ ట్వీట్ చేశాడు. షారుఖ్ చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. అటు చరణ్, ఆర్ఆర్ఆర్ అభిమానులతో పాటు ఇటు షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ ట్వీట్ ను రీ ట్వీట్లు చేస్తున్నారు. 
అంతకుముందు రామ్ చరణ్.. షారుఖ్ నటించిన పతాన్ ట్రైలర్ పై ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ కు రిప్లై ఇస్తూ షారుఖ్ ఇలా ట్వీట్ చేశాడు.



Tags:    

Similar News