ఇంతకీ ఆదిపురుష్ సీత ఎవరు?

బాలీవుడ్ డైరెక్టర్ ఓం రనౌత్ ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ పాన్ ఇండియా మూవీని ప్రకటించినప్పటినుండి ఈ సినిమాపై రకరకాల న్యూస్ లు ప్రచారంలోకొచ్చాయి.. వస్తున్నాయి. ప్రభాస్ రాముడిగా [more]

Update: 2020-08-24 09:28 GMT

బాలీవుడ్ డైరెక్టర్ ఓం రనౌత్ ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ పాన్ ఇండియా మూవీని ప్రకటించినప్పటినుండి ఈ సినిమాపై రకరకాల న్యూస్ లు ప్రచారంలోకొచ్చాయి.. వస్తున్నాయి. ప్రభాస్ రాముడిగా ఈ సినిమా లో కనిపించబోతున్నాడని అందరూ ఫిక్స్ అవుతున్నారు. అయితే రాముడి కేరెక్టర్ అయినా.. రాముడి లుక్స్ లో ప్రభాస్ కనిపించడని, అలాగే రామాయణమే ఆదిపురుష్ అని చెప్పకుండా మోడ్రెన్ రామాయణం అన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఇక ఈ సినిమాలో రావణాసురుడు పోలిన విలన్ పాత్రని సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ చేసున్నాడని వార్తలొస్తున్నాయి. ఇక హీరోయిన్ విషయమై రకరకాల న్యూస్ లు వినిపిస్తున్నాయి.

ప్రభాస్ రాముడైతే.. సీత గా సౌత్ హీరోయిన్ కీర్తి సురేష్ పేరు పరిశీలనలో ఉంది అంటే… మరోపక్క బాలీవుడ్ టాప్ హీరోయిన్ కియారా అద్వానీ పేరు సీత లిస్ట్ లో చేరింది. ప్రభాస్ – ఓం రనౌత్ లు కీర్తి సురేష్ ని కానీ లేదంటే మంచి ఫేమ్ ఉన్న కియారా అద్వానీ కానీ సీత కేరెక్టర్ కి బావుంటుంది అని.. అయితే కీర్తి సురేష్ కేవలం సౌత్ కె పరిమితం, కియారా అద్వానీ అయితే ఇటు సౌత్ కి కాస్త పరిచయం ఉంది.. అలాగే బాలీవుడ్ లో క్రేజ్ ఉన్న హీరోయిన్ కాబట్టి ఎక్కువగా కియారా అద్వానీ పేరే ప్రిఫర్ చేసేలా కనిపిస్తున్నారు. ఈ దెబ్బకి కియారా డేట్స్ అడ్జెస్ట్ చెయ్యడం ఖాయం. ప్రభాస్ హీరో.. అందులోను పాన్ ఇండియా మూవీ కాబట్టి కియారా కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఖాయమే. కానీ కియారా డేట్స్ అడ్జెస్ట్ చెయ్యలేకపోతే మరో హీరోయిన్ ని సీత పాత్రకి వెతుక్కోవాలని అంటున్నారు. 

Tags:    

Similar News