ఎందుకంత కోపం!!

సాయి పల్లవి మలయాళంలో నటించిన ప్రేమమ్ సినిమాతోనే పిచ్చ క్రేజ్ సంపాదించింది. ప్రేమమ్ సినిమా తర్వాత టాలీవుడ్, తమిళ సినిమాల్తో బాగా బిజీ అయ్యింది. కథ నచ్చడం, [more]

Update: 2020-07-01 07:20 GMT

సాయి పల్లవి మలయాళంలో నటించిన ప్రేమమ్ సినిమాతోనే పిచ్చ క్రేజ్ సంపాదించింది. ప్రేమమ్ సినిమా తర్వాత టాలీవుడ్, తమిళ సినిమాల్తో బాగా బిజీ అయ్యింది. కథ నచ్చడం, పాత్ర నచ్చితేనే సినిమా చెయ్యడం అనేది సాయి పల్లవి స్పెషల్. సాయి పల్లవి అందాలు ఆరబొయ్యడానికి.. గ్లామర్ షో చెయ్యడానికి, లిప్ లాక్ లకు దూరమంటుంది. ఆమె గనక అందాలు ఆరబోసి, లిప్ లాక్స్ కి ఓకె చెబితే.. సాయి పల్లవికి స్టార్ హీరోల సినిమాలు క్యూ కట్టేవి. అయితే తాజాగా సాయి పల్లవికి ఓ యాంకర్ మీద బాగా కోపమొచ్చింది. కారణం ఆమెని మలయాళీ కుట్టి అన్నందుకు. అదేమిటి సాయి పల్లవి అంటే మలయాళం, మలయాళ హీరోయిన్ అంటే సాయి పల్లవే కదా.. ఇందులో కోప్పడడానికి ఏముంది అనిపించొచ్చు.

కానీ సాయి పల్లవిని సదరు యాంకర్ మలయాళీ అని పిలవడంతో సాయి పల్లవికి బాగా మండింది. తాను మలయాళీని కాదని స్పష్టం చేసిన సాయి పల్లవి తాను తమిళ్ అమ్మాయినని… కోయంబత్తూర్ లో పెరిగానని చెప్పింది. అసలు ఆ పేరు నాకు నచ్చదు, అలా పిలవద్దు అని యాంకర్ పై సీరియస్ అయినా సాయి పల్లవి ఇంకెప్పుడూ మలయాళీ అని పిలవొద్దని సూచించింధట. మరి చాలామంది సాయి పల్లవి నేటివ్ ప్లేస్ మళయాళమనే అనుకుంటున్నారు. కానీ సాయి పల్లవి తమిళ్ అని ఇప్పడే ఆమె మాటలతోనే తెలిసింది.

Tags:    

Similar News