మహేష్ చెబితే రాజమౌళి వింటాడా?

మహేష్ బాబు – రాజమౌళి సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా? వాళ్ళ కలయికలో ఎలాంటి సినిమా వస్తుందా? అని మహేష్ బాబు ఫాన్స్ అతృతతో ఎదురు చూస్తున్నారు. అయితే [more]

Update: 2020-05-06 07:04 GMT

మహేష్ బాబు – రాజమౌళి సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా? వాళ్ళ కలయికలో ఎలాంటి సినిమా వస్తుందా? అని మహేష్ బాబు ఫాన్స్ అతృతతో ఎదురు చూస్తున్నారు. అయితే రాజమౌళి బాహుబలి, RRR తర్వాత పిరియాడికల్ బ్యాగ్డ్రాప్ కాకుండా… భారీ విజువల్స్ గ్రాఫిక్స్ లేకుండా ఓ కౌవ్ బాయ్ మూవీ చేస్తాడని అంటున్నారు. ఇక మహేష్ కూడా పిరియాడికల్ డ్రామా లాంటి కథతో రాజమౌళితో సినిమా మొదలెడితే.. రెండుమూడేళ్లు కేటాయించాల్సి వస్తుంది అని.. అందుకే మాములు కథతోనే సినిమా చేస్తాడని అన్నారు.

తాజాగా మహేష్ తన కెరీర్ లోనే ఎప్పుడూ పిరియాడికల్ జోనర్ టచ్ చెయ్యలేదు కనక… హిస్టారికల్ బ్యాగ్డ్రాప్ అయినా.. పిరియాడికల్ డ్రామాతో అయినా సినిమా చేస్తే బావుంటుంది అని.. రాజమౌళి లాంటి దర్శకుడితో ఇలాంటి డేరింగ్ అండ్ డాషింగ్ స్టెప్ తీసుకోవడానికి తాను రేడి అంటూ మహేష్ చెబుతున్నాడట. దాంతో మహేష్ బాబు రాజమౌళి తో బాహుబలి టైపులో ఓ ఫిక్షినల్ హిస్టారికల్ మూవీ చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు ఇప్పుడు ఫిలింనగర్ లో హాట్ టాపిక్. మరి మహేష్ – రాజమౌళి కలయిల్లలో తెరకెక్కే మూవీపై ఇలాంటి క్లారిటీ రావడంతో మహేష్ ఫాన్స్ మాత్రం పిచ్చెక్కించే ఆనందంలో కొట్టుకుంటున్నారు. కానీ మరోపక్క రాజమౌళి లాంటి టాలెంట్ డైరెక్టర్ ఏది చెబితే దానికే హీరోలు సై అంటారు కానీ…. ఇప్పుడు ఇక్కడ మహేష్ చెబితే మాత్రం రాజమౌళి చేస్తాడా అంటున్నారు.

Tags:    

Similar News