చిరు తో చరణ్ ఇప్పట్లో జరగదులే

సై రా నరసింహారెడ్డి సినిమాలో తండ్రి చిరు తో రామ్ చరణ్ కూడా నటిస్తాడని అనుకున్నారు. కానీ నిర్మాతగా చరణ్ ఆ సినిమాలో నటించలేదు కానీ.. చిరు [more]

Update: 2019-10-27 06:25 GMT

సై రా నరసింహారెడ్డి సినిమాలో తండ్రి చిరు తో రామ్ చరణ్ కూడా నటిస్తాడని అనుకున్నారు. కానీ నిర్మాతగా చరణ్ ఆ సినిమాలో నటించలేదు కానీ.. చిరు – కొరటాల మూవీ లో చరణ్ యంగ్ చిరు గా నటించబోతున్నాడని , కొరటాల ప్రత్యేకంగా చరణ్ పాత్ర రాసినట్టుగా తెగ ప్రచారం జరగడమేకాదు.. చిరంజీవి రీమేక్ చెయ్యబోయే మలయాళ లూసిఫెర్ లోను చిరు తో చరణ్ నటిస్తాడని జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే #RRR సినిమా షూటింగ్ లో బిజీగా వున్న రామ్ చరణ్ తండ్రి చిరు తో ఇప్పట్లో నటించే అవకాశాలు లేనట్లుగా తెలుస్తుంది. కొరటాల శివ సినిమాలో అసలు చరణ్ రోల్ లేదని చెబుతున్నారు.

అంతేకాకుండా దర్శకుడు సుకుమార్, చిరంజీవి తో లూసిఫెర్ రీమేక్ చెయ్యబోతున్నాడు అంటూ వార్తాలు కూడా వస్తున్నాయి. అయితే సుకుమార్.. చిరంజీవి లూసిఫెర్ రీమేక్ కోసం ప్రయత్నాలు జరపడం, చిరుతో ఆ సినిమాలో చరణ్ నటింప జేస్తే బావుంటుందని చెప్పడం నిజంగానే జరిగాయట. అయితే చిరు మాత్రం లూసిఫెర్ రీమేక్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసి చెయ్యనట్లు చేసినా.. చరణ్ తో మాత్రం ఆ సినిమాలో నటించను అని… మరో యంగ్ హీరో ఆ సినిమాలో నటిస్తాడని ఫీలర్ మాత్రం వదలడంతో… చిరుతో చరణ్ ఇప్పట్లో నటించే అవకాశాలు లేవని మెగా ఫాన్స్ కూడా ఫిక్స్ అవ్వొచ్చు.

Tags:    

Similar News