Gal Gadot : నాలుగో ఆడబిడ్డకు జన్మనిచ్చిన 'వండర్ ఉమెన్'..
'వండర్ ఉమెన్'గా ఫేమ్ ని సంపాదించుకున్న గాల్ గాడోట్.. నాలుగోసారి కూడా ఆడపిల్లకే జన్మనిచ్చారు. ఆ పాపకు..;
Gal Gadot : 'వండర్ ఉమెన్' సినిమాతో వరల్డ్ వైడ్‌గా ఎంతో ఫేమ్ ని సంపాదించుకున్న హాలీవుడ్ నటి 'గాల్ గాడోట్'.. నాలుగోసారి కూడా ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తను ఒక ఫొటో ద్వారా తెలియజేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ లో ఒక పోస్టు వేశారు. ఇక ఆ పోస్టు కింద.. 'జన్మనివ్వడం అంత ఈజీ ఏం కాదంటూ' ఎమోషనల్ నోట్ కూడా రాసుకొచ్చారు.
"హౌస్ ఆఫ్ గర్ల్స్ లోకి మా చిన్ని పాపకు స్వాగతం పలుకుతున్నాను. మా జీవితాల్లోకి నువ్వు కొత్త వెలుగుని తీసుకొచ్చావు. అందుకనే నీకు 'ఓరి' అనే పేరుని పెడుతున్నాము. హీబ్రూ భాషలో ఓరి అంటే వెలుగు అనే అర్ధం వస్తుంది" అంటూ గాడోట్ రాసుకొచ్చారు. ఇక ఈ పోస్టు చూసిన అభిమానులు, సెలబ్రిటీస్.. ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
కాగా గాడోట్ 'జారోన్ వర్సనో' అనే వ్యక్తిని 2008లో వివాహం చేసుకోగా.. 2011లో 'అల్మా', 2017లో 'మాయ', 2021లో 'డానియెల్లా' ఆడబిడ్డలకు జన్మనిచ్చారు. ఇప్పుడు మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చి.. మరో వండర్ ఉమెన్ ని సిద్ధం చేయబోతున్నారు.
ఇక గాడోట్ సినిమాల విషయాలకు వస్తే.. గత ఏడాది 'హార్ట్ ఆఫ్ స్టోన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్ట్రెస్ 'అలియా భట్' కూడా ఓ ముఖ్య పాత్ర చేసారు. నెట్‌ఫ్లిక్స్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది. స్పై థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారికీ ఈ చిత్రం బాగా నచ్చుతుంది చూసేయండి