తెలుగు సినిమాలో “ది గ్రేట్ ఖలీ”..!

ఇండియన్ వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్ టైన్మెంట్(WWE) రెజ్లర్ ‘ది గ్రేట్ ఖలీ’ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం అయ్యింది. ప్రముఖ దర్శకుడు జయంత్ సి పరాన్జీ [more]

;

Update: 2019-01-30 08:42 GMT

ఇండియన్ వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్ టైన్మెంట్(WWE) రెజ్లర్ ‘ది గ్రేట్ ఖలీ’ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం అయ్యింది. ప్రముఖ దర్శకుడు జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నరేంద్ర’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడు ఈ ఏడడుగుల రెజ్లర్. ఇప్పటికే పలు హాలీవుడ్ సినిమాల్లో, అమెరికన్ టీవీ షోల్లో నటించిన ఖలీ బిగ్ బాస్ సీజన్ 4లో కూడా కనిపించి అభిమానులను అలరించాడు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నీలేష్ ఎటి, ఇజబెల్లా జంటగా నటిస్తున్నారు. ఇండియా పాకిస్థాన్ నేపథ్యంతో సినిమా రూపొందనుండడంతో ఇస్లామిక్ దేశాల్లో చిత్రీకరణ జరిపేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాతో బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ రామ్ సంపత్ తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. ఇషాన్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది.

Tags:    

Similar News