"30 వెడ్స్ 21" సీజన్ 2.. ఇదిగో టీజర్ !

ఇటీవలే "30 వెడ్స్ 21" సీజన్ 2 పోస్టర్ ను విడుదల చేశారు. తాజాగా "30 వెడ్స్ 21" సీజన్ 2 టీజర్ ను కూడా రిలీజ్ చేయగా..

Update: 2022-02-01 06:18 GMT

గతేడాది యూట్యూబ్ వెబ్ సిరీస్ గా విడుదలై.. మ్యాజిక్ క్రియేట్ చేసింది "30 వెడ్స్ 21". గతేడాది వచ్చిన వెబ్ సిరీస్ లలో.. ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న వెబ్ సిరీస్ లలో "30 వెడ్స్ 21" కూడా ఒకటి. 30 ఏళ్ల బ్యాచిలర్ కు 21 ఏళ్ల అమ్మాయితో పెళ్లైతే.. వారిద్దరి దాంపత్య జీవితం ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్ తో వచ్చిందీ సిరీస్. సీజన్ 1 లో కామెడీ, ఎమోషనల్ డ్రామా బాగా పండాయి. మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ లో నటించిన చైతన్య - అనన్య అందరినీ మెప్పించారు. సీజన్ 1 సిరీస్ హిట్ అవ్వడంతో.. ఇప్పుడు సీజన్ 2 విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

ఇటీవలే "30 వెడ్స్ 21" సీజన్ 2 పోస్టర్ ను విడుదల చేశారు. తాజాగా "30 వెడ్స్ 21" సీజన్ 2 టీజర్ ను కూడా రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక మనిద్దరి మధ్య ఏమి రావు అంటూ పృథ్వీ క్యారెక్టర్ చెప్పే డైలాగ్​తో టీజర్​ ప్రారంభమవుతుంది. ఈ టీజర్ లో వాళ్లిద్దరూ కలిసి ఎంజాయ్ చేయడం చూపించారు. "ఆఖర్లో నాన్న బుజాల మీదెక్కి చూసే ప్రపంచానికి, మన కాళ్ల మీద నిలబడి చూసే ప్రపంచానికి చాలా తేడా ఉంటుంది. మేఘన వెల్కమ్ టు అడల్ట్ హుడ్" అని పృథ్వీ చెప్పే డైలాగ్ తో టీజర్ ముగుస్తుంది. టీజర్ తోనే సీజన్ 2 చూడాలన్న ఇంట్రస్ట్ ను క్రియేట్ చేశారు మేకర్స్. వ్యాలెంటైన్స్ డే స్పెషల్ గా.. ఫిబ్రవరి 14వ తేదీన "30 వెడ్స్ 21" సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ యూ ట్యూబ్ లో టెలీకాస్ట్ కానుంది.
Full View


Tags:    

Similar News