అమెరికా వద్దు.. దుబాయ్ పోదాం అంటున్న మహేష్!
పాపం పరశురామ్.. సర్కారు వారి పాట యూనిట్ ఈపాటికి అమెరికా లొకేషన్స్ లో సందడి చేస్తూ.. చిత్రీకరణలో బిజీగా ఉండేవారు. డిసెంబర్ 30 నే యూనిట్ మొత్తం [more]
పాపం పరశురామ్.. సర్కారు వారి పాట యూనిట్ ఈపాటికి అమెరికా లొకేషన్స్ లో సందడి చేస్తూ.. చిత్రీకరణలో బిజీగా ఉండేవారు. డిసెంబర్ 30 నే యూనిట్ మొత్తం [more]
పాపం పరశురామ్.. సర్కారు వారి పాట యూనిట్ ఈపాటికి అమెరికా లొకేషన్స్ లో సందడి చేస్తూ.. చిత్రీకరణలో బిజీగా ఉండేవారు. డిసెంబర్ 30 నే యూనిట్ మొత్తం అమెరికా ఫ్లైట్ ఎక్కేందుకు సిద్దమైంది. కానీ కరోనా కారణంగా అది కాస్త వాయిదా పడి.. అమెరికా షెడ్యూల్ కన్నా ముందే హైదరాబాద్ షెడ్యూల్ మొదలు కాబోతుంది. అమెరికాలో సెకండ్ వేవ్, కరోనా స్ట్రెయిన్ వలన అమెరికా షెడ్యూల్ కొన్ని రోజులు వాయిదా పడింది అన్నారు. అందుకే రామోజీ ఫిలిం సిటీలోనే అమెరికా లొకేషన్స్ సెట్ వేసి.. సర్కారు వారి పాట షూటింగ్ చెయ్యాలని డిసైడ్ అయిన టీం.. కొన్ని ఇంపార్టెంట్ సన్నివేశాల కోసం కొద్దిరోజుల తర్వాత అమెరికా వెళితే సరిపోతుంది అనుకున్నారు.
రామోజీ ఫిలిం సిటీలో వేసిన బ్యాంకు సెట్ లోనే సర్కారు వారి పాట మొదటి షెడ్యూల్ ని మొదలు పెట్టబోతున్నారు. ఇక ఇండోర్ సన్నివేశాలకు సెట్ వేసిన సర్కారు యూనిట్ అవుట్ డోర్ కోసం ఎప్పుడో కప్పుడు అమెరికా షెడ్యూల్ ప్లాన్ చేద్దామనుకుంటే.. మహేష్ ఇప్పుడు అమెరికా షెడ్యూల్ కి ససేమిరా అంటున్నాడట. కరోనా ఉదృతంగా ఉన్న టైం లో అమెరికాలో కాలు పెట్టడం మంచిది కాదు.. అమెరికా కాకుండా మరెక్కడైనా ఆ షెడ్యూల్ ప్లాన్ చేసుకోమని నిర్మొహమాటంగా దర్శకుడికి చెప్పేసినట్టుగా ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంటే సర్కారు వారి పాటలో దాదాపుగా కీలకమైన అమెరికా షెడ్యూల్ ని లేపేస్తున్నట్టుగా తెలుస్తుంది. కరోనా వ్యాక్సిన్ వచ్చి పరిస్థితులు చక్కబడితే అప్పుడు అమెరికా ప్రయాణంపై పునరాలోచిస్తారని, లేదంటే అమెరికా షెడ్యూల్ కాస్తా దుబాయ్ కి షిఫ్ట్ అవుతుంది అనే టాక్ మొదలయ్యింది.