అల్లు-అర్జునా-మజాకా..!

అల్లు అర్జున్ క్రేజ్ అండ్ రేంజ్ అలా వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ తర్వాత విపరీతంగా పెరిగిపోయింది. అందుకే బన్నీ కూడా ఆ క్రేజ్ ఇమేజ్ ని క్యాష్ [more]

Update: 2020-06-24 09:05 GMT

అల్లు అర్జున్ క్రేజ్ అండ్ రేంజ్ అలా వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ తర్వాత విపరీతంగా పెరిగిపోయింది. అందుకే బన్నీ కూడా ఆ క్రేజ్ ఇమేజ్ ని క్యాష్ చేసుకుందామని డిసైడ్ అయ్యి.. సుకుమర్ ని పుష్ప తో పాన్ ఇండియా లెవల్ కి దింపుతున్నాడు. మరి పాన్ ఇండియా అంటే అల్లు అర్జున్ రేంజ్ ఎంత పెరిగిందో ఊహించుకోవహ్చు. అందుకే దానికి తగ్గ పారితోషకం కూడా బన్నీ అందుకోవాలి. అలా వైకుంఠపురములో అప్పుడే.. 25 కోట్ల పారితోషకం తో పాటుగా… లాభాల్లో కొద్దిపాటి వాటా తీసుకున్నాడని టాక్ ఉంది. మరి అది ఇక్కడి హిట్ కే. కానీ ఇప్పుడు పాన్ ఇండియా లెవల్ సినిమాకి బన్నీ పారితోషకం ఎంత ఉంటుందో ఊహించుకోండి. అవును మీరనుకున్నట్టుగానే బన్నీ 35 కోట్ల పారితోషకం తో పాటుగా…లాభాల్లో వాటాను కూడా డిమాండ్ చేసాడనే టాక్ వినబడుతుంది.

కానీ కరోనా కష్ట కాలాన్ని దృష్టిలో పెట్టుకుని.. హీరోలంతా పారితోషకాలు తగ్గించుకోకపోతే నిర్మాతలు నిండా ముంగుతారని, మరోపక్క దర్శకులు, టెక్నీకల్ డిపార్ట్మెంట్ కూడా పారితోషకాలు తగ్గించాల్సిన పరిస్థితుల్లో బన్నీ ఈ రేంజ్ డిమాండ్ అంటే కుదరదని అంటున్నారు. మరి బన్నీ నా డిమాండ్ నాది.. పాన్ ఇండియా రేంజ్ కి ఆ మాత్రం తీసుకోకపోతే కష్టమంటున్నాడట. కరోనా ఎఫెక్ట్ తగ్గినా థియేట్రికల్ రైట్స్ మీద హోప్స్ పెట్టుకునే రోజులు కావివి.. అని పుష్ప నిర్మాతలు కూడా ఆలోచనలో పడ్డారట. మరి బన్నీ అడిగింది ఇస్తారా? లేదంటే లాభాల్లో వాటా చూద్దామని అంటారో చూడాలి.

Tags:    

Similar News