బాలీవుడ్ లో కపూర్ల వంశంలో అనేకమంది నటీనటులు ఉన్నప్పటికీ కరీష్మా కపూర్, కరీనా కపూర్ ల ప్రాముఖ్యత మరెవరికి దక్కదు. అయితే వీరిరువురు ఇప్పుడు నటన కు దూరంగానే వున్నారు. కరీనా కపూర్ గర్భం దాల్చిన నాటి నుంచి నట జీవితానికి విరామం ఇవ్వగా, కరీష్మా కపూర్ తన వివాహం ఐన నాటి నుంచి చిత్ర పరిశ్రమకు దూరం గానే వున్నారు. ఇటీవలి కాలంలో కరీష్మా కపూర్ తన విడాకుల వార్తతో మళ్లీ అందరి దృష్టి ఆకర్షించింది. ఈ విడాకుల తంతు ఈ ఏడాది జులై నెలలో ఒక కొలిక్కి వచ్చింది. అంటే నేటికీ కేవలం నాలుగు నెలల క్రితం వైవాహిక జీవితం నుంచి చట్టపరమైన విముక్తి పొందింది కరీష్మా కపూర్.
42 ఏళ్ల వయసుకి వైవాహిక జీవితం బెడిసికొట్టింది అంటే మళ్లీ అటువంటి కమిటెడ్ రేలషన్ షిప్స్ వైపు సహజంగా ఆసక్తి చూపరు అనే అనుకుంటాం. కానీ కరీష్మా కపూర్ విషయంలో కూడా ఇలానే ఆలోచిస్తే అది మన పొరపాటే. కరీష్మా కపూర్ తన లేట్ వయసులో కొత్త బాయ్ ఫ్రెండ్ తో బాలీవుడ్ పార్టీ లకు హాజరు అవుతూ అందరికి తన కొత్త బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేస్తుంది. ముంబై నగరంలోని ఒక ప్రముఖ ఫార్మాసిటికల్ కంపెనీ కి సి.ఈ.ఓ గా వున్న సంతోష్ తోష్నివాల్ తో అతి సన్నిహితంగా మెదులుతుంది కరీష్మా. త్వరలోనే కరీష్మా సంతోష్ తోష్నివాల్ ల వివాహం ఉండబోతుంది అనే వార్తలు కూడా వినపడుతున్నాయి. తాజాగా దర్శకుడు కృష్ణ.డి.కే ఇచ్చిన ఒక ప్రైవేట్ పార్టీ లో కరీష్మా తన బాయ్ ఫ్రెండ్ సంతోష్ తోష్నివాల్ తో కనిపించింది. ఇదే పార్టీ కి బాలీవుడ్ ప్రముఖులు సైఫ్ అలీ ఖాన్, ఖునాల్ ఖేం, సాన అలీ ఖాన్ తదితరు హాజరు కావటం విశేషం.
మొదటి వివాహం తెగతెంపులు చేసుకున్న నాలుగు నెలలకే, పైగా తన తోటి వయసు వున్న సంతోష్ తోష్నివాల్ ని వెంటేసుకుని తిరుగుతున్న కరీష్మా కపూర్ ని చూసి బాలీవుడ్ జనాలు అందరూ ఆశ్చర్యపోతున్నారు.