ఎన్ని మార్పులు చేసినా లెంగ్త్ తగ్గింది

Update: 2016-10-06 06:38 GMT

నివిన్ పౌలి, అనుపమ పరమేశ్వరన్, సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియాన్ నటీ నటులుగా తెరకెక్కిన వినూత్న ప్రేమ కథ ప్రేమమ్. ఆ చిత్ర మళయాళ వెర్షన్ 50 కోట్ల వసూళ్ల మార్కును తాకి మలయాళం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ చిత్రాన్ని హైదరాబాద్, మద్రాస్, బెంగుళూరు వంటి నగరాల్లో వుండే తెలుగు ప్రజలు చాలా మంది ఆ చిత్రాన్ని మలయాళంలో వీక్షించారు. మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లోని మల్టీప్లెక్స్ లలో కూడా నటీ నటులు ఎవరూ పరిచయం ఉన్న వారు కానప్పటికీ ఈ మలయాళ ప్రేమ కథ ప్రభావం బాక్సాఫీస్ దగ్గర కనిపించింది.

తెలుగు సినిమా పరిశ్రమ లో యువ నటులలో ఇంకా సొంత మార్కెట్ ని ఏర్పరచుకోలేకపోయారు అక్కినేని నాగ చైతన్య. ఆయన మాస్ ప్రేక్షకులకు చేరువ కావాలని చేసిన ప్రయత్నాలు అన్ని విఫలం అయ్యాయి. అందు వల్ల నాగ చైతన్య ఆయనకు అచొచ్చిన ప్రేమ కథలతోనే యువతను, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. అతనికి మొదటి హిట్ ఇచ్చిన గౌతమ్ వాసుదేవ్ మీనన్ ని నమ్మి సాహసం శ్వాసగా సాగిపో అనే ప్రేమ కథ లో నటించారు కానీ ఆ చిత్ర విడుదలలో కొంత కాలం గా జాప్యం జరుగుతూ ఉంది. ఇక నాగ చైతన్య ఆశలు అన్నీ ప్రేమమ్ పైనే.

ఎందరో తెలుగు ప్రేక్షకులు మలయాళ ప్రేమమ్ చూసిన అనుభూతిలో వున్నారు కాబట్టి వాళ్ళను థియేటర్లకు రప్పించే ప్రయత్నంగా చెప్తున్నారో లేక వాస్తవమే చెప్తున్నారో కానీ మళయాళ ప్రేమమ్ కి మన ప్రేమమ్ కి చాలా మార్పు కనిపిస్తుంది అని ప్రచారం చేస్తుంది చిత్ర బృందం. హీరో వివాహం ఆడే మడోన్నా సెబాస్టియన్ పాత్ర అక్కడ చాలా క్లుప్తంగా ఉంటుంది. ఇక్కడ ఆ పాత్ర నిడివి పెంచి ఆ పాయాత్రకు కూడా ఒక పాట జోడించారంట. కానీ నిడివి మాత్రం మలయాళ ప్రేమమ్ కన్నా తెలుగు ప్రేమమ్ 17 నిముషాలు తక్కువ ఉండటం విశేషం. మరి ఈ చిత్రం అసలు ని మరిపించేలా ఉంటుందో లేదో మరొక రోజు లో తెలియనుంది.

Similar News