గౌతమీ పుత్రుడు కన్నడలోనూ విడుదల కాబోతున్నాడా?

Update: 2016-10-24 11:37 GMT

శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న నందమూరి బాల క్రిష్ణ 100 వ చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి కి లెక్కకు మించి ఖర్చు చేస్తున్నారు దర్శకుడు జాగర్లమూడి రాధా క్రిష్ణ(క్రిష్). ఇప్పటి వరకు బాలయ్య బాబు ట్రాక్ రికార్డు కేవలం 41 కోట్ల రూపాయలు కాగా క్రిష్ గౌతమీ పుత్ర శాతకర్ణి ని ఏకంగా 70 కోట్ల రూపాయల వ్యయంతో తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతి పండుగ కి విడుదల కాబోతున్న చిత్రాలలో గౌతమీ పుత్ర శాతకర్ణి కూడా ఒకటి. మరో వైపు మెగా స్టార్ చిరంజీవి 150 వ చిత్రం కూడా ఒక్క రోజు తేడాతో విడుదలకు సిద్ధం అవుతుంది.

ఇంతటి భారీ అంచనాల మధ్య వస్తున్న చిత్రాలు కాబట్టి, పోటీ వాతావరణం నెలకొనటం సహజమే. 2016 సంక్రాంతి కి కూడా ఆసక్తి కరమైన పోటీ లో తన డిక్టేటర్ చిత్రాన్ని విడుదల చేసి బాలయ్య అపజయం చవి చూసారు. ఈ సారి ఆలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ ను ఒక ముఖ్య పాత్ర కోసం సంప్రదించారు గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్ర బృందం. కన్నడలోనూ ఈ చిత్రానికి అధిక క్రేజ్ తీసుకొచ్చే వ్యూహంలో భాగంగానే ఆ పాత్రకు శివ రాజ్ కుమార్ ని సంప్రదించారు. కేవలం తెలుగు లో విడుదలై అంతటి పెట్టుబడికి లాభాలు తీసుకురావటం అసాధ్యం. కన్నడ లోకి కూడా అనువదించి శివ రాజ్ కుమార్ ఫేమ్ ని ప్రచారానికి వాడుకుంటే ఓపెనింగ్స్ కి ఢోకా ఉండదు అని క్రిష్ ఆలోచన. శివ రాజ్ కుమార్ కూడా గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్రంలో భాగం కావటానికి తన అంగీకారం తెలిపినట్లు సమాచారం.

సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం లో వచ్చిన వీరప్పన్ జీవిత కథ ఐన కిల్లింగ్ వీరప్పన్ చిత్రం తెలుగులో విడుదల ఐన నాటి నుంచి శివ రాజ్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే.

Similar News