పవన్ కళ్యాణ్ ని ఫాలో అయిపోతున్న సుదీప్

Update: 2016-10-27 23:03 GMT

మల్టీ స్టారర్స్ సినిమాలు హిందీ తో పోలిస్తే దక్షిణాదిన బాగా అరుదుగా వస్తుంటాయి. ఉత్తరాదిన మల్టీ స్టారర్స్ సంఖ్యా ప్రతి ఏడాది పెరుగుతూనే వున్నాయి. చిన్న హీరోల దగ్గర నుంచి సొంత మార్కెట్ విదేశాలలోనూ విపరీతంగా వున్నా పెద్ద హీరోల వరకు అందరూ మల్టీ స్టార్రర్స్ చేస్తుంటారు బాలీవుడ్ లో. మన దగ్గర ప్రేక్షకుల నుంచి వుండే భారీ అంచనాలు అందుకోలేమన్న భయం ఒక కారణం అవ్వొచ్చు, మరో ప్రధాన కారణం తారల అభిమానుల మధ్య వుండే కలహాలను పెంచకూడదని ప్రయత్నం కావొచ్చు.

ఈ సంస్కృతిని చాలా కాలం తరువాత తిరిగి ప్రారంభించారు విక్టరీ వెంకటేష్. సీతమ్మ వాకిట్లో మసాలా, సిరిమల్లె చెట్టు, గోపాల గోపాల చిత్రాలు ఇందుకు నిదర్శనం. ఓహ్ మై గాడ్ రీమేక్ ఐన గోపాల గోపాల చిత్రంలో నాస్తికుడి పాత్రలో వెంకటేష్, క్రిష్ణ భగవానుడి పాత్రలో పవర్ స్టార్ కనిపించి ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు అదే చిత్రాన్ని కన్నడలో రీమేక్ చేస్తున్నారు. ప్రముఖ కన్నడ కథానాయకులు ఉపేంద్ర, సుదీప్ ఈ చిత్రంలో నటిస్తుండటం విశేషం.

ముకుంద మురారి అనే పేరును ఈ చిత్రానికి ఖరారు చేసారు. పవన్ కళ్యాణ్ పోషించిన దేవుడి పాత్రలో సుదీప్ కనిపిస్తుండగా నాస్తికుడిగా ఉపేంద్ర నటిస్తున్నారు. గతంలో పవర్ స్టార్ ఇండస్ట్రీ హిట్ అత్తారింటికి దారేది చిత్రాన్ని కన్నడ లో రీమేక్ చేసి భారీ విజయం అందుకున్నాడు సుదీప్. ఇప్పుడు మళ్లీ పవన్ కళ్యాణ్ పాత్రనే ముకుంద మురారి లోను పోషిస్తున్నాడు.

Similar News