పెళ్ళైన ఏడాదికే విడాకులా?

టాలీవుడ్ సింగర్ కం నటుడు నోయల్ గత ఏడాది సెకండ్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఎస్తర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సంప్రదాయక పద్ధతుల్లో పెళ్లాడిన నోయల్ [more]

Update: 2020-09-02 04:50 GMT

టాలీవుడ్ సింగర్ కం నటుడు నోయల్ గత ఏడాది సెకండ్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఎస్తర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సంప్రదాయక పద్ధతుల్లో పెళ్లాడిన నోయల్ జంట ఏడాది తిరక్కుండానే ఆరునెలలకే విడాకులకు అప్లై చెయ్యడం, ఏడాది తిరిగే సరికి కోర్టు వీళ్ళకి విడాకులు ఇవ్వడం జరిగింది. అయితే నోయల్ – ఎస్తర్ లు పెళ్ళైన ఆరునెలల నుండే గొడవలు పడడం, విభేదాలతో విడాకుల కోసం కోర్టు మెట్లెక్కారు. ఈ విషయం నోయల్ తో పాటుగా ఎస్తర్ కూడా సోషల్ మీడియాలో ట్వీట్ చేసారు.

 అయితే తమకు విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నామని, తమ మధ్యన సమస్యల వలనే విడాకులు తీసుకుంటున్నామని, ఈ నేపథ్యంలో నాకు అండగా నిలిచినా ఫ్రెండ్స్ అండ్ కుటుంబ సభ్యులకి థాంక్స్ అంటూ నోయెల్ ట్వీట్ చెయ్యగా.. తాను అన్ని విషయాల్లో ముక్కు సూటిగా, నిజాయ‌తీగా ఉంటాన‌ని అందుకే తనకి ఈ పరిస్థితి వచ్చింది. ఇక తమ విడాకులపై ఇంతకంటే ఎక్కువగా స్పందించలేనని చెప్పుకొచ్చింది ఎస్తర్. అయితే ఎస్తర్ కి సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు రావడం, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆమెకి అవకాశాలు పెరగడంతో.. నోయెల్ కి ఎస్తర్ కి మధ్యన విభేదాలు తలెత్తినట్టుగా ఫిల్మ్నగర్ టాక్.

Tags:    

Similar News