రకుల్ కి బాగా కాలిందిగా?

రకుల్ ప్రీత్ సింగ్ కి స్పైడర్ సినిమా తర్వాత సౌత్ లో ఆఫర్స్ రావడం లేదు.. అందుకే ఆమె బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టి.. బరువు బాగా [more]

Update: 2020-06-28 02:54 GMT

రకుల్ ప్రీత్ సింగ్ కి స్పైడర్ సినిమా తర్వాత సౌత్ లో ఆఫర్స్ రావడం లేదు.. అందుకే ఆమె బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టి.. బరువు బాగా తగ్గింది. అంటే సైజు జీరో రేంజ్ లో రకుల్ ప్రీత్ బాగా సన్నబడిపోయింది. అయితే సౌత్ లో అవకాశాలు తగ్గాక రకుల్ మీద అనేక రకాల ప్రచారాలు సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. రకుల్ క్రేజ్ సౌత్ లో పోయింది.. స్టార్ ఛాన్సెస్ ఇక రకుల్ కి రావు ఇలా చాలానే న్యూస్ లు సోషల్ ఇండియాలో చక్కర్లు కొడుతున్నాయి. రకుల్ కూడా మీరెందుకు ఇలా సన్నబడ్దరని ఓ షో లో రానా అడిగితె.. నేను ఓ సినిమా కోసం బరువు తగ్గాల్సి వచ్చింది.. అంతేకాని..బయట గాసిప్ వచ్చినట్టుగా అవకాశాలు కోసం మాత్రం సన్నబడలేదు అని ఘాటుగానే చెప్పింది. తాజాగా రకుల్ ప్రీత్ తమిళ్ లో నటిస్తున్న ఓ సినిమా నుండి తప్పించారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

నిర్మాతలు ఆమెని తప్పించి క్రేజ్ ఉన్న హీరోయిన్ ని తీస్కోబోతున్నారనే న్యూస్ వినబడుతుంది. అది చూసిన రకుల్ కి బాగా కాలింది. అందుకే కరోనా లాక్ డౌన్ జనాలు తిండి లేక, పనిలేక  చచ్చిపోతుంటే… ఇలాంటి రూమర్స్ పుట్టిస్తారా? బాధ్యత యుతమైన జర్నలిజం ఎప్పుడు వస్తుంది… మీడియా నిజాలను తెలుసుకొనే ప్రయత్నం ఎప్పుడు మొదలు యెప్డుతుంది.. కొన్ని హిట్స్ కోసం మరీ దిగజారిపోతున్నారు. అసలు ఎవరు ఎక్కడ షూటింగ్స్ జరుపుతున్నారో నాకు చెప్పండి. అసలే పనిలేక చస్తుంటే అంటూ రకుల్ కాస్త ఘాటుగానే స్పందించింది.

Tags:    

Similar News