వకీల్ సాబ్ చూస్తాడట!!

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా  వకీల్ సాబ్ షూటింగ్ 80 శాతం జరిగాక కరోనా కారణంతో సినిమాకి షూటింగ్ కి బ్రేకులు పడ్డాయి. లేదంటే పవన్ [more]

Update: 2020-03-30 05:30 GMT

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ షూటింగ్ 80 శాతం జరిగాక కరోనా కారణంతో సినిమాకి షూటింగ్ కి బ్రేకులు పడ్డాయి. లేదంటే పవన్ కళ్యాణ్ ఈపాటికి వకీల్ సాబ్ షూటింగ్ ని ఫినిష్ చేసి క్రిష్ సినిమా కూడా రెండు మూడు షెడ్యూల్స్ లాగించేసేవాడు. అయితే కరొనతో షూటింగ్ ఆగిపోయినా…. పవన్ కళ్యాణ్ మాత్రం వకీల్ సాబ్ కి తన పాత్రకి సంబందించిన డబ్బింగ్ చెప్పుకుంటున్నాడట. లాక్ డౌన్ ఎప్పుడు ముగుస్తుందో అప్పుడు వకీల్ సాబ్ ని ఆగమేఘాల మీద పవన్ పూర్తి చేస్తాడట.

అయితే తాజాగా జరిగిన 80 శాతం షూటింగ్ రషెస్ ని పవన్ కళ్యాణ్ చూడాలనుకుంటున్నాడట. అయితే రషెస్ చూసే కంటే.. ప్రస్తుతం జరిగిన షూటింగ్ పార్ట్ ని ఎడిట్ చేసి పవన్ కి చూపించాలని వకీల్ సాబ్ టీం ఆరాట పడుతుందట. అందుకే దర్శకుడు వేణు శ్రీరామ్ స్వయంగా ఎడిటర్ టేబుల్ దగ్గరే కూర్చుని వకీల్ సాబ్ ఎడిటింగ్ ని పర్యవేక్షిస్తున్నాడట. ఇక పవన్ కళ్యాణ్ చూసి ఓకె అంటే గనక.. అంత హ్యాపీ. ఇక కరోనా లాక్ డౌన్ పూర్తి కాగానే సినిమా షూటింగ్ శరవేగంగా కానిచ్చేసి.. సినిమాని మే చివరిలోనైనా విడుదల చెయ్యాలనే ప్లాన్ లో టీం ఉందట.

Tags:    

Similar News