భారత దేశం వంటి జనాభా ఎక్కువ వున్న ప్రజా స్వామ్య దేశంలో సామాన్య ప్రజలకు వుండే స్వేచ్ఛ సెలబ్రిటీస్ కి ఉండదు. భారత దేశంలో వరుసగా వెలుగు చూస్తున్న అత్యాచారాలు, హత్యలు, స్కామ్‌లు, దోపిడీల వార్తలతో విసిగిపోయిన ఆమిర్ ఖాన్ భార్య కిరణ్ రావ్ భారత దేశం లో ఉండలేక వదిలి వెళ్లిపోవాలని వుంది అని అభిప్రాయాన్ని ఆమిర్ తన ట్విట్టర్ ద్వారా వ్యక్తపరిచి ఎన్నో దుష్ప్రభావాలను ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ మనసులో మాట బైట పెట్టటానికి ఆంక్షలు తగవు అని నమ్మే కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ ధైర్యంగా భారత దేశం ఆడవారికి ఎంత ప్రమాద కారమో తన అనుభవాల ద్వారా వివరించింది.
"అర్ధ రాత్రి ఆడవారు వీధులలో వంటరిగా ధైర్యంగా తిరగ గలగాలి అని ఆశించిన స్వాతంత్ర్య సమరయోధుల కలలు నేటి సమాజం తీర్చలేకపోతుంది. దానికి బాధ పడవలసిన అవసరం లేదు అనే విధంగా అలవాటు పడిపోయాం. కానీ ఇప్పుడు పగలు కూడా ఆడవారి స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి ఏర్పడింది. బెంగళూర్ లోని వైద్య వృత్తిలో వున్న ఒక పురుషుడు నాకు అసభ్యకరమైన సందేశాలు పంపటం, దూషించటం, ముంబై నగరంలోని బాంద్రా ప్రాంతంలోని నా ఫ్లాట్ లోకి ఒక యువకుడు చొరబడి నా పై దాడికి ప్రయత్నించినప్పుడు నేను పోలీస్ వారిని ఆశ్రయించవలిసి వచ్చింది. ప్రతి సారి పోలీస్ వారు వచ్చే వరకు జరగవలసిన నష్టం జరగకుండా ఆగదు కదా. ఈ విషయంలో మార్పు ప్రతి వ్యక్తిలోనూ వస్తేనే ఇండియా అత్యున్నతంగా ఉంటుంది. లేకపోతే మన దేశస్థులే స్వదేశాన్ని అసహ్యించుకునేలా దిగజారుతూనే ఉంటుంది." అని మండి పడుతుంది శృతి హాసన్.