నటీనటులు: మంచు విష్ణు, ప్రగ్య జైస్వాల్, బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, కోట శ్రీనివాస రావు, సత్య కృష్ణ, ప్రభాస్ శ్రీను తదితరులు
స్క్రీన్ ప్లే: డార్లింగ్ స్వామి
మ్యూజిక్ డైరెక్టర్: ఎస్.ఎస్ థమన్
నిర్మాతలు: కీర్తి చౌదరి, కిట్టు
దర్శకుడు: జి. నాగేశ్వరరెడ్డి
మంచు విష్ణు దూసుకెళ్తా, లక్కున్నోడు అంటూ సినిమాలు చేస్తున్నప్పటికీ అతనికి అస్సలు లక్కే కలిసి రావడం లేదు. మంచు మోహన్ బాబు కొడుకుగా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. విష్ణు మాత్రం హీరోగా నిలదొక్కుకోలేకపోతున్నాడు. ఇక ప్రస్తుతం కమెడియన్ గా ఫామ్ ని కోల్పోయిన బ్రహ్మానందం కూడా ఈ మధ్య సినిమాలో చాలా రేర్ గా దర్శనమిస్తున్నాడు. అసలు బ్రహ్మి కామెడీకి కాలం చెల్లిపోయింది. అనేక మంది కమెడియన్ కుప్పలు తెప్పలుగా ఇండస్ట్రీలకి రావడంగా బ్రహ్మి హవా పూర్తిగా తగ్గిపోయింది. మరి మార్కెట్ కోల్పోయిన మంచి విష్ణు - ఫామ్ లో లేని బ్రహ్మనందం కలిసి ఆచారి అమెరికా యాత్ర అంటూ ప్రేక్షకుల ముందుకు ఈ శుక్రవారమే వచ్చేసారు. అమెరికాలో పూజారులుగా దున్నేసి నాలుగు డబ్బులు మూటకట్టుకుందామని వెళ్లిన వారికీ అక్కడ ఎదురయ్యే పరిస్థితులను వారెలా అధిగమించారు అనే కాన్సెప్ట్ తో మోహన్ బాబు ఆస్థాన దర్శకుడు జి నాగేశ్వర రెడ్డి డైరేక్షన్ లో తెరకెక్కిన ఈ ఆచారి అమెరికా యాత్ర ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుందో సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
కృష్ణమాచారి(మంచు విష్ణు)కి గురువు అప్పలాచారి(బ్రహ్మానందం). వీరిద్దరూ పౌరోహిత్యం చేసుకుంటూ ఉండే గురుశిష్యులు. కృష్ణమాచారి, అప్పలాచారి లు కలిసి ఆ ఊరిలోని పెద్దమనిషి చక్రపాణి(కోట శ్రీనివాసరావు) ఇంటికి హోమం చేయించడానికి వెళ్ళినప్పుడు... అక్కడ వున్న చక్రపాణి మానవరాలితో కృష్ణమాచారి ప్రేమలో పడతాడు. అయితే చక్రపాణి మనవరాలు రేణుక(ప్రగ్య జైస్వాల్) అమెరికా నుంచి తాతగారి ఇంటికి వస్తుంది. అమెరికా నుండి వచ్చిన రేణుక మీద అక్కడ హత్యా ప్రయత్నం జరుగుతుంది. రేణుక హత్యా యత్నం వెనుక రేణుక పెద్ద మావయ్య సుబ్బరాజు(ప్రదీప్ రావత్)కొడుకు విక్కీ(ఠాకూర్ అనూప్ సింగ్)ఉంటాడు. అయితే ఆ హత్యాయత్నం నుండి బయటపడిన రేణుక హోమం చివరి రోజు కనబడకుండా పోతుంది. అలాగే చక్రపాణి కూడా మరణిస్తాడు. అయితే రేణుక కనబడకుండా పోవడంతో.. ఆమె గురించి వెతికిన కృష్ణమాచారి కి రేణుక అమెరికా వెళ్లిందని తెలుసుకుని... ఆమె కోసమే తన బ్యాచ్ మొత్తాన్ని తీసుకుని అమెరికా వెళ్తాడు. కానీ అక్కడ అమెరికాలో అనుకోని పరిస్థితుల్లో రేణుక నిశ్చితార్థం విక్కీతో ఫిక్స్ అవుతుంది. అయితే అసలు రేణుక, కృష్ణమాచారిని ప్రేమిస్తుందా? ఊరిలో మాయమైన రేణుక అమెరికాలో ఎలా తెలుస్తుంది? అసలు రేణుక హత్య యత్నం వెనుక ఆమె మావయ్య కొడుకు విక్కీ ఉన్నాడా? అమెరికాలో కృష్ణమాచారి రేణుక ని కలుస్తాడా? అసలు రేణుక, కృష్ణమాచారి ల వివాహమవుతుందా? అనేది ఆచారి అమెరికా యాత్ర చూసి తెలుసుకోవాల్సిందే.
నటీనటుల నటన:
మంచు విష్ణుకి ఇలా పంతులు వేషం వెయ్యడం కొత్తేమి కాదు. ఎందుకంటే గతంలో దేనికైనా రెడీ సినిమాలో మంచు విష్ణు ముస్లిం కుర్రాడు అయినా అనుకోని పరిస్థితుల్లో ధర్మవంతో కలిసి పంతులు వేషం వేస్తాడు. అచ్చం పంతులులా ఆ వేషం కట్టు బొట్టు అన్ని ఇప్పుడు ఆచారి అమెరికా యాత్రలోను కనబడుతుంది. కృష్ణమాచారిగా మంచు విష్ణు కంప్లిమేట్స్ పడే నటన ఇవ్వకపోయినా పర్వాలేదనిపించాడు. కానీ ఎక్కడా కొత్తదనం అన్న ఫీలింగ్ మాత్రం రాదు. దేనికైనా రెడీ సినిమా లో కుటుంబం కోసం పూజారి అవతారమెత్తితే... ఆచారి అమెరికా యాత్రలో మాత్రం తాను ప్రేమించిన అమ్మాయి కోసం ఒక పూజారి ఖండాంతరాలు దాటి అమెరికా వెళ్లడం... అలంటి పాత్రలో విష్ణు పర్వాలేదనిపించాడు. ఇక ఈ సినిమా కి మరో మెయిన్ కేరెక్టర్ బ్రహ్మానందం. బ్రహ్మి కామెడీకి కాలం చెల్లింది అనడానికి ఈ సినిమా మరో ఉదాహరణ. ఈ మధ్యన బ్రహ్మానందం చేసిన సినిమాలన్ని ఒక్కదాని తర్వాత ఒకటి ఢమాల్ అంటున్నాయి. ఆలా ఉంటుంది బ్రహ్మి కామెడీ. అవే కామెడీ పంచ్ లు, అదే డైలాగ్స్ తో విసుగు తెప్పించేస్తున్నాడు. ఇక ఆచారి లో కూడా బ్రహ్మానందం కామెడీ అసలు వర్కౌట్ అవ్వలేదు. ఇక హీరోయిన్ ప్రగ్య జైస్వాల్.. శక్తిమేర అందాల ఆరబోతకు దిగిన ఈ సినిమాలో కంటెంట్ లేకపోవడం తో ఈ హీరోయిన్ కి ఈ సినిమా అస్సలు కలిసిరాదనే చెప్పాలి. ఇక విలన్స్ కూడా అంతే. విలన్స్ గా ప్రదీప్ రావత్, టాకూర్ అనూప్ సింగ్, రాజా రవీంద్ర లను ఇలాంటి పాత్రల్లో గతంలోనే చూసేసాం కాబట్టి కొత్తదనం ఎక్కడా కనిపించదు. ఇక కామెడీ కోసం అనేకమంది కమెడియన్స్ ని తీసుకునానప్పటికీ వారిని ఎక్కడ సరిగ్గా వాడుకోలేకపోయాడు దర్శకుడు. ప్రవీణ్, ప్రభాస్ శీను, పృథ్వి, పోసాని, వేణు,సత్య కృష్ణ, సురేఖ వాణి, రాజా రవీంద్ర, సుప్రీత్, గీత సింగ్, మాస్టర్ భరత్ ఇలా ఎవరి కామెడీ ఆకట్టుకునేలా లేదు.
విశ్లేషణ:
దర్శకుడు జి నాగేశ్వర రెడ్డి కామెడీకి కాలం చెల్లింది. ఆయన కామెడీ ప్రధానంగా కథలు రాసుకుంటాడు. గతంలో అలానే కొన్ని హిట్స్ కూడా ఉన్నాయి ఈ దర్శకుడికి. కానీ గత రెండు డిజాస్టర్స్ నుండి జి నాగేశ్వరరెడ్డి కామెడీ ఈ మాత్రం వర్కౌట్ అవవడం లేదు. అసలు ఈ సినిమా మొత్తం...సిల్లీ ప్లాట్, లాజిక్ లేని సన్నివేశాలు,నవ్వించేంత కామెడీ లేకపోవడం పూర్ స్క్రిప్ట్, ఎమోషనల్‌గా, కామెడీ పరంగా ఆకట్టుకునే సన్నివేశాలు లేకపోవడం సినిమాకు పెద్ద మైనస్‌గా నిలిచాయి . ఆచారి అమెరికా యాత్రలో కామెడీ ఆశించిన స్థాయిలో ఎక్కడా కనబడదు. పరమ రొటీన్ కథతో నాగేశ్వరరెడ్డి ప్రేక్షకులకు బోర్ కొట్టించేసాడు. ఇలాంటి కథ, కథనాలు తెలుగు ప్రేక్షకులకు కొత్తేం కాదు. మరి దర్శకుడు నాగేశ్వరరెడ్డి ఈ సినిమాను చేయడానికి కారణమేంటో ఆయనకే తెలియాలి. అలాగే హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ ని ఎంతగా గ్లామర్ గా చూపించినా అస్సలు ఉపయోగం ఉండదు. అలాగే సిఎంమాలో అమెరికా బ్యాక్డరోప్ ఎందుకు పెట్టారో అనేది కూడా అర్ధం కానీ సిల్లీ మేటర్. ఇక హీరోయిన్ తాత గారి అస్థికలను కసి లో కలపాణిస్తానని విలన్ చెబితే... అతనితో పెళ్ళికి సిద్దమవడం, అలాగే బ్రహ్మి కామెడీలో పసలేకపోవడం వంటి విషయాలు మాత్రం బాగా ఇబ్బంది పెట్టేస్తాయి. మరి మంచి విష్ణు ఈ ఆచారి అమెరికా యాత్ర కథ విని ఒప్పుకున్నాడో ... లేదా దర్శకుడి మీద నమ్మకంతో కథ వినకుండా ఒప్పుకున్నాడో కానీ... మంచు విష్ణు కెరీర్ లోనే అతి ఘోరమైన ప్లాప్ ఆచారితో అందుకున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
సాంకేతిక వర్గం పనితీరు:
తొలిప్రేమతో హిట్ కొట్టిన థమన్ ఆచారి అమెరికా యాత్రకి మాత్రం చాలా పేలవంగా మ్యూజిక్ అందించాడు. థమన్ అందించిన పాటలు మ్యూజిక్ గాని. బ్యాగ్రౌండ్ స్కోర్ గాని ఆశలు ఆకట్టుకోలేకపోగా... సినిమాకి మరింత మైనస్ అనేలా అయ్యాయి. రెండు మూడు పాటలు బాగానే అనిపించినప్పటికీ మిగతా వాటి విషయంలో థమన్ చేసియాన్ పొరపాటుతో ఆ రెండు పాటలకు కొడాఆ వేల్యూ లేకుండా పోయింది. ఇక డార్లింగ్ స్వామి మాటలు తీసికట్టుగా ఉన్నాయి. సిద్దార్థ్ రామస్వామి సిఎంమాటోగ్రఫీ మంచి స్టాండర్డ్ లోనే ఉంది. కాకపోతే అమెరికా ఎపిసోడ్ మొత్తం రొటీన్ గా ఉన్నప్పటికీ సినిమా లో నుండి ప్రేక్షకుడు లేచి వెళ్లిపోకుండా సిఎంమాటోగ్రఫీనే హెల్ప్ చేసిందేనని చెప్పాలి. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే అనవసరమైన కామెడీ సన్నివేశాలు లేపేసే అవకాశం ఉన్నా.... దర్శకుడి ఒత్తిడో లేక ఇంకేదైనా కారణం గానో కానీ.. ఎడిటింగ్కే పరమ చెత్తగా అనిపిస్తుంది. ఇక అన్నిటిలో మెయిన్ హైలెట్ ఈ సిఎంమాకి ఖర్చు పెట్టిన డబ్బు. నిర్మాతలు అంన్చు విష్ణు మీద నమ్మకంగా డబ్బు మాత్రం నీళ్లలా ఖర్చు పెట్టారనేది ఆచారి ప్రతి ఫ్రెమ్ లోను తెలుస్తుంది.
ప్లస్ పాయింట్స్: ప్రగ్య గ్లామర్, సినిమాటోగ్రఫీ, చెప్పుకుంటే ప్లస్ పాయింట్స్ ఏమి లేవు
మైనస్ పాయింట్స్: కథ, కథనం, దర్శకత్వం, ఇల్ లాజికల్ సీన్స్, వీక్ స్క్రిప్ట్, మ్యూజిక్,ఎడిటింగ్, నేరేషన్.. ఇంకా చాలానే ఉన్నాయి
రేటింగ్: 1.5/5