మహేష్‌బాబు భరత్ మేనియా రెండు మూడు రోజులుగా టాలీవుడ్‌ను ఊపేస్తోంది. రాజకీయాలంటేనే ఎప్పుడూ ఆమడ దూరంలో ఉండే మహేష్‌బాబు కెరీర్‌లోనే ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగా తెరమీద కనిపిస్తుండడంతో ప్రేక్షకులకు ఉత్కంఠ మామూలుగా లేదు. మహేష్ ముఖ్యమంత్రి రోల్ ఒక్కటే కాదు.... ఇదే కొరటాలతో మహేష్ చేసిన శ్రీమంతుడు మహేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్. ఈ స్థాయి హిట్ మహేష్‌కు శ్రీమంతుడుకు ముందూ లేదు.... తర్వాత లేదు. రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు సొంతం చేసుకున్న ఈ సినిమా ఈ రోజు ఉదయం 5 గంటల షోతో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. మరి సీఎంగా భరత్ అంచనాలు అందుకున్నాడా ? లేదా ? అన్నది షార్ట్ & స్వీట్ రివ్యూలో చూద్దాం.
మహేష్‌బాబు సీఎంగా అదరగొట్టేశాడు. లండన్లో చదువుకున్న ఓ యువకుడు ఇండియాకు తిరిగి వచ్చి ఇక్కడ కుళ్లుపోయిన రాజకీయ వ్యవస్థను ఎలా మార్చాడు ? అతడికి ఈ క్రమంలో ఎదురైన ఇబ్బందులు ఏంటి ? నమ్మిన వాళ్లే అతడికి ఎలా వెన్నుపోటు పొడిచారు. తన తండ్రి సీఎంగా ఉంటూ చనిపోతే ఆ ప్లేస్‌లో సీఎం అయిన భరత్‌కు రాజకీయం, వ్వవస్థ మార్పు అంత సులువు కాదని అర్థమవుతుంది. ఈ క్రమంలోనే అతడు ఏం చేశాడు ? ఎలా జనాల మనస్సులను గెలుచుకున్నాడు ? అనే కాన్సెఫ్ట్‌తో తెరకెక్కిన సినిమా జనాల మనస్సులను గెలుచుకుంది.
దీనిని బట్టి చూస్తే మాత్రం.. మహేశ్‌బాబు మరోసారి టాలీవుడ్‌ను దున్నేయడం ఖాయమని పలువురు అంటున్నారు. ఇక ఆయన ఫ్యాన్స్‌కు పండుగేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా జాగ్రత్తగా నడిపించాడు దర్శకుడు కొరటాల. అలానే ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్ కూడా బాగుంది. ఇక సెకండ్ హాఫ్ అయితే మంచి కాన్సెప్ట్ తో ఉండడం సినిమాకు మరింత బలాన్ని ఇచ్చింది. ముఖ్యంగా మాస్ ప్రేక్షకుల కోసం వచ్చే ఫైట్స్ అద్భుతం.
సెకండ్ హాఫ్ లో వచ్చే ప్రెస్ కాన్ఫరెన్స్ సన్నివేశం లో మహేశ్ బాబు నటన, డైలాగ్స్ కేక పెట్టించాయి. ప్రీ క్లైమాక్స్ సీన్, అలానే క్లైమాక్స్ ఫైట్ సీన్ దుమ్మురేపాయి. ఇక సినిమాలో పాటలు కూడా సందర్భానుసారం వచ్చాయని ముఖ్యంగా భరత్ అనే నేను టైటిల్ సాంగ్, వచ్చాడయ్యో సామి సాంగ్స్ ఆడియన్స్ కి కన్నులపండుగే. సెకండాఫ్ లాగ్ అవ్వడం, రన్ టైం ఎక్కువ ఉండడం మైనస్‌లు. మొత్తంగా.. మహేశ్-కొరటాల కాంబినేషన్ శ్రీమంతుడు మ్యాజిక్ రిపీట్ చేసింది. పూర్తి రివ్యూ కోసం చూస్తూనే ఉండండి తెలుగుపోస్ట్.కామ్