'ఛ‌ల్ మోహ‌న్ రంగ' షార్ట్ & స్వీట్ రివ్యూ

Update: 2018-04-05 03:01 GMT

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి కథ అందించడంతో పాటు చిత్ర నిర్మాణంలో కూడా భాగస్వామిగా ఉన్న సినిమా ఛ‌ల్ మోహ‌న్ రంగ‌. లై లాంటి డిజాస్ట‌ర్ త‌ర్వాత నితిన్ న‌టించిన ఈ సినిమాకు చాలా స్పెషాలిటీసే ఉన్నాయి. లై జోడీ నితిన్ - మేఘా ఆకాష్ వెంట‌నే జోడీ క‌ట్ట‌డం, ఇక మ‌రో స్పెష‌ల్ ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించే. ‘ఛల్ మోహన్ రంగ’ సినిమాను శ్రేష్ట్ మూవీస్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మించారు. తొలిసారి పవన్ కళ్యాణ్ నిర్మాతగా.. నితిన్ హీరోగా ఛల్ మోహన్ రంగ రూపొందించారు. ఇక ఇటీవల జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సైతం పవన్ కళ్యాణ్ హాజరై ఈ చిత్రానికి మరింత హైప్ తీసుకువచ్చారు.

ఇక సినిమా టీజర్, ట్రైలర్స్‌లో త్రివిక్రమ్ మార్క్ స్పష్ఠంగా కనిపిస్తుండటంతో ఈ సినిమాలో త్రివిక్రమ్ తన పెన్ పవర్ ఫ్లేవర్‌ను మరోసారి రుచి చూపించిన‌ట్టు కూడా క్లీయ‌ర్‌గా తెలిసిపోతోంది. ఇక ఈ వీకెండ్‌లో ఒక రోజు ముందుగానే థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ సినిమా ఇప్ప‌టికే ఓవ‌ర్సీస్‌లో ప్రీమియ‌ర్లు కంప్లీట్ చేసుకుంది. ప్రీమియ‌ర్ల త‌ర్వాత సినిమాకు ఎలాంటి టాక్ వ‌చ్చిందో తెలుగుపోస్ట్.కామ్ షార్ట్ రివ్యూలో ఓ లుక్కేద్దాం.

క‌థ‌ - విశ్లేష‌ణ :

అమెరికా వెళ్లాల‌న్న టార్గెట్‌తో నితిన్ అక్క‌డ‌కు వెళ్ల‌డం హీరోయిన్ మేఘా ఆకాష్ ప‌రిచ‌యం కావ‌డం... చివ‌ర‌కు వీరు ప్రేమ‌లో ప‌డ‌డం... అనుకోని కార‌ణాల‌తో విడిపోవ‌డం జ‌రుగుతుంది. మేఘా ఇండియాకు వస్తుంది. ఆమెను వెతుక్కుంటూ మోహన్ రంగ కూడా ఇండియాకు వస్తాడు. వారిద్ద‌రు ఎందుకు విడిపోయారు ? వీరి ప్రేమ‌కు వ‌చ్చిన అడ్డంకులు ఏంటి ? తిరిగి వీళ్లు ఎలా క‌లుసుకున్నారు అనేదే క‌థ‌.

ఇక ఫ‌స్టాఫ్ అంతా యూఎస్ నేప‌థ్యంలో బ్యూటిఫుల్ ల‌వ్ అండ్ కామెడీ సీన్ల‌తో ద‌ర్శ‌కుడు కృష్ణ‌చైత‌న్య సినిమాను బాగా ప్ర‌జెంట్ చేశాడు. ల‌వ‌ర్ బాయ్‌గా నితిన్ న‌ట‌న సూప‌ర్‌. నితిన్ - మేఘా ఆకాష్ కెమిస్ట్రీ యూత్ మ‌తులు పోగొట్టేలా ఉంది. ఇంట‌ర్వెల్ ట్విస్ట్‌తో ప్రేక్ష‌కుడికి సినిమాపై సెకండాఫ్‌పై మ‌రింత ఆస‌క్తి పెంచుతుంది. అయితే సెకండాఫ్ మాత్రం అంత ఆస‌క్తిగా లేదు.

ఇక క‌థ గొప్ప‌గా లేక‌పోయినా క‌థ‌నంతో ద‌ర్శ‌కుడు కృష్ణ చైత‌న్య మేజిక్ చేశాడు. ఎంట‌ర్‌టైనింగ్ సీన్లు, ఎమోష‌న‌ల్ సీన్లు బాగా క‌నెక్ట్ అయ్యాయి. మెగా ఫ్యాన్స్‌ను అల‌రించేలా ప‌వ‌న్‌, చిరు స్ఫూఫ్ సీన్లు బాగా రాశారు. సినిమా లెన్త్ క‌రెక్టుగా ఉంది. టెక్నిక‌ల్‌గా కూడా బాగుంది.

ప్ల‌స్ పాయింట్స్ (+) :

- నితిన్, మేఘా ఆకాష్ కెమిస్ట్రీ

- మ్యూజిక్

- సినిమాటోగ్రఫీ

- ఫ‌స్టాఫ్‌

- ఎడిటింగ్‌

మైన‌స్ పాయింట్స్ (-):

- రొటీన్ స్టోరీ

- అక్కడక్కడ ల్యాగ్ అవడం

- సెకండాఫ్‌

ఫైన‌ల్‌గా .....

యూత్‌ను మెప్పించే ఛ‌ల్ మోహ‌న్ రంగ‌

మ‌రి కొద్ది సేప‌ట్లో పూర్తి రివ్యూతో క‌లుద్దాం

Similar News