హలో గురు ప్రేమకోసమే రివ్యూ

Update: 2018-10-18 07:54 GMT

బ్యానర్: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర

నటీనటులు: రామ్ పోతినేని, అనుపమ పరమేశ్వరన్, ప్రణీత, ప్రకాష్ రాజ్, సితార, పోసాని కృష్ణమురళి,

ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్

సినిమాటోగ్రఫీ: విజయ్ కె. చక్రవర్తి

మ్యూజిక్ డైరెక్టర్: దేవిశ్రీ ప్రసాద్

ప్రొడ్యూసర్: దిల్ రాజు

డైరెక్టర్: త్రినాథ రావు నక్కిన

రామ్ పోతినేని 'నేను శైలజ' తో సక్సెస్ ట్రాక్ ఎక్కినప్పటికీ.... 'ఉన్నది ఒకటే జిందగీ' సినిమాతో మళ్ళీ ప్లాప్ కొట్టడంతో... 'సినిమా చూపిస్త మావ, నేను లోకల్' సినిమాల హిట్స్ తో ఉన్న దర్శకుడు త్రినాధ్ రావు నక్కినతో కలిసి దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో హలో గురు ప్రేమకోసమే అంటూ కామెడీ ఎంటెర్టైనెర్ ని చేసాడు. దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేస్తే మల్లు సక్సెస్ ట్రాక్ ఎక్కుతాననుకున్న రామ్ నక్కిన త్రినాథ రావు తో కలిసి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. 'ఉన్నది ఒకటే జిందగీ' సినిమాని కిషోర్ తిరుమల డైరెక్షన్ లో రామ్ స్నేహానికి ప్రాణం, విలువనిచ్చే వ్యక్తిగా మరో హీరో శ్రీ విష్ణు తో కలిసి నటించాడు. ఈ సినిమాలో రామ్ కి జోడిగా ఒక హీరోయిన్ గా అనుపమ నటించింది. అయితే అనుపమ కేరెక్టర్ ని మధ్యలోనే ముగించేయడంతో అనుపమ 'ఉన్నది ఒకటే జిందగీ'లో సగం మేరే కనబడింది. ఇక రామ్ స్నేహం కోసం ప్రేమించిన అమ్మాయిని త్యాగం చేసే అబ్బాయి పాత్రలో చాలా బాగా నటించాడు. రామ్ స్టయిలిష్ గా కనబడినా ఆ సినిమా అనుకున్నంత హిట్ కాలేదు. అందుకే రెండు సినిమాల హిట్ తో ఉన్న త్రినాథ రావు తో కలిసి రామ్ ఈసారి ఎలాగైనా హిట్ అందుకోవాలనుకున్నాడు. ఇక ఫస్ట్ లుక్‌తోటే మంచి రెస్పాన్స్ రాబట్టిన 'హలో గురూ ప్రేమకోసమే' టీజర్, ట్రైలర్‌లు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ట్రైలర్‌లోని డైలాగ్స్ యూత్‌కి కనెక్ట్ అయ్యేలా ఉండటంతో పాటు రామ్, అనుపమల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయినట్టు ట్రైలర్‌లో చూపించారు. ఇందులోని లవ్, రొమాన్స్, ఎమోషన్స్, సెంటిమెంట్ డైలాగ్స్ బాగా పేలుతున్నాయి. ఇక విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో హీరోకి ఫ్రెండ్‌గా హీరోయిన్‌కి తండ్రిగా నటించడం వంటి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తో ఈ దసరా కానుకగా ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాతో రామ్ అండ్ అనుపమలు సక్సెస్ ట్రాక్ ఎక్కరా? లేదా? అనేది సమీక్షలో తెలుసుకుందాం.

కథ:

కాకినాడలో అమ్మానాన్నతో లైఫ్ ఎంజాయ్ చేసే సంజు (రామ్ ) సరదాగా అల్లరి చిల్లరిగా తిరుగుతు బాధ్యత లేకుండా ఉంటాడు. తన కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు హైదరాబాద్ లో ఏదో ఒక ఉద్యోగం చేసుకుని సెటిల్ అవ్వడానికి వస్తాడు. సంజు తల్లి(సితార) కోరిక మేరకు సంజు... విశ్వనాద్(ప్రకాష్ రాజ్) ఇంట్లో ఉంటాడు. అదే క్రమంలో విశ్వనాధ్ కూతురు అను ని (అనుపమని) ప్రేమించడం మొదలు పెడతాడు. ఈలోగా ప్రకాష్ రాజ్ తన కూతురికి మరో సంబంధం చూస్తాడు. దీంతో సంజు షాకవుతాడు. మరి సంజు ప్రేమను అనుపమ అంగీకరించిందా? అసలు ఈ సినిమాలో ప్రణీత కేరెక్టర్ ఏమిటి? అను తండ్రి ప్రకాష్ రాజ్ కు రామ్ కు ఎదురైన పరిస్థితులు ఏంటి? అసలు సంజుకి అను కి పెళ్లవుతుందా? తెలియాలంటే హలో గురు ప్రేమకోసమే సినిమా తెర మీద వీక్షించాల్సిందే.

నటీనటుల నటన:

సంజు పాత్రలో రామ్ చాలా ఎనర్జిటిక్‌గా నటించాడు. లవ్, కామెడీ స్టోరీల్లో అతడి నటన ఎలా ఉంటుందో.. రెడీ, నేను శైలజ చిత్రాల్లో చూశాం. ఈ సినిమాలోనూ రామ్ మరోసారి తన నటనతో అద్భుతంగా ఆకట్టుకున్నాడు. అనుపమ తో రొమాంటిక్ సన్నివేశాల్లో రామ్ బాగా నటించాడు. క్లాస్ లుక్స్ లో రామ్ ఎప్పటిలాగే అందంగా కనబడ్డాడు. ఈ సినిమాలో రామ్ తర్వాత మరో కీలకమైన పాత్ర అనుపమది. ఫ్యామిలీ గర్ల్‌గా, తండ్రిని ఎంతో ఇష్టపడే అమ్మాయి పాత్రకు అనుపమ న్యాయం చేసింది. అనుపేమ పరమేశ్వరన్ క్యూట్ లుక్స్ తో ట్రెడిషనల్ గా అదరగొట్టింది. సొంత డబ్బింగ్ తో ఆకట్టుకుంది. అనుపమ పరమేశ్వరన్ తండ్రిగా ప్రకాశ్ రాజ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఓ పక్క అమ్మాయి తండ్రిగా.. మరో పక్క తన కూతుర్ని ప్రేమించిన కుర్రాడికి స్నేహితుడిగా తనకే సాధ్యమైన నటనను కనబరిచారాయన. అను తల్లిగా ఆమని మాట్లాడే బట్లర్ ఇంగ్లిష్ నవ్విస్తుంది. మిగతా నటీనటులు పరిధిమేర నటించి ఆకట్టుకున్నారు.

విశ్లేషణ:

సినిమా చూపిస్త మావ సినిమాని ఒక శుచి శుభ్రం కలిగిన వ్యక్తి రావు రమేష్ కి అల్లరిచిల్లరిగా తిరిగే కుర్రాడి రాజ్ తరుణ్ మధ్య నడిచే గొడవతో.. చివరికి మామ అల్లుళ్ళని చేసిన దర్శకుడు త్రినాథ రావు నక్కిన... ఆ సినిమాని కామెడీ ఎంటెర్టైనెర్ గా మలిచి యావరేజ్ హిట్ అందుకున్నాడు. ఇక నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా సినిమా చూపిస్త మావ కథ కాన్సెప్ట్ తోనే నేను లోకల్ అంటూ సినిమా చేసి హిట్ కొట్టాడు. ఇక తాజాగా రామ్ హీరోగా హలో గురు ప్రేమకోసమే అంటూ... రొటీన్ కథనే తీసుకుని వైవిధ్యంగా తెరకెక్కించేందుకు డైరెక్టర్ ప్రయత్నించాడు. ఎక్కడా బోర్ కొట్టకుండా కథనాన్ని నడిపించాడు. అయితే ఫస్ట్ హాఫ్ సరదా సరదాగా గడిచిపోతుంది. ఆఫీసులో వచ్చే సన్నివేశాలు కామెడీ పండించాయి. ప్రణీత తండ్రికి, రామ్ మధ్య వచ్చే డేటాబేస్, ఊప్స్ కాన్సెప్ట్ ప్రశ్నల సీన్లయితే కడుపుబ్బా నవ్విస్తాయి. ఇక సెకండాఫ్ కాస్త నెమ్మదించింది. ఫస్టాఫ్‌లో కామెడీ పండించడంలో సక్సెస్ అయిన డైరెక్టర్.. సెకండాఫ్‌లో మరింత గ్రిప్పింగ్‌ కథనాన్ని నడిపించ లేకపోయాడు. ప్రకాశ్ రాజ్, రామ్ మధ్య వచ్చే సన్నివేశాలు మరి కాస్త ఎఫెక్టివ్‌గా ఉంటే బాగుండనిపిస్తుంది. మధ్య మధ్యలో కామెడీ పంచుతూనే, కాస్త సెంటిమెంట్ టచ్ చేసి.. బోర్ కొట్టకుండా లాగించాడు. సెకండ్ హాఫ్ ప్రకాశ్ రాజ్ - రామ్ మధ్య వచ్చే సీన్లు మరింత ఎఫెక్టివ్‌గా ఉంటే బాగుండేదనిపిస్తుంది. అనుపమ క్యారెక్టర్‌ను మరింత ఎలివెట్ చేస్తే ఆడియెన్స్ మరింతగా కనెక్ట్ అయ్యేవారు. స్టోరీ ముందే అర్థమైపోవడం వల్ల ప్రేక్షకుడిలో ఆసక్తి తగ్గుతుంది. ఉన్నది ఒకటే జిందగీ ప్లాప్ తో ఉన్న రామ్ కి ఈ సినిమా కాస్త ఊరట కలిగింది అనే చెప్పాలి. దేవిశ్రీ మ్యూజిక్ ఆకట్టుకునేలా లేదు. పాటలు పెద్దగా ఎక్కేలా కనబడలేదు. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ హైలెట్ అనేలా ఉంది. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ వర్క్. దిల్ రాజు నిర్మాణ విలువలు బావున్నాయి.

ప్లస్ పాయింట్స్: రామ్ నటన, కామెడీ, యూత్ కనెక్ట్ అయ్యే సబ్జెట్, ఫస్ట్ హాఫ్

మైనస్ పాయింట్స్: పాటలు, ఎమోషన్స్ లో పస లేకపోవడం, క్లైమాక్స్, అనుపమ, ఎడిటింగ్, స్క్రీన్ ప్లే

రేటింగ్: 2.75 /5

Similar News