కాలా బ్లాక్ బ్లస్టర్ అంట..ఫస్ట్ రివ్యూ!

Update: 2018-06-06 11:14 GMT

రజినీకాంత్ నటించిన 'కాలా' చిత్రం రేపు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా కోసం రజిని ఫ్యాన్స్ చాలా వెయిట్ చేస్తున్నారు. 'కబాలి' అంత అంచనాలు లేవు కానీ.. హైప్ మాత్రమే తక్కువగానే ఉంది. ఆలా హైప్ తక్కువగా ఉంటేనే సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు మేకర్స్. సౌత్ లో రిలీజ్ అయ్యే పెద్ద సినిమాలకి దుబాయ్ నుండి ఉమైర్ సందు రివ్యూస్ ఇవ్వడం ఎప్పటినుండో అలవాటే. అదేవిధంగా ఈ సినిమాకి కూడా రివ్యూ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు ఉమైర్ సందు.

అతను ఏం పోస్ట్ చేశాడో చూద్దాం రండి.. 'కాలా' సినిమాలో రజినిది వన్ మ్యాన్ షో. ఆయనకు అంత వయసు మళ్ళిన, దర్శకుడు రంజిత్ పా చాలా చక్కగా తీర్చిదిద్దాడు. ఆ పాత్రకు రజిని జీవం పోసాడు. ముంబై ధారావి ప్రాంతాన్ని తలపించే సెట్ అబ్బురపరిచేలా ఉంది. విలన్ గా నానా పాటేకర్ ది బెస్ట్ ఇవ్వగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో సంతోష్ నారాయణ్ దీనికి పూర్తి న్యాయం చేకూర్చాడు. మొదటినుండి చివరి వరకు ఎక్కడ బోర్ కొట్టకుండా బాగా తీశారు.

హ్యూమా ఖురేషి, ఈశ్వరి రావు లు వాళ్ల పాత్రలకు న్యాయం చేశారు. ఓవర్ అల్ గా చూసుకుంటే ఇది పక్క హిట్. 'కాలా'తో డిస్ట్రిబ్యూటర్లు లాభాలు పండించుకోవడం ఖాయం. ఓపెనింగ్స్ కూడా రికార్డు స్థాయిలో వచ్చే అవకాశం ఉంది. ఈ రివ్యూ బట్టి చూస్తే ఇది బ్లాక్ బస్టర్ అని అర్ధం అవుతుంది. ఎప్పటినుండో ఇలా రివ్యూస్ ఇవ్వడం సంధు అలవాటు. గతంలో చాలా సినిమాలకు ఇలా రిపోర్ట్స్ ఇచ్చిన సంధు అధిక సందర్భాల్లో నిజమే చెప్పాడు. మరి ఇది నిజం అని ఒక క్లారిటీకి రాలేం. రేపు ఈ సమయానికి నిజమైన రిపోర్ట్ వస్తది. అప్పటివరకు వెయిట్ చేయాల్సిందే.

Similar News