కృష్ణార్జున యుద్ధం మూవీ రివ్యూ
బ్యానర్: షైన్ స్క్రీన్స్
నటీనటులు: నాని, అనుపమ పరమేశ్వరన్, రూఖ్సర్ మీర్, బ్రహ్మాజీ, రవి అవానా, సుబ్బరాజు, జయ ప్రకాష్ వి, రాజేంద్ర ప్రసాద్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: హిఫాప్ తమిజ
సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని
ప్రొడ్యూసర్స్: సాహు గారపాటి, హరీష్ పెద్ది
డైరెక్టర్: మేర్లపాక గాంధీ
మాస్ ప్రేక్షకులని అయినా, క్లాస్ ప్రేక్షకులని అయినా ఓవరాల్ గా మెప్పించగల సత్తా ఒక్క నాని కే ఉంది. అందుకే వరుసగా విజయాలు అందుకుంటున్నాడు. ఎవడే సుబ్రహ్మణ్యం దగ్గర నుండి సక్సెస్ ట్రాక్ ఎక్కిన నాని వరుసగా... భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమ గాద, జెంటిల్మన్, మజ్ను, నేను లోకల్, నిన్నుకోరి, మిడిల్ క్లాస్ అబ్బాయితో వరుసగా హిట్స్ కొట్టేసాడు. అయితే నాని ఎలాంటి పాత్ర అయినా తన నేచురల్ నటనతో ఆకట్టుకోగలడని.. లాగే వరుస హిట్స్ తో ఉన్న నాని మార్కెట్ పరిధి కూడా అమాంతం పెరగడంతో దర్శకనిర్మతలు నాని తో సినిమాలు చెయ్యడానికి ఎగబడుతున్నారు. కానీ నాని మాత్రం ఏ కథ బడితే ఆ కథ ఒప్పుకోకుండా తనకు సూటయ్యే.. ప్రేక్షకులు మెచ్చుతారు అనే కథలను ఎంపిక చేసుకుని సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో కృష్ణార్జున యుద్ధం అనే సినిమా చేసాడు. ఈ సినిమాలో నాని ఒకటి క్లాస్ పాత్రని, మరొకటి మాస్ పాత్రని చేసాడు. దర్శకుడు మేర్లపాక తాను తెరకెక్కించిన సినిమాల్లో కామెడిని హైలెట్ చేస్తూ హీరోయిజాన్ని చూపించాడు. మరి ఇప్పుడు నాని తో చేసిన కృష్ణార్జున యుద్ధం సినిమాలో కూడా కామెడీకి పెద్ద పీట వేసినట్లుగా కృష్ణార్జున యుద్ధం ట్రైలర్, టీజర్ లో అర్ధమయ్యింది. ఇక నాని ఈ సినిమాలో మాస్ పాత్రలో ఇరగదీశాడని కూడా కృష్ణార్జున యుద్ధం ట్రైలర్ లో స్పష్టత వచ్చింది. మేర్లపాక గాంధీ - నాని కృష్ణార్జున సినిమాపై ట్రేడ్ వర్గాల్లో అంచనాలున్నాయి. అలాగే ఈ సినిమాని సక్సెస్ఫుల్ నిర్మాత దిల్ రాజు విడుదలచెయ్యడం వాటితో మంచి ఆసక్తి క్రియేట్ కెసిఆ..... కానీ ప్రేక్షకుల్లో మాత్రం పెద్దగా ఆసక్తి కనబడం లేదు. ఎందుకో ఏమో ఖచ్చితంగా కారణం తెలియదు గాని నాని నటిస్తున్న కృష్ణార్జున యుద్ధం సినిమాపై నాని గత సినిమాల్లాగా భారీ హైప్ అయితే ప్రేక్షకుల్లో లేదు. మరి ప్రస్తుతం రామ్ చరణ్ రంగస్థలం హవా మార్కెట్ లో మామూలుగా లేదు మరి వరుస సక్సెస్ లతో అదరగొడుతున్న నాని రంగస్థలాన్ని దాటుకుని ఈ కృష్ణార్జున యుద్ధంతో మరో విజయాన్ని నాని తన ఖాతాలో వేసుకున్నాడో లేదో అనేది సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
నాని ద్విపాత్రాభినయం చేసిన కృష్ణార్జున యుద్ధం సినిమాలో ఒక పాత్ర ఊర మాస్ కాగా.. మరో పాత్ర పూర్తిగా క్లాస్. ఇక కథలోకెళితే కృష్ణ (నాని) పక్కా పల్లెటూరు కుర్రాడు.. అంతేకాకుండా చాలా మొరటోడు, మొండోడు కూడా. అలాగే అర్జున్(నాని) మాత్రం ప్లే బాయ్ మెంటాలిటీ, అన్నీ లైట్ తీసుకునే మనస్తత్వం ఉన్న క్లాస్ కుర్రోడు. సినిమా మొత్తం ఒకసారి కృష్ణ పాత్ర చుట్టూ గ్రామం లో తిరిగితే... మరోసారి అర్జున్ పాత్ర చుట్టూ ఫారిన్ వాతావరణంలో సాగుతుంది. చిత్తూరు జిలాల్లోని ఒక గ్రామంలో కృష్ణ, రియా(రుక్సర్) ని మొదటి చూపులోనే ఇష్టపడతాడు. మరోపక్క అర్జున్ కూడా సుబ్బలక్ష్మి(అనుపమ) అనే అమ్మాయితో తో ప్రేమలో పడతాడు. గ్రామంలో కృష్ణ, రియా ల మధ్యన ప్రేమతో పాటు స్నేహితులతో కలిసి కృష్ణ జాలిగా గడిపేస్తుంటాడు. మరోపక్క అర్జున్ - సుబ్బలక్ష్మి మధ్యన ప్రేమ కూడా అందంగా సాగుతున్న తరుణంలోనే... చిత్తూరులోని కృష్ణ కి, ఫారిన్ లో ఉన్న అర్జున్ కి ఒకేరకమైన సమస్యతో ప్రేమను కోల్పోతారు. మరి కృష్ణ, అర్జున్ లు తమ ప్రేమను కాపాడుకోవడానికి ఏం చేస్తారు? అసలు రెండు చోట్ల ఉన్న వారికీ ఒకే రకమైన సమస్య రావడం ఏమిటి? అసలు కృష్ణ, అర్జున్ లు కలిసి తమకి ఎదురైన సమస్యని ఎలా పరిష్కరించుకున్నారు? అనేది మిగతా కథ.
నటీనటుల నటన:
నేచురల్ స్టార్ నాని అనే బిరుదు నాని కి పక్కాగా సరిపోతుంది అనే మాట మరోమారు రుజువైంది. భలే భలే మగాడివోయ్ సినిమాలో మతిమరుపున్న ప్రేమికుడిగా ఎంత చక్కటి నటన ప్రదర్శించాడో... నిన్ను కోరి సినిమాలో తన ప్రేమను దక్కించుకునే అబ్బాయి పాత్రలో అలాగే అదరగొట్టాడు. ఇక మిడిల్ క్లాస్ అబ్బాయి లో మిడిల్ క్లాస్ అబ్బాయిలా, తనవాడిన కోసం ప్రాణాలిచ్చే కుర్రాడిగా నాని నటన అద్భుతం. ఆ సినిమా కి యావరేజ్ టాక్ వచ్చినా... నాని కున్న క్రేజ్ తో ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక ఈ సినిమా కృష్ణార్జున యుద్ధం లో కూడా నాని పల్లెటూరి కుర్రాడు కృష్ణ గా అదర గొట్టేసాడు. పల్లెటూరి కుర్రాడు కృష్ణ పాత్రలాంటి పాత్రలు చెయ్యడం అనేది నాని కి కొట్టినపిండి. కృష్ణా పాత్రలో కామెడి పండించడానికి మంచి స్కోప్ ఉండడంతో నాని చెలరేగి పోయాడు. ఫస్ట్ హాఫ్ లో ప్రేక్షకులని తన కామెడీ టైమింగ్ తో హాయిగా నవ్వించాడు. కృష్ణా పాత్రలో ఒదిగిపోయిన నాని... అర్జున్ గా పాత్రని మాత్రం అంత గొప్పగా పండించలేకపోయాడు. నాని పలు ఇంటర్వూస్ లో చెప్పినట్టుగానే... కృష్ణా పాత్ర కనెక్ట్ అయినట్లుగా అర్జున్ పాత్ర అంత తొందరగా ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వదు. ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే అనుపమ పరమేశ్వరన్ , రుక్సర్ చూడముచ్చటగా అనిపిస్తారు. ముఖ్యంగా అనుపమ పరమేశ్వరన్ క్యూట్ లూక్స్ తో మెప్పిస్తుంది. అనుపమ ట్రెడిషనల్ గా అదరగొట్టేయ్యగా... రుక్సర్ గ్లామర్ తో పడేస్తుంది. ఇక ఈ సినిమాకి మెయిన్ హైలెట్ బ్రహ్మాజీ కామెడీ. బ్రహ్మాజీ కామెడీ టైమింగ్ తో అదరగొట్టేసాడు. ఇక మిగిలిన వి అవానా, సుబ్బరాజు, జయ ప్రకాష్ వి, రాజేంద్ర ప్రసాద్ తమ పరిధిమేర ఆకట్టుకున్నారు.
సాంకేతిక వర్గం పనితీరు:
హిప్ హాప్ తమిజా అందించిన మ్యూజిక్ లో దారి చూడు ఒక్కటే బ్లాక్ బస్టర్.... కానీ మిగిలిన పాటలు మాత్రం అంత గొప్ప ఫీల్ ని తీసుకురాలేదు. అయితే కృష్ణార్జున యుద్ధంలో బలమైన సీన్స్ లేకపోవడంతో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో తన టాలెంట్ చూపే అవకాశం హిప్ హాప్ కి రాలేదు. ఇక ఈ సినిమాకి మెయిన్ హైలెట్ సినిమాటోగ్రఫీ. కార్తిక్ ఘట్టమనేని ఎప్పట్లానే ప్రతి ప్రేమ ని అద్భుతంగా తీశారు. పల్లెటూరి వాతావరణాన్ని.... సాంగ్స్ పిక్చరైజేషన్ ఇలా అన్ని విషయాల్లో కార్తీ సినిమాటోగ్రఫీ అదరగొట్టేసింది. ఇక ఎడిటింగ్ విషయంలో దర్శకుడు గాంధీ మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది. సెకండ్ హాఫ్ లో పనికిమాలిన సీన్స్ అనేకం ఉన్నాయి. వాటికీ కత్తెర వెయ్యాల్సింది. కృష్ణార్జున కోసం నిర్మాతలు పెట్టిన ఖర్చు మొత్తం ప్రతి ఫ్రెమ్ లోను అనబడుతుంది.
విశ్లేషణ:
దర్శకుడు మేర్లపాక గాంధీ వేంకటాద్రి ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ రాజా చిత్రాలలో కథకు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వకుండా... కేవలం కామెడీనే నమ్ముకున్నాడు. అయితే మేర్లపాక అనుకున్నట్టుగా కామెడీకి పెద్ద పీట వేసి కథని నెగ్లెట్ చేసినా కొన్ని సినిమాలు అలా... కామెడీతోనే ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యి హిట్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి. అలాగే మేర్లపాక గత చిత్రాలు అంతే. రెండు సినిమాల్లో కామెడీ హైలెట్ కావడం. కథ గురించి పెద్దగా పట్టించుకోలేదు ప్రేక్షకులు. ఇక ఇప్పుడు కృష్ణార్జున యుద్ధంలోనూ మేర్లపాక తన గత చిత్రాల ఫార్ములానే పాటించాడు. ఒక రొటీన్ కథని తీసుకుని కామెడీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అయితే ఈ సినిమాలో మూల కథ వీక్ గా ఉండడమే ఈ సినిమాకి అసలైన నెగెటివ్ పాయింట్. మెయిన్ పాయింట్ ని వదిలేసి లవ్ స్టోరీ ల మీద ఫోకస్ పెట్టాడు మేర్లపాక గాంధీ. కృష్ణార్జున యుధం లో కూడా ఫస్ట్ హాఫ్ ఇంప్రెసివ్ గా కామెడీతో కత్తిలా కడుపుబ్బా నవ్విస్తుంది. కానీ సినిమా సెకండ్ హాఫ్ వచ్చేసరికి సినిమా చాలా వరకూ డల్ అయిపోయింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఆసక్తి రేపే స్టఫ్ ఏదీ లేకపోవడం తో సినిమా బోర్ కొట్టేస్తుంది.. రీజనబుల్ క్లైమాక్స్ లేక..... ఏదో హడావిడిగా వెళ్ళిపోతుంది సినిమా అన్నట్టుగా తయారైంది. అసలు ఈ సినిమాకి కథ లో కొత్తదనం లేకపోవడం ప్రధాన సమస్య అయితే .. స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ వరకూ బాగుంది... చేసే కామెడీ హైలెట్. ఇక ఈ సినిమాలో నాని పాత్రకి సంబంధించి కొన్ని డైలాగ్స్ బాగా పేలాయి. ‘ఏందిరా ఈడు.. సిగరెట్ యాడ్‌లో ద్రవిడ్‌లా సంబంధం లేకుండా ఏందేందో మాట్లాడుతున్నాడు’ , ‘చెప్పు మాత్రమే చూపించిందంటే.. ఆ పిల్ల ఊరికి కొత్త అనుకుంటా’ లాంటి డైలాగ్స్ బావున్నాయి. మరి నాని సినిమా కి యావరేజ్ టాక్ వచ్చినా ప్రేక్షకులు మాత్రం హిట్ చేస్తారు. అలా నాని గత సినిమా ఎంసీఏ నిరూపించింది. ఇక ఇప్పుడు కృష్ణార్జున కూడా ఫస్ట్ హాఫ్ హైలెట్, సెకండ్ హాఫ్ డల్ అయినా.. నాని విషయం ప్రేక్షకుల నాడి ఎలా ఉంటుందో అనేది మరో రెండు రోజుల్లో తెలిసిపోతుంది.
ప్లస్ పాయింట్స్: కృష్ణ గా నాని నటన, కామెడి, బ్రహ్మాజీ కామెడి, రెండు పాటలు, ఫస్ట్ హాఫ్, సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్: రొటీన్ స్టోరీ, సెకండ్ హాఫ్, మ్యూజిక్, ఎడిటింగ్
రేటింగ్: 3 .0 / 5