అల్లు అర్జున్ నా పేరు సూర్య ఈ రోజు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. కానీ ఒకరోజు ముందే అంటే గత రాత్రే యుఎస్ లో నా పేరు సూర్య ప్రీమియర్స్ తో హడావిడి మొదలెట్టేసింది. వక్కంతం వంశి అనే కొత్త దర్శకుడితో అల్లుడు అర్జున్ - అను ఇమ్మాన్యువల్ జంటగా లగడపాటి శ్రీధర్, నాగబాబులు కలిసి నిర్మించిన నా పేరు సూర్య యుఎస్ ప్రీమియర్స్ టాక్ అంతగా గొప్పగా ఏమి లేదు. నా పేరు సూర్య ఆర్మీ నేపథ్యంలో సాగే కథ. సినిమా ఫస్ట్ హాఫ్ అంటా చాల స్లోగా ఉందని... ఇక ఫస్ట్ హాఫ్ లో అల్లు అర్జున్ కోప స్వభావాన్ని కలిగిన సైనికుడి పాత్రలో కనబడతాడట. ఫస్ట్ హాఫ్ లో ప్రస్తుతం జరిగే కథతో పాటుగా ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుంది.
యాక్షన్ సీన్స్ ఆకట్టుకునేలా...
సినిమా ఫస్ట్ హాఫ్ కాస్త స్లో అయినప్పటికీ అందులోని యాక్షన్ సీన్స్ మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా ఉన్నాయి. సీనియర్ హీరో అయిన అర్జున్.... సూర్య (అల్లు అర్జున్) కి తండ్రిగా ఒక సైకలాజికల్ ప్రొఫెసర్ గా ఈ సినిమాలో కనబడతాడు.ఇక అల్లు అర్జున్ కి ఆర్మీ లో పనిష్మెంట్ సీన్, ఫ్యామిలీ ఎమోషన్స్, ఇలా అన్ని సీన్స్ కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయనే రిపోర్ట్ అందుతుంది. అసలు నా పేరు సూర్య ఇంటర్వెల్ బ్యాంగ్ కి ముందు నడిచిన విధానం కూడా యావరేజే అంటున్నారు. అయితే సూర్య సెకండ్ హాఫ్ కొంచెం బెటర్ ఉందని చెప్పవచ్చు అని అంటున్నారు.
ఫ్యామిలీ ఎమోషన్స్......
అసలు నా పేరు సూర్య లో ఫ్యామిలీ ఎమోషన్స్ కవర్ చేసే ప్రయత్నం చేసినా వర్కౌట్ అవ్వలేదు. మెయిన్ కథ వీక్ పాయింట్. అయితే ఈ సినిమాలో కాస్త ఊరట కలిగించే అంశాలు మాత్రం యాక్షన్ సన్నివేశాలతో పాటు... అల్లు అర్జున్ డాన్స్ లేనట. ఇక సాంగ్స్ అన్నిటిలో లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో, బన్నీ క్యాప్ ట్రిక్స్ చూడగానే విజిల్స్ వేసే తీరులో ఉన్నాయంటున్నారు. మరి ఈ లెక్కన నా పేరు సూర్య యుఎస్ లో వర్కౌట్ అవదనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. మరి అక్కడ టాక్ ఇలా ఉంటె... రెండు తెలుగు రాష్ట్రాల్లో నా పేరు సూర్య టాక్ ఎలా ఉందొ మరికొద్ది గంటల్లో తెలిసిపోతుంది.