' నా పేరు సూర్య ' షార్ట్ & స్వీట్ రివ్యూ

Update: 2018-05-04 02:57 GMT

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ న‌టించిన నా పేరు సూర్య ఈ రోజు (శుక్రవారం) ప్రపంచ‌వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. టాలీవుడ్‌లో వ‌క్కంతం వంశీ ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాల‌కు స్టోరీలు అందించి స‌క్సెస్ ఫుల్ రైట‌ర్‌గా పేరు తెచ్చుకున్నాడు. చాలా లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఎన్నో క‌ష్టాలు ప‌డి మెగాఫోన్ ప‌ట్టాల‌న్న త‌న కోరిక‌ను వంశీ సూర్య సినిమాతో తీర్చుకున్నాడు. ల‌గ‌డ‌పాటి శ్రీథ‌ర్‌, బ‌న్నీ వాస్ నిర్మాత‌లుగా నాగ‌బాబు స‌మ‌ర్పణ‌లో తెర‌కెక్కిన ఈ సినిమాలో అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్‌. ఓ ప‌వ‌ర్ ఫుల్ ఆర్మీ ఆఫీస‌ర్‌గా బ‌న్నీ కెరీర్‌లోనే తొలిసారి సీరియ‌స్ రోల్‌లో న‌టించిన ఈ సినిమా ఇప్పటికే ప్రీమియ‌ర్లు కంప్లీట్ చేసుకుంది. ప్రీమియ‌ర్ల ప్రకారం సినిమాకు ఎలాంటి టాక్ వ‌చ్చిందో తెలుగుపోస్ట్‌.కామ్ షార్ట్ & స్వీట్ రివ్యూలో ఓ లుక్కేద్దాం.

సైనికుడి పాత్రలో.....

క్రమ‌శిక్షణ‌కు మారు పేరైన సైనికుడి పాత్రలో అల్లు అర్జున్ క‌నిపిస్తాడు. బ‌న్నీతండ్రి పాత్రను అర్జున్ న‌టించాడు. మూవీలో పాత్రల ప‌రంగా అర్జున్ ఓ సైక‌లాజిక‌ల్ ప్రొఫెస‌ర్‌. ఆర్మీ సీన్స్‌ని బాగానే క‌వ‌ర్ చేశారు. అయితే, కథ సడన్ గా వేరే జానర్ లోకి షిఫ్ట్ కావ‌డంతో ప్రేక్షకుడిలో ఉత్కంఠ పోతుంది. ఫ్యామిలీ లవ్ సీన్స్ అన్ని బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చెసినా ఆ సీన్స్ ఆకట్టుకునే విధంగా లేక పోవ‌డం విసుగు తెప్పిస్తుంది. హీరో పాత్ర కనెక్ట్ అయితేనే ఎమోషన్ వర్కౌట్ అవుతుంది. అసలు ఆ పాయింట్ సినిమాలో మిస్ అయ్యిందనే చెప్పాలి.

కొంచెం స్లో అయినట్లు....

మొదట్లో కొన్ని సన్నివేశాల తరువాత సినిమా కథ చాలా స్లో అయినట్టు అనిపిస్తుంటుంది. మధ్యలో ఒక్కోసారి మ‌రింత బోర్ కొట్టిస్తుంది. అసలు ఇది బన్నీ సినిమానేనా అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్ కి ముందు సినిమా నడిచిన విధానం కూడా యావరేజే. సెకండ్ హాఫ్ కొంచెం బెటర్ అనిపించినా.. అలా మెప్పించిన మరో నిమిషానికే సినిమా స్లో అయిపోతుంది. నిజానికి ర‌చ‌యిత వ‌క్కంతం వంశీ క‌లం నుంచి జాలువారిన గ‌త మూవీల‌కు ఈ మూవీల‌కు చాలా డిఫ‌రెంట్ ఉంటుంద‌ని ఆశించిన ప్రేక్షకుల‌కు ఓ ర‌కంగా నిరాశే ఎదురైంద‌ని చెప్పక‌తప్పదు.

సెకండ్ హాఫ్ మాత్రం.....

ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా సాగింది. బన్నీ మొదట చాలా ఆగ్రహ స్వభావం కలిగిన ఒక సైనికుడి పాత్రలో తన పాత్రను ప్రజెంట్ చేస్తాడు. కానీ కథ ముందుకు సాగుతున్న కొద్దీ అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేదు. ఫస్ట్ హాఫ్ కొంచెం ప్రస్తుతం.. కొంచెం ఫ్లాష్ బ్యాక్ మోడ్ లో కథ సాగుతుంది. మూవీలో ఫ్యామిలీ ఎమోషన్స్ కవర్ చేసే ప్రయత్నం చేసినా వర్కౌట్ అవ్వలేదు. సెకండ్ హాఫ్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. యాక్షన్ సన్నివేశాలు మినహాయించి ఇతర సన్నివేశాలు కొంచెం రోటిన్ గా అనిపిస్తాయి. అసలైన ఇంటర్వెల్ పాయింట్ సినిమా సెకండ్ హాఫ్ పై పెద్దగా ఆసక్తిని పెంచదు.

సాంగ్ బెటర్...

ఈ మూవీలో మెయిన్ క‌థే వీక్ గా ఉండ‌డం ప్రేక్షకుల‌కు బోర్ కొట్టిస్తుంది. అయితే, ''లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో'' సాంగ్ కొంచెం బెటర్ చెప్పాలి. అందులో బన్నీ క్యాప్ ట్రిక్స్ మెప్పిస్తాయి. మొత్తంగా ఈ మూవీ అభిమానుల‌ అంచనాలను అందుకోలేదు. మేజర్ గా కథ కథనంలో బలం లేకపోవడం వీక్ పాయింట్. యూఎస్ టాక్ ప్రకారం సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదు అని అనిపిస్తోంది.

మూవీ ప్ల‌స్‌లు

+ బ‌న్నీ యాక్షన్‌

+ సైనికుడిగా బ‌న్నీ హావ‌భావాలు

+ మ్యూజిక్‌

+ అర్జున్‌, బ‌న్సీ సీన్స్‌

+ హీరోయిన్ స‌న్నివేశాలు

మైన‌స్‌లు

+ క‌థ‌లో బ‌లం లేక‌పోవ‌డం

+ కొన్ని సీన్లకు సంబంధం లేక‌పోవ‌డం

+ మూవీ అంతా చాలా స్లోగా ఉండ‌డం

+ ఒక‌టి రెండు లిరిక్స్ బోర్ కొట్టేలా ఉండ‌డం

పూర్తి రివ్యూ కోసం చూస్తూనే ఉండండి తెలుగు పోస్ట్‌.కామ్‌

Similar News