నేల టికెట్ ప్రీమియర్ షో రివ్యూ

Update: 2018-05-25 04:00 GMT

కళ్యాణ్ కృష్ణ - రవితేజ కాంబినేషన్ లో తెరకెక్కిన నేల టికెట్ సినిమా ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విడుదలవుతున్న నేల టికెట్ గత రాత్రి అంటే గురువారం రాత్రే ఓవర్సీస్ లోని థియేటర్స్ లో సందడి చేసింది. రాజా ధీ గ్రేట్ తో మళ్ళీ ఫామ్ లోకొచ్చిన రవితేజ ఈనేల టికెట్ తో ఎలాంటి హిట్ అందుకున్నాడు. కొత్త అమ్మాయి మాళవిక శర్మతో రవితేజ చేసిన రొమాన్స్ ప్రేక్షకులకు ఎంతవరకు నచ్చింది. అసలు నేల టికెట్ ఓవర్సీస్ టాక్ ఏమిటో ఒకసారి చూసేద్దాం.

నేల టికెట్ కథ మాస్ ని టార్గెట్ చేసి తీసిన కథలా అనిపిస్తుంది. కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాలో పెద్దగా కొత్తగా చూపించడానికి ఎలాంటి ప్రయత్నము చెయ్యలేదు. ఫస్ట్ హాఫ్ అంతా రొటీన్ గానే అనిపిస్తుంది. కాకపోతే రవితేజ తన ఎనర్జీతో ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి తన వంతు శ్రమించాడని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎలాంటి కొత్తదనం కనిపించకపోగా.. ఒక్క సీన్ ఆకట్టుకునేలా లేదు. దర్శకుడు తన మార్క్ సినిమాలో అనుకున్నంత స్థాయిలో ప్రజెంట్ చేయలేకపోయాడనే చెప్పాలి. సినిమా కథ బావున్నా నడిపించే విధానంలో తడబడ్డాడు. సందేశాత్మక ఎపిసోడ్స్ రొటీన్ గా అనిపిస్తాయి. ఇక అక్కడక్కడా కామెడీ సీన్స్ మెప్పిస్తాయి. పొలిటికల్ గా బ్యాగ్ద్రోప్ లోనే నేల టికెట్ కథ సాగుతుంది. సెకండ్ హాఫ్ మాత్రం కాస్త ఊరటకలిగిస్తుంది. సెకండ్ హాఫ్ లో యాక్షన్ సన్నివేశాలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక సినిమాలో జగపతి బాబు, పోసానిలా పాత్రలు బావున్నాయి. కొత్త హీరోయిన్ మాళవిక శర్మ తనపాత్రలో మెప్పించి గ్లామర్ ఒలకబోసింది. పాటల్లో మాళవిక అందాలు స్పెషల్ అట్రాక్షన్. కానీ మ్యూజిక్ మాత్రం అంతంత మాత్రంగానే ఉంది.

మరి రవితేజ తన ఎనర్జీతోనే సినిమాని నిలబెట్టగలిగే.. కెపాసిటీ ఉన్నోడు. కానీ ప్రస్తుతం రవితేజకి బ్యాడ్ టైం నడుస్తుందనే చెప్పాలి. మొన్నీమధ్యనే వచ్చిన టచ్ చేసి చూడు ఎప్పుడు థియేటర్స్ లోకి వచ్చిందో.. ఎప్పుడు పోయిందో కూడా తెలియదు. ఏది ఏమైనా సినిమాల్లో రవితేజ మెరుపులు తగ్గినట్టుగానే అనిపిస్తున్నాయి. చూద్దాం రవితేజ నెక్ట్ సినిమాల పరిస్థితి ఏమిటో.. అనేది.

Similar News