నిశ్శబ్దం ఓటిటి రివ్యూ

నిశ్శబ్దం ఓటిటి రివ్యూనటీనటులు: అనుష్క, మాధవన్, షాలిని పాండే, అంజలి, శ్రీనివాస్ అవసరాల, సుబ్బరాజు తదితరులుమ్యూజిక్ డైరెక్టర్: గోపి సుందర్ఎడిటింగ్: ప్రవీణ్ పూడిసినిమాటోగ్రఫీ: శనేయిల్ దెవొ నిర్మాత: కోన [more]

Update: 2020-10-03 03:12 GMT

నిశ్శబ్దం ఓటిటి రివ్యూ
నటీనటులు: అనుష్క, మాధవన్, షాలిని పాండే, అంజలి, శ్రీనివాస్ అవసరాల, సుబ్బరాజు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: గోపి సుందర్
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
సినిమాటోగ్రఫీ: శనేయిల్ దెవొ 
నిర్మాత: కోన వెంకట్, టీజీ విశ్వ‌ప్ర‌సాద్
దర్శకత్వం: హేమంత మధుకర్  

థ్రిల్లర్ సినిమాలైనా, హర్రర్ సినిమాలైనా కథ ఒకేలా ఉన్నప్పటికీ… దాన్ని తెరకేకించే విధానం, అందులోని ట్విస్ట్ లే ప్రేక్షకులను కుర్చీలకు అతుక్కుపోయేలా చేస్తాయి. అందుకే ఆ జోనర్ లో ఎన్ని సినిమాలొచ్చినా.. థ్రిల్లర్, హర్రర్ సినిమాలకు అంత క్రేజ్ ఉంటుంది. బాహుబలి, భాగమతి తర్వాత సినిమాలకు దొరక్కుండా భారీ గ్యాప్ ఇచ్చిన అనుష్క మళ్ళీ నిశ్శబ్దం మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. అందులోని అనుష్క ఓ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లో మ్యూట్ క్యారెక్టర్ లో కనిపిస్తుంది అంటే ఆ సినిమాపై ఎంత క్రేజ్, ఎన్ని అంచనాలుంటాయి. అనుష్క కేరెక్టర్ కి లింక్ చేస్తూ సినిమాకి కూడా నిశ్శబ్దం అనే టైటిల్ పెట్టాడు దర్శకుడు హేమంత మధుకర్. అనుష్క మెయిన్ లీడ్ అంటే అందులో ఎవరూ నటించినా పట్టించుకోరు. లాక్ డౌన్ ముందే విడుదల కావాల్సిన నిశ్శబ్దం.. నిశ్శబ్దంగానే ఓటిటి కి రిలీజ్ రెడీ అయ్యింది. మంచి ప్రమోషన్స్ తో అమెజాన్ ప్రైమ్ లో నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి నిశ్శబ్దం ఎలా ఉందొ సమీక్షలో చూసేద్దాం..

కథ: 
హర్రర్ కథల్లో మాదిరిగానే నిశ్శబ్దంలోనూ హాంటెడ్ హౌస్ (వుడ్ సైడ్ విల్లా) లో సినిమా మొదలవుతుంది.  సాక్షి (అనుష్క‌) ఓ పెయింటర్. సాక్షి కి వినిపించ‌దు. మాట్లాడ‌లేదు. అలా ఓ పెయింటింగ్ ఎగ్జిబిషన్ లో పెయింటింగ్ వేసినప్పుడు… ఆ ఎగ్జిబిషన్ ఓపెనింగ్ కి వచ్చిన అమెరికాలోని ప్రఖ్యాత మ్యుజీషియ‌న్ ఆంటోనీ (మాధ‌వ‌న్‌) సాక్షి పెయింట్స్ చూసి ఇంప్రెస్ అవుతాడు. సాక్షితో క్లోజ్ గా మూవీ అవుతూ ఆమె మంచి మ‌న‌సు చూసి ఇష్ట‌ప‌డ‌తాడు. అయితే సాక్షి ఫ్రెండ్ సోనాలీ (షాలినీ పాండే) సాక్షి ఎవరికీ దగ్గరైన తట్టుకోలేడు. సోనాలి మ‌న‌స్త‌త్వం విచిత్రంగా ఉంటుంది. అయితే ఆంటోనికి – సాక్షికి ఎంగేజ్మెంట్ అయ్యాక సోనాలి కనబడకుండా పోతుంది. ఆ బాధనుండి బయటపడడానికి సాక్షిని తీసుకుని ఆంటోని పెయింటింగ్ కి రిప్లికా కోసం హాంటెడ్ హౌస్‌కి వెళతారు. ఆ వుడ్ సైడ్ విల్లాలో  దెయ్యాలు ఉన్నాయ‌ని ప్రచారం జరుగుతుంది. అయితే పెయింటింగ్ కోసం సాక్షి తో పాటుగా వచ్చిన ఆంటోని అక్కడ హత్య చెయ్యబడతాడు. అసలు ఆంటోనిని చంపింది దెయ్య‌మేనా?  లేదా ఎవరైనా హత్య చేసారా? ఈ కేసుని ద‌ర్యాప్తు చేస్తున్న మ‌హా (అంజ‌లి) ఎలాంటి నిజాల్ని వెదికి తీయ‌గ‌లిగింది? సాక్షి ఫ్రెండ్ సోనాలి ఏమైంది?  అనేది తెలియాలంటే నిశ్శ‌బ్దం సినిమా చూడాల్సిందే.

నటీనటుల నటన:
సినిమా మొత్తం అనుష్క, మాధవన్, షాలిని పాండే చుట్టూనే తిరుగుతుంది. ఇక సాక్షి పాత్రలో అనుష్క.. మ్యూట్ కేరెక్టర్ లో ఇరగదీసింది. దీనికోసం అనుష్క ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ సైన్ లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకుందో ఆ కష్టం తెర మీద కనబడుతుంది. కాకపోతే లుక్స్ పరంగా అనుష్క మ‌రీ బొద్దుగా త‌యారైపోయింది. మాట‌లు లేకుండా సైగ‌లే. అనుష్క పాత్ర‌ని మ‌రీ బొమ్మ‌లా మార్చేశారు. ఇక అమెరికా నేపథ్యంలో తీసియాన్ కథ కావడం చేత అనుష్క చేత అక్కడి కల్చర్ కి అతగిన దుస్తులు వేయించారు అక్కని.. అనుష్క బొద్దుగా అవడంతో.. డ్రెస్సెస్ పరంగా కూడా తేలిపోయింది. ఇరాక్ ఆంటోని గా, మ్యూజిషియన్ గా మాధ‌వ‌న్ లుక్స్ ఆక‌ట్టుకుంటాయి. అంజలి లుక్స్ పరంగాను, వృత్తికి పరంగాను తేలిపోయింది. ఇక షాలిని పాండే ఓ విచిత్రమైన మనస్తత్వంతో కనిపిస్తుంది. నటన పరంగా పర్వాలేదు. సుబ్బ‌రాజుకి చాలా రోజుల త‌ర‌వాత కాస్త‌ నిడివి ఉన్న పాత్ర దొరికింది. ఇక ఇంతకూ మించి ఈ సినిమాలో చెప్పుకోదగిన పాత్రలేవీ కనిపించవు.

విశ్లేషణ:
థ్రిల్లర్ – హర్రర్ జోనర్ కథల్ని ఓ బూత్ బంగళాలో మొదలైనట్టుగానే ఈ నిశ్శబ్దం కథని ఓ హాంటెడ్ హౌస్ నుండే మొదలు పెట్టాడు దర్శకుడు హేమంత్ మధుకర్. వుడ్ సైడ్ విల్లాలో దెయ్యాలున్నాయని.. అక్కడ నివసిస్తే చనిపోతారని.. అందుకే ఆ ఇల్లు పాడుబడిన బంగాళా లా మారిపోవడం, ఓ పెయింటింగ్ కోసం హీరో – హీరోయిన్ అక్కడికి వెళ్లగా హీరో హత్య చెయ్యబడడం ఇవన్నీ మనం చాల సినిమాల్లో చూసేసాం. ఇక అనుష్క మ్యూట్ పాత్ర చూడగానే మనకి వసంత కాలం లో నయనతార పాత్ర గుర్తుకు వస్తుంది. ఆ సినిమాలో నయనతార మ్యూట్ కేరెక్టర్ చెయ్యడమే కాదు, ఓ పెయింటర్ కూడా. మన కథలోని హీరోయిన్ అనుష్క కూడా ఓ పెయింటర్ అలాగే మ్యూట్ కేరెక్టర్. ఇక మాధవన్ సైకో కేరెక్టర్ చూడగానే మన్మధ సినిమాలో శింబు పాత్ర గుర్తుకు వస్తుంది. శింబు కూడా తమ్ముడిని మోసం చేసిన అమ్మాయిని చంపినట్టుగానే.. బాయ్ ఫ్రెండ్స్ ని మోసం చేసే అమ్మాయిలని చంపేస్తున్నట్టుగా నిశ్శబ్దం లో మాధవన్ తనని మోసం చేసిన భార్యతో పాటుగా మగాళ్లని మోసం చేసే అమ్మాయిలను చంపెయ్యడం.. ఇలా నిశ్శబ్దంలోని ప్రతి సీన్ ఎప్పుడో ఎక్కడో చూసిన ఫీలింగ్. థ్రిల్లర్ సినిమాలకు.. కథ అర్ధమైన అందులోని ట్విస్టులు ప్రాణం పోస్తాయి. కథ తెలిసిపోయినా తర్వాత సన్నివేశం ఏమిటా? అని ప్రేక్షకుడు ఆసక్తి ఫీల్ అయ్యేలా కథను తెర మీద ఉంచితే ఆ సినిమా హిట్టే. కానీ దర్శకుడు ఆ లాజిక్ మిస్ అయ్యాడు. చాలా థ్రిల్లర్ సినిమాలు చూసేసి ఈ నిశ్శబ్దం కథని తయారు చేసుకున్నాడనిపిస్తుంది. అనుష్క తో మ్యూట్ కేరెక్టర్ చేయించి కథలో కొత్తదనం చూపించాలనుకున్నాడు. కానీ అది మిస్ ఫైర్ అయ్యింది. ఇక అంజలి పోలీస్ ఆఫీసర్ గా కథలోని ట్విస్ట్ లు చెప్పెయ్యడం పెద్దగా ఇంట్రెస్టు అనిపించదు. అలాగే షాలిని పాండే పాత్రని కానీ, మాధవన్ అలా సైకో గా ఎందుకు మారాడో చెప్పిన తీరు కూడా ఆసక్తిగా అనిపించదు. ఇక ఆంటోని మర్డర్ కి షాలిని మర్డర్ కి ఉన్న లింక్ ట్విస్ట్ బావుంది. ఇక సినిమా మొత్తం అమెరికా లొకేషన్స్ లో సాగడం వలన అందులోని ఇంగ్లీష్ డైలాగ్స్ ని అర్ధం చేసుకోవడానికి తెలుగు ప్రేక్షకుడు చాలా ఇబ్బందే పడతాడు. ఏదేమైనా నిశ్శబ్దం క్లాస్ పీపుల్అండ్ మల్టిప్లెక్స్ ఆడియన్స్ కి సరిపోయే మూవీనే కానీ…. మాస్ కి ఏమాత్రం ఎక్కదు.

సాంకేతికంగా..
థ్రిల్లర్ సినిమాలకు నేపధ్య సంగీతం ప్రాణం పోస్తుంది. గిరీష్ అందించిన నేపథ్య సంగీతం పర్వాలేదనిపిస్తుంది. పాటలు కూడా కథానుసారం ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. ముఖ్యంగా హారర్ సన్నివేశాల్లో సీన్ లోని మూడ్ ని తన కెమెరా యాంగిల్స్ తో కళ్ళకు కట్టినట్టు చూపించాడు కెమెరామెన్. ఇక ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు కథానుసారం ఉన్నాయి.

రేటింగ్: 2.25/5

Tags:    

Similar News