' నోటా ' షార్ట్ & స్వీట్ రివ్యూ

Update: 2018-10-05 02:46 GMT

బ్యాన‌ర్‌: స్టూడియో గ్రీన్

న‌టీన‌టులు: విజయ్ దేవరకొండ, మెహ్రీన్ పిర్జాదా, నాజ‌ర్‌, స‌త్య‌రాజ్‌

కొరియోగ్రఫీ: సంతానా కృష్ణన్ రవిచంద్రన్

సంగీత దర్శకుడు: శక్తీకాంత్ కార్తీక్

దర్శకుడు: ఆనంద్ శంకర్

విడుదల తేదీ: 05 వ అక్టోబర్, 2018

ర‌న్ టైం : 149 నిమిషాలు

టాలీవుడ్‌లో సంచ‌ల‌నంగా మారిన యువ‌హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా ఆనంద్ శంక‌ర్ ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కిన సినిమా నోటా. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా ఈ రోజు ప్రపంచ‌వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. వ‌రుస విజ‌యాల‌తో జోరుమీదున్న విజ‌య్ నోటాకు భారీ ప్రి రిలీజ్ బిజినెస్ కూడా జ‌రిగింది. ఇప్పటికే ఓవ‌ర్సీస్‌లో ప్రీమియ‌ర్లు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు ఎలాంటి టాక్ ఉందో ? తెలుగుపోస్ట్‌.కామ్ షార్ట్ రివ్యూలో చూద్దాం.

పొలిటికల్ డ్రామా.....

పొలిటిక‌ల్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కిన నోటా విజ‌య్‌కు అంత‌గా సూట్ కాలేదు. ఇప్పటి వ‌ర‌కు విజ‌య్ అంటే ప్రేమ‌, ఫ్యామిలీ స్టోరీలే చేశాడు. రొటీన్‌కు భిన్నంగా కొత్తగా ట్రై చేసినా క‌థ‌లో ద‌మ్ము లేక‌పోవ‌డంతో సినిమా తేలిపోయింది. ఫ‌స్టాఫ్ సినిమా సీరియ‌స్ మోడ్‌లో సాగుతూ యావ‌రేజ్‌గా మెప్పించినా కీల‌క‌మైన సెకండాఫ్‌లో ద‌ర్శకుడు చేతులు ఎత్తేశాడు. సెకండాఫ్ అంతా స్క్రీన్ ప్లే తేలిపోయింది. గ్రిప్పింగ్ సన్నివేశాలు లేకుండా బోర్ కొట్టించింది. ఈ సినిమా త‌మిళ రాజ‌కీయాల‌కు ద‌గ్గర‌గా ఉండడంతో తెలుగు ప్రేక్షకుల‌కు ఎంత వ‌ర‌కు క‌నెక్ట్ అవుతుందో ? చెప్పలేం.

ముఖ్యమంత్రిగా.....

తండ్రి కోరిక మేర‌కు తండ్రి నుంచి ముఖ్యమంత్రిగా విజ‌య్ బాధ్యత‌లు స్వీక‌రించ‌డం, యువ జ‌ర్నలిస్టుగా మెహ్రీన్ ఇలా వీరిద్దరు త‌మ ప‌రిధి మేర‌కు బాగానే న‌టించారు. ముఖ్యమంత్రి అయినా జాలీలైఫ్‌ను అనుభ‌వించే హీరో విజ‌య్ చివ‌ర‌కు సీరియ‌స్ ముఖ్యమంత్రిగా ఎలా మారాబు ? అధికార‌, విప‌క్షాల మ‌ధ్య పొలిటిక‌ల్ వార్ ఎలా న‌డుస్తుందో ? అన్న కాన్సెఫ్ట్‌తో సినిమా ర‌న్ అవుతుంది. సినిమా అంతా సీరియ‌స్‌గానే ఉండ‌డం, సెకండాఫ్‌లో చాలా బోర్ స‌న్నివేశాలు, కామెడీ లేక‌పోవ‌వ‌డంతో సినిమా అంచ‌నాలు ఏ మాత్రం అందుకోలేదు. పూర్తి రివ్యూ కోసం చూస్తూనే ఉండండి తెలుగుపోస్ట్‌.కామ్‌

Similar News