' ఆఫీస‌ర్' షార్ట్ & స్వీట్ రివ్యూ

Update: 2018-06-01 04:32 GMT

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున - సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ కాంబినేష‌న్ అంటే ఎలాంటి క్రేజ్ ఉంటుందో తెలిసిందే. రెండున్న‌ర ద‌శాబ్దాల క్రింద‌ట వీరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన శివ తెలుగు సినిమా చరిత్ర‌ను తిర‌గ‌రాసి ఓ ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచింది. ఆ తర్వాత వీరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సినిమాలు ఆ రేంజ్ స‌క్సెస్ అవ్వ‌లేదు. చాలా లాంగ్ లాంగ్ గ్యాప్ త‌ర్వాత నాగార్జున - వ‌ర్మ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సినిమా ఆఫీస‌ర్‌. వ‌ర్మ త‌న సొంత బ్యాన‌ర్‌లో రూపొందించిన ఈ సినిమా ఈ రోజు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇప్ప‌టికే ప్రీమియ‌ర్లు కంప్లీట్ చేసుకున్న ఆఫీస‌ర్ టాక్ ఎలా ఉంటో షార్ట్ & స్వీట్ రివ్యూలో చూద్దాం.

వ‌ర్మ త‌న‌కు అల‌వాటు అయిన‌ట్టుగానే ముంబై మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఆఫీస‌ర్‌ను తెర‌కెక్కించాడు. ఓ కేసును ఇన్వెస్ట్ చేసే ఆఫీస‌ర్‌గా నాగ్ న‌టించాడు. నాగ్ చేప‌ట్టిన సిట్ ఆఫ‌రేష‌న్ ఫెయిల్ చేసేందుకు ఆ గ్యాంగ్ నాగ్‌ను చంపేక్ర‌మంలో అత‌డి భార్య‌ను చంపేస్తుంది. ఆ త‌ర్వాత నాగ్ త‌న‌దైన స్టైల్లో ఇన్వెస్ట్‌గేష‌న్ చేసి విల‌న్ గ్యాంగ్‌లో చేరి వాళ్ల‌ను ఒక్కొక్క‌రిని ఎలా చంపాడు ? అన్న‌దే ఆఫీస‌ర్ క‌థ‌.

ఓవ‌రాల్‌గా చూస్తే ఓ క్రైం ఇన్వెస్ట్‌గేష‌న్ నేప‌థ్యంలో సాగే సినిమాగా వ‌ర్మ ఆఫీస‌ర్‌ను తెర‌కెక్కించాడు. తండ్రి-కూతుళ్ల మ‌ధ్య వ‌చ్చే ఎమోష‌న‌ల్ స‌న్నివేశాలు సినిమాకు ఆయువుప‌ట్టుగా నిలిచాయి. ఇక రవిశంకర్ సంగీతం బాగుంది, ముఖ్యంగా పాపతో వచ్చే నవ్వే నవ్వు సాంగ్ చాలా బాగుంది. కొన్ని స‌న్నివేశాల్లో నేప‌థ్య సంగీతం కూడా మెప్పించింది.

వ‌ర్మ సినిమాను యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గాను, ఎమోష‌న‌ల్‌గా క‌నెక్ట్ చేయ‌డంతో ఎంట‌ర్‌టైన్‌మెంట్ మిస్ అయ్యింది.

ఇక వ‌ర్మ కొన్ని సన్నివేశాల్లో పాత వ‌ర్మ టేకింగ్ గుర్తు చేసింది. ఇక ఓవ‌రాల్‌గా చూస్తే యాక్ష‌న్ సినిమాగానే ఆఫీస‌ర్ నిలుస్తుంది. నాగార్జున కెరీర్ ప‌రంగా మంచి సినిమాయే అయినా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అవుతుందా ? అన్న‌ది చూడాలి.

ప్ల‌స్‌లు (+) :

- నాగార్జున రోల్‌

- ఫ‌స్టాఫ్‌లో డిఫ‌రెంట్ స్టోరీ లైన్‌

- నాగ్‌కు పాప‌కు మ‌ధ్య వ‌చ్చే ఎమోష‌న‌ల్ సీన్లు

- సంగీతం

మైన‌స్‌లు (-):

- వీక్‌గా ఉన్న క్యారెక్ట‌ర్లు

- బోరింగ్ సెకండాఫ్‌

- నిర్మాణ విలువ‌లు

- మిస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌

ఫైన‌ల్‌గా...

యాక్ష‌న్ ప్రియుల‌ను మెప్పించే ఆఫీస‌ర్ బాక్సాఫీస్ స్టామినా ఎంత అనేది చూడాలి.. పూర్తి రివ్యూ కోసం చూస్తూనే ఉండండి తెలుగుపోస్ట్‌.కామ్‌

Similar News