శర్వానంద్ - హను రాఘవపూడి ల పడి పడి లేచే మనసు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ రోజు శుక్రవారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విడుదలవుతున్న ఈ సినిమా అప్పుడే ఓవర్సీసీ లో ప్రీమియర్స్ పూర్తి చేసేసుకుంది. శర్వానంద్ కి జంటగా సాయి పల్లవి నటించిన ఈసినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ప్రేక్షకుల అంచనాలకు తగినట్టుగానే క్యూట్ లవ్ స్టోరీగా ఈ సినిమా ఉందంటున్నారు ఓవర్సీస్ ప్రేక్షకులు. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా మొదట్లో శర్వానంద్ చెప్పే ఫ్లాష్ బ్యాక్‌తో సినిమా స్టార్ట్ అవుతోండట. సూర్య(శర్వానంద్) వైశాలి (సాయిపల్లవి) అనే డాక్టర్ ని పిచ్చిగా ప్రేమిస్తుంటాడు. కొన్ని తప్పనిసరి పరిస్తితుల్లో వైశాలి కూడా సూర్య ని ప్రేమించినట్లుగా కనిపిస్తుంది.
సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం డీసెంట్ గా రొమాంటిక్ గా క్యూట్ గా ఉందని. అలాగే పాటలు కూడా సిట్యువేషన్ కి తగ్గట్టుగా ఆకట్టుకున్నాయంటున్నారు. కథలో కొత్తదనం లేకపోయినా.. దర్శకుడు హను రాఘవపూడి హీరో హీరోయిన్ మధ్యన రొమాంటిక్ ఎపిసోడ్ ని కొత్తగా డిజైన్ చేసాడంటున్నారు. ఇంటర్వెల్ ముందు వరకు సినిమా నీట్ గా ఆకట్టుకుందని.. మంచి ట్విస్ట్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ ఆకట్టుకునేలా ఉందంటున్నారు. ఇక సెకండ్ హాఫ్ కూడా పర్వాలేదంటున్నారు. కథ కొత్తగా లేకపోయినా... దర్శకుడు హను కథనాన్ని గ్రిప్పింగ్ తో ఆకట్టుకునే సన్నివేశాలతో ప్రేక్షకులను కట్టిపడేసాడంటున్నారు. ఈ సినిమాకి శర్వానంద్, సాయి పల్లవిల నటన హైలెట్ అని.. ఒకరిని మించి ఒకరు నటనలో పోటీ పడినట్లుగా చెబుతున్నారు.
టైటిల్ సాంగ్‌తో పాటు మరోపాటలో కూడా సాయి పల్లవి, శర్వానంద్ ల కెమిస్ట్రీ అదిరిపోయిందంటున్నారు. అలాగే హను రాఘవపూడి దర్శత్వం కూడా చాల బావుందని టాక్ ఓవర్సీస్ ప్రేక్షకులనుండి అందుతుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం, జేకే ఫొటోగ్రఫీ ఫస్ట్‌హాఫ్ సినిమాకే హైలెట్‌గా నిలిచాయని.. ఈ సినిమాతో శర్వానంద్, సాయి పల్లవులు సూపర్ హిట్ అందుకున్నట్టేనట.