RDX లవ్ మూవీ రివ్యూ
RDX లవ్ మూవీ రివ్యూ నటీనటులు: పాయల్ రాజపుట్, తేజుస్, సీనియర్ నరేష్, ఆమనీ, నాగినీడు తదితరులు మ్యూజిక్ డైరెక్టర్: రాధాన్ ఎడిటర్: ప్రవీణ్ పూడి సినిమాటోగ్రఫీ: [more]
RDX లవ్ మూవీ రివ్యూ నటీనటులు: పాయల్ రాజపుట్, తేజుస్, సీనియర్ నరేష్, ఆమనీ, నాగినీడు తదితరులు మ్యూజిక్ డైరెక్టర్: రాధాన్ ఎడిటర్: ప్రవీణ్ పూడి సినిమాటోగ్రఫీ: [more]
RDX లవ్ మూవీ రివ్యూ
నటీనటులు: పాయల్ రాజపుట్, తేజుస్, సీనియర్ నరేష్, ఆమనీ, నాగినీడు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: రాధాన్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
సినిమాటోగ్రఫీ: రామ్ ప్రసాద్
ప్రొడ్యూసర్: సి. కళ్యాణ్
డైరెక్టర్: శంకర్ భాను
అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా తెరకెక్కిన RX 100 సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన బోల్డ్ భామ పాయల్ రాజపుట్ ఆ సినిమాలో హీరోయిన్ కం విలన్ రోల్ లో అదిరిపోయే నటనతో ఆకట్టుకుంది. నెగెటివ్ రోల్ లో పాయల్ రాజపుట్ నటనకు RX 100 సినిమాకి బ్రహ్మాండమైన మార్కులు పడ్డాయి. ఆ సినిమాతో బోల్డ్ భామగా సెటిల్ అయిన పాయల్ కి RDX లవ్ సినిమాలో హీరో తో సమానమైన పాత్ర అనే కన్నా లేడి ఓరియెంటెడ్ పాత్ర లభించడం RDX లవ్ సినిమా టీజర్, పోస్టర్స్ లో పాయల్ అందాలు మరీ ఎక్కువగా ఆరబొయ్యడంతో ఈ సినిమా కూడా బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిందిలే అనుకునేలోపు RDX లవ్ ట్రైలర్ విడుదల కావడం ఆ ట్రైలర్ లో పాయల్ నటనకు ప్రాముఖ్యతనివ్వడంతో. ఈ సినిమాలో ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలు ఉన్నాయని సినిమా మీద అంచనాలతో పాటు ప్రేక్షకుల్లో ఆసక్తి కూడా పెరిగింది. మరి నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన RDX లవ్ బోల్డ్ గా ఆకట్టుకుందా? లేదా ఏదైనా మెస్సేజ్ ని సమాజానికి అందించిందా? అనేది సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
చంద్రన్న పేట రివర్ బ్రిడ్జ్ కోసం సిటీకి వచ్చి అక్కడ ప్రభుత్వ పథకాల గురించి ప్రచారం చేసి సోషల్ సర్వీస్ ద్వారా ప్రభుత్వం దృష్టిలో పడి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ సంపాదించి తమ ఊరి సమస్యను పరిష్కరించుకోవడం కోసం అలివేలు (పాయల్ రాజపుట్)సేఫ్ సెక్స్, మరియు కుటుంబ నియంత్రణ వంటి ప్రభుత్వ పథకాల గురించి ప్రజలలో అవగాహన కల్పించే సోషల్ యాక్టవిస్ట్ గా పనిచేస్తూ ఉంటుంది. అయితే ముఖ్యమంత్రిని (బాపినీడు)ను కలిసిన చంద్రన్న పేట ఊరి సమస్య తీరకపోవడంతో హీరో(తేజుస్) ని పావులా వాడుకుని తానూ అనుకున్నది సాధించాలని అనుకుంటుంది అలివేలు. అలివేలు పయత్నం ఫలించి చంద్రన్న పేట కి రివర్ బ్రిడ్జ్ వచ్చిందా? హీరో తేజుస్ ని అలివేలు ఎలా వాడుకుంది? చంద్రన్న పేట రివర్ బ్రిడ్జ్ కోసం అలివేలు ఎలాంటి పనులు చేసింది? అనేది తెలియాలంటే… RDX లవ్ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
దర్శకుడు శంకర్ భాను RDX లవ్ సినిమా ద్వారా ఏం చెప్పాలనుకున్నాడు అనేది సినిమా ఆసాంతం వీక్షించిన ప్రేక్షకుడికి అర్ధం కానీ పరిస్థితి. కథను చెప్పే విధానం ఎక్కడా ఉత్కంఠ కలిగించదు, ఆసక్తి కలిగించని కథనం, నిర్జీవమైన సన్నివేశాలు పరీక్ష పెడతాయి. మొదటి సగంలో సోషల్ యాక్టివిస్ట్ గా పాయల్ చెప్పే డైలాగ్స్ చాలా బోల్డ్ గా అడల్ట్ కామెడీతో సాగాయి. ఫ్యామిలీ ప్రేక్షకులకు ఏమాత్రం సహించని రీతిలో ఆ డైలాగ్స్ ఉండటం ఒక మైనస్ గా చెప్పొచ్చు. మొదటినుండి Aసర్టిఫికేట్ మూవీ అని హింట్ ఇచ్చిన దర్శకుడు శంకర్ భాను.. సినిమా మొత్తాన్ని అదే ఫ్లోతో తెరకెక్కించాడు. బూతు డైలాగ్‌లు, మితిమీరిన శృంగార సన్నివేశాలతో నీలి చిత్రానికి తక్కువ అన్నట్టుగానే సీన్లను రాసుకున్నాడు. అసలు కొన్ని సీన్స్ అయితే కథకు సంబంధం లేకుండా సాగడంతో పాటు సినిమా నిడివి పెంచేశాయి. ఇక ఫస్ట్ హాఫ్ లో చాలా సాఫ్ట్‌గా ఆరబోతకు దూరంగానే ఉన్న పాయల్ సెకండాఫ్‌లో తన గ్లామర్ యాంగిల్ బయటకు తీసింది. కథకు అవసరంలేని అనేక సన్నివేశాలతో సినిమా ఫ్లో దెబ్బతీశారు. హీరోయిన్ పాయల్ సేఫ్ సెక్స్ ప్రచారం, గుట్కా బ్యాన్ వంటి సన్నివేశాలు చాలా సిల్లీగా కథకు అవసరమా అనిపిస్తాయి. సినిమా మొదలైనప్పటి నుంచి సినిమా పూర్తయ్యేవరకు సినిమా ఎప్పుడు అయిపోతే ఎప్పుడు బయటపడదామా అని ప్రేక్షకుడు అనుక్షణం ఎదురు చూసే పరిస్థితిని ఈ సినిమా కల్పించి అంటే… RDX లవ్ ఎలా ఉందొ అర్ధమవుతుంది.
రాధన్ మ్యూజిక్ అంతంత మాత్రం గానే ఉంది. సినిమాటోగ్రాఫర్ పనితనం కూడా ఒకే అన్నట్టుగా ఉంది. ఎమోషన్స్ సీన్లలోనూ పాయల్ నాభి సౌందర్యాలను చూపించేందుకు తాపత్రాయ పడ్డాడు అంటే.. ఆయన పనితనం అర్ధమవుతుంది. ఇక సీ కళ్యాణ్ నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగానే ఉన్నాయి.