యు-టర్న్ మూవీ రివ్యూ

Update: 2018-09-13 17:42 GMT

బ్యానర్: బిఆర్ & క్రియేషన్స్ , వైవి కంబైన్స్

నటీనటులు: సమంత, రాహుల్ రవీంద్రన్, ఆది పినిశెట్టి, భూమిక చావ్లా తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్: పూర్ణ చంద్ర తేజస్వి

సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మిరెడ్డి

నిర్మాతలు: శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు

దర్శకత్వం: పవన్ కుమార్

ఈ ఏడాది వరస విజయాలతో సక్సెస్ ట్రాక్ మీదున్న సమంత అక్కినేని ఇప్పుడు యు-టర్న్ అనే సస్పెన్సు థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రంగస్థలంలో రామలక్ష్మి లా, మహానటిలో జర్నలిస్టుగా, అభిమన్యుడిలో సైక్రియాటిస్టు గా ఇరగదీసిన సమంత మూడు సినిమాలతోను సూపర్ హిట్స్ అందుకుంది. అయితే ఇదే ఏడాది కన్నడలో సూపర్ హిట్ అయిన యూ-టర్న్ సినిమాని సమంతా తెలుగులో రీమేక్ చెయ్యాలని భావించడంతో.. భర్త నాగ చైతన్య తో ఒరిజినల్ యు-టర్న్ డైరెక్టర్ ని కలిసి ఈ సినిమాలో తానే నటిస్తానని చెప్పి ఒరిజినల్ యు-టర్న్ దర్శకుడు పవన్ కుమార్ నే తెలుగులోనూ డైరెక్ట్ చేసేలా ఒప్పించి మరీ సమంత ఈ సినిమాలో నటించింది. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన యు-టర్న్ కన్నడలో సూపర్ డూపర్ హిట్టయ్యింది. అయితే ఇక్కడ తెలుగులోనూ, తమిళంలోనూ సమంత లీడింగ్ లో అది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక కీలకపాత్రల్లో నటించిన ఈ సినిమా ఈ రోజు వినాయక చవితి కానుకగా విడుదలైంది. సమంత భర్త నాగ చైతన్య నటించిన సినిమా శైలజారెడ్డి అల్లుడుతో పాటు పోటీగా విడుదలైంది. భారం మొత్తం సమంత మీదే పెట్టేసి నిర్మించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతమేరకు మెప్పించిందో సమీక్షలో తెలుసుకుందాం.

కథ:

జర్నలిజం మీదున్న ఇంట్రెస్ట్ తో రచన (సమంత) టైమ్స్ అఫ్ ఇండియా పత్రికలో ఇంటర్న్‌షిప్ చేస్తుంటుంది. జర్నలిజం మీద పిచ్చితో రచన ఏదైనా సాధించాలనుకుంటుంది. ఆ టైం లోనే ఆర్కే పురం ఫ్లై ఓవర్ మధ్యలో ఉన్న డివైడర్ ఇటుకలను తొలగించి యుటర్న్ ను తీసుకోవడం వల్ల యాక్సిండెంట్లు అవుతున్నాయని గుర్తించి అలా చేస్తున్న వాళ్ళ వివరాలు సేకరిస్తూ ఉంటుంది. ఆ క్రమంలో సుందరం అనే అతన్ని కలిసే ప్రయత్నం చేస్తే విఫలమవుతుంది. ఈ లోపు సుందరం చనిపోతాడు. అతన్ని చివరిసారిగా కలిసే ప్రయత్నం చేసిన రచన మీదే పోలీసులు అనుమాన పడతారు. పోలీసు బృందానికి చెందిన ఎస్ఐ నాయక్ (ఆది) రచనను ప్రశ్నించడానికి ఆమెను కస్టడీలోకి తీసుకుంటారు. ఆమె లిస్టులో ఉన్న వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారని రచనకు తెలుసు.అయితే ఎందుకు రచనా జాబితాలోని వ్యక్తులే ఆత్మహత్య చేసుకున్నారు? రచనకు మరియు ఆ ఆత్మహత్య లకు మధ్య సంబంధం ఏమిటి? అసలు రచనని ఈ హత్యలకు ఆ యూటర్న్‌కి సంబంధం ఏంటి? మాయ ఎలా చనిపోయింది? లాంటి విషయాలు తెరపై చూడాల్సిందే.

నటీనటులు నట:

గ్లామర్ పాత్రలతో టాప్ హీరోయిన్‌ గా సమంత.. స్టార్ హీరోలందరిని చుట్టేసింది. అయితే ఎప్పుడు గ్లామర్ పాత్రలోనా... అనుకున్న సమంత ఇండస్ట్రీ లో తన ప్లేస్‌ను సుస్థిరం చేసుకునేందుకు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలవైపే మొగ్గుచూపుతోంది. గత సినిమాల్లో సమంత ఎప్పుడు.... లవ్, సెంటిమెంట్, రొమాంటిక్ సన్నివేశాలు అంటూ ఆకట్టుకుంటూనే ఉంది. కానీ ఇలా మొదటిసారి యు-టర్న్ అనే సస్పెన్స్ థ్రిల్లర్ అనే కొత్త జానర్‌ను ఎంచుకుని నూటికి నూరుశాతం న్యాయం చేసింది సమంత. ముఖ్యంగా భూమిక ఎదురైన సన్నివేశాల్లో నటనకు పనిచెప్పింది. సీనియర్ నటితో పోటీ పడి నటించింది. యుటర్న్ కున్న ఏకైక ఆకర్షణ సమంతా మాత్రమే. తన భుజాల మీద మొత్తం మోసి నటన పరంగా ఎలాంటి రిమార్క్ రాకుండా కాపాడింది. నేనెందుకు చంపుతాను సర్... అంటూ అమాయకంగా అడిగే సీన్స్ లో సెకండ్ హాఫ్ లో విస్తుపోయే నిజాలు తెలుసుకునే క్రమంలో ఎమోషనల్ సీన్స్ లో సమంత కెరీర్ బెస్ట్ ఇచ్చేసింది. ఇన్విస్టిగేషన్ ఆఫీసర్‌గా ఆది పినిశెట్టి పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యాడు. అయితే ఈ తరహా పాత్రలు ఇంతకు ముందుకు వైశాలి తదితర చిత్రాల్లో చేయడం వల్ల కొత్త అనుభూతి కలగకపోయినా.. ఉన్నంతలో తన పాత్రకు న్యాయం చేశారు. సమంతాకు సహాయ పడే పాత్రలో దాదాపు సినిమా మొత్తం కనిపిస్తాడు. సాలిడ్ గా మెప్పించాడు. రాహుల్ రవీంద్రన్ ది సోసో పాత్రే. దాన్ని డిజైన్ చేసిన తీరు ఒరిజినల్ లోనే పేలవంగా ఉంటుంది కాబట్టి అంతకంటే ఆశించలేం. ఇక సీనియర్ హీరోయిన్ భూమిక మాత్రం ఊహించని పాత్రలో షాక్ ఇస్తుంది. కథలో కీలకమైన ట్విస్ట్ లో భూమిక అదరగొట్టే పెరఫార్మెన్సు ఇచ్చింది. మిగిలిన నటీనటులు తమ పరిధిమేర ఆకట్టుకున్నారు.

విశ్లేషణ:

తెలుగు, తమిళంలో యు-టర్న్ సినిమాని రీమేక్ చేసిన పవన్ కుమార్... ఒరిజినల్ వెర్షన్ అనే కన్నడ యు-టర్న్ కి డైరెక్టర్. అయితే పవన్ కుమార్ కన్నడలో సూపర్ హిట్ అయినా యు-టర్న్ ని తెలుగులో పేద్దగా రిస్క్ చేయకుండా ఒక చిన్న మార్పు తప్ప మిగిలినది మొత్తం మక్కికి మక్కి దించేసాడు. ట్రాఫిక్ రూల్స్ పాటించండి.. డివైడర్స్‌ను దాటుకుని వెళ్లొద్దు.. హెల్మెట్‌ను ధరించండి.. సిగ్నల్స్ జంప్ చేయొద్దు.. నో పార్కింగ్‌లో వెహికిల్స్‌ను పార్క్ చేయొద్దు.. తాగి వాహనాలు నడపొద్దు.. లాంటి ట్రాఫిక్ నిబంధనలు వాహనదారుల్లో చైతన్యం నింపేందుకే అయినా.. వాటిని తూచా తప్పకుండా పాటించేవాళ్లు చాలా తక్కువమందే. రాంగ్ రూట్‌‌లో యూ టర్న్ తీసుకుని ప్రయాణం చేయడం వల్ల ఏర్పడే ముప్పును సస్పెన్స్ థ్రిల్లర్‌గా సామజిక బాధ్యతను గుర్తుచేస్తూ.. ఈ సినిమాని దర్శకుడు సింగిల్ లైన్ స్టోరీగా మలిచి సినిమాగా ఆవిష్కరించాడు. అయితే కన్నడ వెర్షన్ చూడని ప్రేక్షకుడికి ఈ తెలుగు యు-టర్న్ ట్విస్టులతో ఆకట్టుకుంది. కానీ ఆ వెర్షన్ చూసిన ప్రేక్షకుడికి ఈ సినిమా చూస్తే బోర్ కొట్టేస్తుంది. సెకండ్ హాఫ్ లో భూమిక పాత్రను ప్రవేశపెట్టిన తరువాత ఈ సినిమా పూర్తిగా భిన్నమైన రీతిలోకి మారుతుంది. సమంత తన పాత్రలో జీవించారని చెప్పాలి. చాలా బేసిక్ లాజిక్స్ ను ఒరిజినల్ లోనే మిస్ చేసిన పవన్ ఇందులో వాటిని కనీసం సరిచేసే ప్రయత్నం చేయలేదు. పది మంది హత్యలకు సహేతుకమైన కారణం చూపకుండా క్లైమాక్స్ లో మాత్రం భూమిక భర్త పాత్రకు ఇచ్చిన ఫినిషింగ్ అంత కన్విన్సింగ్ గా అనిపించదు.

ఇక చిత్రానికి ప్రధాన బలం నేపథ్య సంగీతం.. చంద్ర తేజస్వీ కథకు అనుగుణంగా సీన్స్‌ను ఎలివేట్ చేసేలా అద్భుతమై సంగీతాన్ని ఇచ్చారు. ఈ చిత్రంలో పాటలు లేకపోవడంతో తన ఫోకస్ మొత్తం బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌పైనే పెట్టినట్టుగా అనిపిస్తుంది. నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి హైలైట్. లొకేషన్లు కూడా కథలో భాగంగా ఉండటంతో వాటినే చాలా అందంగా చూపించారు. ఎడిటర్ సురేష్ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకపోయింది. నిర్మాతలు మాత్రం ఈ సినిమాని చాలా సింపుల్ బడ్జెట్ లో లాగించేసారు.

ప్లస్ పాయింట్స్: సమంత, సినిమాటోగ్రఫీ, ఆది పినిశెట్టి, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, స్క్రీన్ ప్లే, ట్విస్ట్ లు

మైనస్ పాయింట్స్: సింగల్ లైన్ స్టోరీ, సెకండ్ హాఫ్ స్లో, సింగల్ లైన్ స్టోరీ, ప్రెడిక్టబుల్ నేరేషన్

రేటింగ్ : 2.25/5

Similar News