బ్యానర్: మంచు ఎంటర్టైన్మెంట్
నటీనటులు: మంచు లక్ష్మి, సామ్రాట్ రెడ్డి, ఆదర్శ్, ప్రియదర్శి, శ్రీకాంత్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: రఘు దీక్షిత్
సినిమాటోగ్రఫీ: సామల భాస్కర్
ప్రొడ్యూసర్: వివేక్, విశ్వ ప్రసాద్
డైరెక్టర్: విజయ్ యేలకంటి
మంచు ఫ్యామిలిలో అందరు నటులే. మోహన్ బాబు గతంలో హీరోగా విలన్ గా ఇరగదీస్తే.. ఇప్పుడు కేరెక్టర్ ఆర్టిస్ట్ గా అదరగొడుతున్నాడు. ఇక ఆయన కుమారులు మంచు విష్ణు, మంచి మనోజ్ లు సో సో హీరోలుగా ఇండస్ట్రీని పట్టుకుని ఏలాడుతున్నారు. యావరేజ్ సినిమాల్తో ఆకట్టుకున్నప్పటికీ... వారిని ప్రేక్షకులు మాత్రం రిజెక్ట్ చేస్తున్నారు. అయితే వారిలో టాలెంట్ ఉన్నప్పటికీ.. వారికున్న బ్యాడ్ లక్ కి తోడు వారు ఎంచుకునే కథలతో వారు మాత్రం హీరోలుగా సక్సెస్ కాలేకపోతున్నారు. ఇక మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి అనగనగ ఒక ధీరుడు సినిమాలో విలన్ గా విశ్వరూపం చూపెట్టి.. దొంగాట సినిమాలో కామెడీగా ఒక అనాధాశ్రమం కోసం తన డబ్బుని తానే కొట్టెయ్యడానికి తనని తాను కిడ్నప్ చేసుకున్న హీరోయిన్ పాత్రలో అదరగొట్టింది. ఇక హీరోయిన్ కుండాల్సిన లక్షణాలు మంచు లక్ష్మి లో లేనప్పటికీ.. తనని తాను నటిగా ప్రూవ్ చేసుకోవడానికి.. విభిన్న కథలతో ప్రేక్షకులకు చేరువవుతున్న ఈ మంచు వారమ్మాయి తాజాగా విజయ్ యేలకంటి దర్శకత్వంలో వైఫ్ అఫ్ రామ్ అనే చిత్రాన్ని చేసింది. మంచు లక్ష్మి మెయిన్ లీడ్ లో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ బాగా ఆకట్టుకుంది. ఇక కేవలం ట్రైలర్ తోనే కాదు... మంచు లక్ష్మి సన్నిహితుల దగ్గరనుండి... ఇండస్ట్రీలోని పలువు ప్రముఖులు ఈ సినిమాని హైలెట్ చేస్తూ పబ్లిసిటీ చెయ్యడం కూడా ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేసింది. మరి మంచు లక్ష్మి వైఫ్ ఆఫ్ రామ్ గా ప్రేక్షకులకు ఎంతవరకు రీచ్ అయ్యిందో సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ బెడ్ మీద ఉన్న దీక్ష(మంచు లక్ష్మి) లేచి చూసేసరికి తన భర్త రామ్(సామ్రాట్ రెడ్డి) చనిపోయాడని తెలుస్తుంది. తనతో పాటు బైక్ మీద వస్తున్న భర్త రామ్ ఈ యాక్సిడెంట్ లో చనిపోగా... తాను మాత్రం క్రిటికల్ కండిషన్ లో హాస్పిటల్ లో జాయిన్ అయినట్లుగా గ్రహిస్తుంది. అయితే తన భర్త ది తనది యాక్సిడెంట్ కాదని... ఎవరో దాడి చేసి తన భర్త ని హత్య చేసారని భావించిన దీక్ష పోలీస్ ల దగ్గరకి వెళ్లి తనకి జరిగింది చెప్పి తన భర్తను ఎవరు చంపారో తెలుసుకోమని ఫిర్యాదు చేస్తుంది. కానీ పోలీస్ లు మాత్రం అది హత్య కాదని... యాక్సిడెంట్ అని దీక్ష చెప్పిన మాటలను పట్టించుకోరు. అయితే పోలీస్ లపై నమ్మకం పోగొట్టుకున్న దీక్ష ఇన్స్పెక్టర్ చారి(ప్రియదర్శి)సహాయంతో సొంతంగా తన భర్తను హత్య చేసిన వాళ్ళను పట్టుకోవడానికి రంగంలోకి దిగుతుంది. చారి, దీక్ష చేస్తున్న ఇన్వెస్టిగేషన్ లో ఎన్నో ఊహించని విషయాలు వారికీ ఎదురవుతాయి. అసలు దీక్ష భర్త రామ్ హత్య వెనుక వున్న కారణం ఏమిటి? అసలు రామ్ ని ఎవరు హత్య చేయిస్తారు? ఆ ఇన్వెస్టిగేషన్ లో దీక్షకు తెలిసిన విషయాలేమిటి? అనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది.
నటీనటులు:
మంచు లక్ష్మి దీక్ష పాత్రలో అదరగొట్టిందనే చెప్పాలి. తన భర్త హత్య వెనుకున్న కారణాన్ని వెతకడానికి... ప్రియదర్శి తో పాటుగా లక్ష్మి మంచు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బావుంటుంది. ఇక మంచు లక్ష్మి కి హీరోయిన్ అయ్యే బాడీ లాంగ్వేజ్ లేకపోయినా.. స్పెషల్ కేరెక్టర్స్ అండ్ విలన్ రోల్స్ కి సూటయ్యే బాడీ లాంగ్వేజ్ ఉండడం ప్లస్ పాయింట్. ఇక డైలాగ్ డెలివరీలో మంచు లక్ష్మి ఎప్పుడూ మెప్పిస్తుంది. కానీ ఎక్సప్రెషన్స్ పరంగా మంచు లక్ష్మి వైఫ్ రామ్ లో తేలిపోయిందనే చెప్పాలి. మంచు లక్ష్మి లుక్స్ కూడా కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. ఇక మంచు లక్ష్మి భర్త కేరెక్టర్ చేసిన బిగ్ బాస్ సామ్రాట్ రెడ్డి కి ఈ సినిమాలో నటించే స్కోప్ అంతగా లేదు. ఇక ఆదర్శ్ బాలకృష్ణ రామ్ ని చంపేసే విలన్ పాత్రలో ఆకట్టుకున్నాడు. ఎస్సై గా ప్రియదర్శి నటన కూడా మెప్పిస్తుంది. మంచు లక్ష్మికి సపోర్టింగ్ రోల్ లో రెచ్చిపోయిన ప్రియదర్శి డైలాగ్స్ విషయంలో గాని.. ఫేస్ ఎక్సప్రెషన్స్ తో గాని మెప్పించాడు. మిగతావారు తమ పరిధిమేర ఆకట్టుకున్నారు.
విశ్లేషణ:
దర్శకుడు విజయ్ ఈ చిత్రాన్ని రెగ్యులర్ ఫార్మేట్ లో తెరకెక్కించినప్పటికీ... స్క్రీన్ ప్లే తోనే పడేసాడు. ఇక మంచు లక్ష్మి ని వైఫ్ ఆఫ్ రామ్ పాత్రలో బాగా చూపించాడు. సినిమా కథలో బలం లేకపోయినా.. కథనం విషయంలో తగిన శ్రద్ద తీసుకుని.. నడిపించిన తీరు అభినందనీయం. కథ సింగల్ లైన్ కావడం ఈ సినిమా కి మెయిన్ మైనస్. ఎక్కువ ట్విస్టులకు అవకాశం లేకపోవడం వల్ల రెండు గంటల సినిమానే అయినా ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. కథను ఎస్టాబ్లిష్ చేసిన తీరు మెప్పించిన, ముందుకు వెళ్లే కొద్దీ ప్రేక్షకుడు ఊహకు తగ్గట్టుగానే వెళ్లడం మధ్యలో ఇబ్బంది పెడుతుంది. మరి ఇలాంటివి చెయ్యాలి అంటే కత్తి మీద సామే కాదు.. సాహసమనే చెప్పాలి. కమర్షియల్ ఎలిమెంట్స్ కి దూరంగా రెగ్యులర్ ఫార్మేట్ కు దూరంగా ఈ సినిమా ప్రేక్షకాదరణ దక్కడం అనేది కాస్త కష్టమైనా పనే అయినప్పటికీ... మూవీ యూనిట్ పని చేసిన తీరు అభినందనీయమే. ఇక ఫస్ట్ హాఫ్ ని సాగదీసిన.. సెకండ్ హాఫ్ ఆసక్తికరంగా మలిచి విజయ్ మెప్పించాడు.
రఘు దీక్షిత్ బ్యాక్ గ్రౌండ్ జస్ట్ ఉండాలంటే ఉంది అంతే. గొప్పగా ఏమి లేదు. కానీ నేపధ్య సంగీతంతో రఘు పడేసాడు. కొన్ని సన్నివేశాల్లో నేపధ్య సంగీతం సినిమా స్థాయిని పెంచింది. సామల భాస్కర్ సినిమాటోగ్రఫీ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అనిపిస్తుంది. అనేక సీన్స్ లో కెమెరా పనితనం చాల బావుంది. కొన్ని సన్నివేశాలను చాలా సహజంగా చిత్రీకరించాడు. సందీప్ గంటా డైలాగులు మామూలుగా ఉన్నాయి. ఎడిటర్ తమ్మిరాజు సినిమాను రెండు గంటలకు కుదించినా మరో ఇరవై నిముషాలు కత్తెర వేసే అవకాశం ఉంది. ఫస్ట్ హాఫ్ లో చాలా సీన్స్ డ్రాగ్ చేసినట్లుగా అనిపిస్తుంది. ఇక ఈ సినిమా నిర్మాణ పరంగా బాగానే ఖర్చు పెట్టారు.
ప్లస్ పాయింట్స్: మంచు లక్ష్మి, నేపధ్య సంగీతం, సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్
మైనస్ పాయింట్స్: ఎడిటింగ్, కమర్షిల్ ఎలిమెంట్స్ లేకపోవడం, కామెడీ
రేటింగ్: 2.0/5