ఆనందో బ్రహ్మ మూవీ రివ్యూ

Update: 2017-08-18 09:32 GMT

నటీనటులు: తాప్సి పన్ను, శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్, వెన్నెల కిషోర్,రాజీవ్ కనకాల, తాగుబోతు రమేష్

మ్యూజిక్ డైరెక్టర్: కృష్ణ కుమార్

నిర్మాత: విజయ్ చిల్ల మరియు శశి దేవిరెడ్డి

డైరెక్టర్: మహి వి రాఘవ్

చాలా కాలం తర్వాత తాప్సి తెలుగులో లీడ్ రోల్ లో నటించిన చిత్రం 'ఆనందో బ్రహ్మ'. తాప్సి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటినుండి తెలుగులో సెకండ్ హీరోయిన్ పాత్రలే ఎక్కువగా వచ్చాయి. అయితే సోలో హీరోయిన్ గా లేకపోయినా కనీసం సెకండ్ హీరోయిన్ గా కూడా సౌత్ లో సక్సెస్ కాలేక బాలీవుడ్ కి చెక్కేసి సౌత్ సినిమాలను చిన్న చూపు చూస్తున్న టైం లోనే తాప్సి ఈ ఆనందో బ్రహ్మ లో నటించింది. తాప్సి ని మెయిన్ లీడ్ గా మిగతాపాత్రలకి కమెడియన్స్ ని తీసుకుని డైరెక్టర్ మహి వి రాఘవ్ ఈ 'ఆనందో బ్రహ్మ' చిత్రాన్ని తెరకెక్కించాడు. కామెడీ హార్రర్ గా తెరకెక్కించిన ఈ చిత్రంలో కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, షకలక శంకర్ ల కామెడీ సినిమాకి హైలెట్ అంటూ ప్రచారం కూడా చేశారు. ఇక తాప్సి ఇప్పటివరకు చేసిన సినిమాలోని కేరెక్టర్స్ కి ఈ 'ఆనందో బ్రహ్మ' లో చేసిన కేరెక్టర్ పూర్తి భిన్నంగా తాప్సి పాత్ర ఉండబోతుందని ఆనందో బ్రహ్మ చిత్ర ట్రైలర్ లో, పోస్టర్స్ లో చూపించారు. మరి ఇంత భిన్నమైన పాత్ర తాప్సి చెయ్యడానికి కారణం దర్శకుడు చెప్పిన కథే. మరి ఆ దర్శకుడు చెప్పిన కథ ఏమిటి? తాప్సి ఆ కథకి అంతలా ఎట్రాక్ట్ అవడానికి గల కారణం ఏమిటి? మరి తాప్సి అంత ఇష్టపడి చేసిన ఈ ఆనందో బ్రహ్మ తాప్సికి ఎలాంటి సక్సెస్ ఇవ్వబోతుందో అనేది సమీక్షలో తెలుసుకుందాం.

కథ:

ఎన్నారై రాజీవ్ తల్లితండ్రులు ఇండియాలో తీర్ధ యాత్రలకు వెళ్లి అక్కడ మాయమవుతారు. రాజీవ్ ఇండియాకి వచ్చి ఎంత వెతికినా వారు దొరకరు. తల్లితండ్రులు లేని ఇంటిని అమ్మేసి రాజీవ్ ఇండియా వదిలి వెళ్లిపోవాలనుకుంటాడు. అయితే ఆ ఇంట్లో దెయ్యాలున్నాయంటూ ప్రచారం మొదలయ్యి ఆ ఇంటిని కొనడానికి ఎవరు ముందుకు రారు. ఎలాగైనా ఆ ఇంటిని వదిలించుకోవాలనే ఉద్దేశ్యంతో ఆ ఇంటిని తక్కువ ధరకైనా అమ్మెయ్యాలనే నిర్ణయానికి వస్తాడు రాజీవ్. మరో పక్క తాప్సి కుటుంబ సభ్యులకి కూడా ఇంట్లో ఊహించని సంఘటనలు ఎదురవుతుంటాయి. మరోపక్క రాజీవ్ తన ఇంటిని తక్కువ ధరకి బేరం పెడాతాడు. ఇంతలో రాజీవ్ కి సిద్దు (శ్రీనివాస్ రెడ్డి) పరిచయమవుతారు. సిద్ధూ, రాజీవ్ ఇంట్లో దెయ్యాలు లేవని నిరూపించడానికి కొంత డబ్బు అడుగుతాడు. దెయ్యాలు లేవని నిరూపించడమే కాకుండా ఆ ఇంటికి మంచి ధర వచ్చేలా చేస్తానని రాజీవ్ తో సిద్దు ఒప్పందం కుదుర్చుకుంటాడు. రాజీవ్ తో చేసుకున్న ఒప్పందం ప్రకారం సిద్దు తన ఫ్రెండ్స్ తులసి (తాగుబోతు రమేష్), రాజు (వెన్నెల కిశోర్), బాబు (షకలక శంకర్) లతో కలిసి ఆ ఇంట్లో మకాం పెడతాడు. మరి ఆ నలుగురు ఫ్రెండ్స్ ఆ ఇంట్లో దెయ్యాలు లేవని ప్రూవ్ చెయ్యగలుగుతారా? అసలు ఆ ఇంట్లో వారికీ ఎదురైనా పరిస్థితులు ఏమిటి? రాజీవ్ తల్లి తండ్రులు చనిపోవడానికి అసలు కారణమేమిటి? నిజంగా ఆ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయా? ఇవన్నీ తెలియాలంటే ఖచ్చితంగా ఆనందో బ్రహ్మ ని వెండితెర మీద వీక్షించి తెలుసుకోవాల్సిందే.

నటీనటుల పాత్ర:

తాప్సిది ఈ చిత్రంలో చాలా చిన్న పాత్ర. ఆమె పాత్రని కమెడియన్స్ శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్ ల పాత్రలతో పోల్చుకుంటే మాత్రం చాలా చిన్నదిగా అనిపిస్తుంది. పెద్దగా నటనకు ఆస్కారం లేని పాత్రలో తాప్సి ఈ చిత్రంలో నటించింది. కానీ తాప్సి మెయిన్ లీడ్ లో ఈ ఆనందో బ్రహ్మ తెరకెక్కిందని చిత్ర యూనిట్ మాములుగా ప్రచారం చెయ్యలేదు. అంతే తాప్సిని చిత్ర యూనిట్ పబ్లిసిటీ కోసమే ఎక్కువగావాడుకుందనడంలో సందేహం లేదు. ఇక కమెడియన్స్ గా చేసిన శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, షకలక శంకర్ లు తమ పాత్రలకు పూర్తి నాయయం చేశారు. మంచి కామెడీ టైమింగ్ తో బాగానే ఆకట్టుకున్నారు. తాగుబోతు ర‌మేష్ ష‌క‌ల‌క శంక‌ర్ పాత్రల కామెడి సినిమా సెకండాఫ్‌ ప్ర‌థ‌మార్థంలో అల్టిమేట్‌గా ఉంది. రేచీక‌టి, చెవిటివాడుగా ఉంటూ వెన్నెల‌కిషోర్ చేసే కామెడీ ఆక‌ట్టుకుంది. ష‌క‌ల‌క శంక‌ర్ హీరోల‌ను ఇమిటేట్ చేస్తూ చేసే కామెడీ ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా నవ్విస్తుందనడంలో సందేహం లేదు. ఇక ప్ర‌భాస్ శ్రీను, విద్యుల్లేఖా రామ‌న్ లు తమ పరిధిలో నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు:

దర్శకుడు ఈ చిత్రాన్ని హార్రర్ కామెడీగా తెరకెక్కించాలనుకున్నాడు. ప్రేక్షకులను భయపెడుతూ నవ్వించాలనే కాన్సెప్ట్ తోనే ఈ సినిమాని తీసాడు. కానీ దర్శకుడు ప్రయత్నం పూర్తిగా విఫలమయ్యిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఆనందో బ్రహ్మలో కనీసం భయపెట్టే సీన్ ఎక్కడా కనబడదు. కేవలం కామెడీనే హైలెట్ చేసి హర్రర్ ని పక్కన పెట్టేసాడు. అసలు దర్శకుడు మహి నటీనటులను ఉపయోగించుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఈ సినిమాలో కొన్ని కామెడీ సీన్స్ తప్ప మిగతా సినిమాలో చెప్పుకోదగ్గ అంశం ఏం కనబడలేదు. గతంలో ఇలాంటి కథలతో తెరకెక్కిన సినిమాలు మంచి హిట్ సాధించాయి. కానీ ఈ ఆనందో బ్రహ్మ మాత్రం ప్రేక్షకుల సహనానికి పెద్ద పరీక్షే పెట్టిందని చెప్పాలి. ఇక టెక్నీకల్ గా కృష్ణ కుమార్ అందించిన మ్యూజిక్ ఏ మాత్రం ఆకట్టుకోలేక పోగా.... ఈ సినిమాకి మెయిన్ హైలెట్ అవ్వాల్సిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకోలేకపోయింది. సినిమాటోగ్రఫీ కూడా ఏమంత బాగోలేదు. ఇక ఎడిటింగ్ విషయానికొస్తే ఈ చిత్రానికి మెయిన్ మైనస్ ఎడిటింగ్ అని చెప్పడంలో ఎటువంటి మొహమాటం లేదు. అంత చెత్తగా అనిపిస్తుంది. దర్శకుడు మహి సినిమాపై మరింత శ్రద్ద పెట్టినట్లయితే సినిమా ఫలితం మరొకలా ఉండేది. అలాగే స్క్రీన్ ప్లే ని కాస్త ఎంటర్టైన్ గా అయినా నడిపించాల్సింది. అది కూడా సినిమాకి మైనస్ ఆనేలానే వుంది.

సమీక్ష:

తాప్సి ఇప్పుడు సౌత్ సినిమాలను చిన్న చూపు చూస్తూ ఇక్కడ టాలీవుడ్ దర్శకులను తక్కువ చేసి చూపించే పనిలో ఉంది. టాలీవుడ్ దర్శకులకు కేవలం గ్లామ్లర్ చూపించడం తప్ప మరేమి తెలియదన్నట్టు మాట్లాడుతున్న తాప్సి కి బాలీవుడ్ అవకాశాలు దండిగా రావడంతోనే ఇక్కడ తెలుగు సినిమాలను కించపరిచేలా మాట్లాడుతుంది. అయినా అమ్మడుకి తెలుగులో అసలు అవకాశాలే లేవు. అలాంటి టైం లోనే తాప్సి మెయిన్ లీడ్ లో నటింస్తుంది అంటూ ఈ ఆనందో బ్రహ్మని తెరక్కేకించాడు దర్శకుడు మహి. కానీ ఈ ఆనందో బ్రహ్మలో తాప్సి మెయిన్ లీడ్ ఏమిటి. అసలు ఈ చిత్రంలో తాప్సిని ఎందుకు తీసుకున్నారా బాబు అనిపిస్తుంది. అసలు తాప్సికి ఈ సినిమాలో నటించే స్కోప్ లేదు. మరి ఈ సినిమాతో సౌత్ లో అవకాశాలు ఇక తాప్సికి ఉండవనేది మాత్రం బాగా అర్ధమవుతుంది. ఇక సినిమా విషయానికి వస్తే ఈ చిత్రంలో హర్రర్ కి స్కోప్ లేకపోయినా కామెడీకి కావాల్సినంత స్కోప్ ఉంది. కమెడియన్స్ బాగాకష్ట పడ్డ ఈ చిత్రాన్ని ఆ కామెడీ కోసమే ఒకసారి వీక్షించొచ్చు.

ప్లస్ పాయింట్స్: కొన్ని కామెడీ సీన్స్, వెన్నెల కిషోర్ కామెడీ, షకలక శంకర్ కామెడీ, శ్రీనివాస్ రెడ్డి నటన, తాగుబోతు రమేష్ కామెడీ, సెకండ్ హాఫ్

మైనస్ పాయింట్స్: కథ, స్క్రీన్ ప్లే, ఫస్ట్ హాఫ్, ఎడిటింగ్, మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్

రేటింగ్: 2.25 /5

Similar News