మెగా మేనళ్లుడు సాయిధరమ్ తేజ్ - లావణ్య త్రిపాఠి జంటగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇంటిలిజెంట్. ఈ రోజు వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అవుతోన్న ఈ సినిమా ప్రీమియర్ షోలు ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. ఫస్టాఫ్ కూడా కంప్లీట్ అయ్యింది. ఫస్టాఫ్ వరకు సినిమా చూస్తే సాయిధరమ్ తేజ్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. సాయి - లావణ్య త్రిపాఠి మధ్య రొమాంటిక్ కామెడీ సీన్లు బాగున్నాయి.
ఫస్టాఫ్‌లో తేజు సోలో సాంగ్‌లో డ్యాన్సులు కుమ్మేశాడు. ఇక చిరు రీమిక్స్ సాంగ్ అయిన హిట్ సాంగ్ చమకు చమకు అనే సాంగ్‌లో తేజు స్టెప్పులు మేనమామ చిరును గుర్తు చేశాయి. ఈ సాంగ్‌లో లొకేషన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. సప్తగిరి - జయప్రకాష్‌రెడ్డి, తేజు ఫ్రెండ్ రాహుల్ రామకృష్ణ - వేణు మధ్య కామెడీతో వినాయక్ సినిమాను నడిపించాడు.
సినిమాను ఇంటర్వెల్ బ్యాంగ్ ముందు వరకు సోసోగా నడిపించిన దర్శకుడు ఇంటర్వెల్ ముందుకు ఒక్కసారిగా సెటప్ మార్చేశాడు. సాయి పనిచేస్తోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీని విలన్ల గ్యాంగ్ స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించడం సాయి ఎటాక్ స్టార్ట్ చేయడం... వెంటనే దీని వెనక పెద్ద మాఫియా గ్యాంగ్ ఉన్నట్టు తెలియడం... పెద్ద సస్పెన్స్‌తో తేజు ధర్మాభాయ్‌గా ఎంట్రీ ఇవ్వడంతో ఇంటర్వెల్ కార్డు పడుతుంది.
ఫస్టాఫ్ టాక్ ఏంటంటే...
ఫస్టాఫ్ వరకు వినాయక్ సినిమాను రొటీన్ స్టైల్లోనే నడిపించాడు. కొత్తదనం లేదు. హీరో, హీరోయిన్ల లవ్ ట్రాక్, కొన్ని కామెడీ సీన్లు, ఇక ఇంటర్వెల్‌లో మాత్రం చిన్న ట్విస్ట్ వచ్చింది. మరి సెకండాఫ్‌ను వినాయక్ ఎలా పైకి తీసుకెళ్తాడో ? చూడాలి. ఇంటిలిజెంట్ ఆశలన్నీ ఇప్పుడు సెకండాఫ్ మీదే ఉన్నాయి.